సేల్స్‌లో దేశంలోనే టాప్ 3.. రూ.87 వేల స్కూటర్ కోసం కస్టమర్లు షోరూమ్‌కు ఎగబడ్డారు! ఎటూ చూసినా ఇదే
దిగ్గజ టూవీలర్ తయారీదారు సుజుకీ (suzuki)కి చెందిన యాక్సెస్ 125 (Access 125) అనే స్కూటర్ పేరు వినగానే, చాలా మంది వినియోగదారుల మనసులో నమ్మకమైన, రోజువారీ ప్రయాణాలకు అనుకూలమైన ఒక స్కూటర్ కనబడుతుంది. ఇది ఒక మంచి పనితీరు, మైలేజ్, కంఫర్ట్‌కి కలయికగా మారింది. అందుకే, దేశవ్యాప్తంగా ఇది అన్ని ప్రాంతాలకు విస్తరించింది. ఢిల్లీ నుంచి మొదలుకుని గల్లీ వరకు ఈ స్కూటర్ కనిపిస్తుంది. తాజాగా విడుదలైన మే 2025 అమ్మకాల గణాంకాల ప్రకారం, యాక్సెస్ 125 స్కూటర్ దేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే టాప్ 10 మోడళ్లలో మూడవ స్థానాన్ని అధిరోహించింది. మార్కెట్లో ఎంతో పోటీ ఉన్నప్పటికి కూడా ఇతర మెడళ్లను దాటుకుని ఇది మెరుగైన స్థానం పొందడం గమనార్హం.
ఈ జాబితాలో హోండా యాక్టివా మొదటి స్థానంలో నిలవగా, టీవీఎస్ జూపిటర్ రెండవ స్థానంలో స్థానం నిలిచింది. సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా మే నెలలో మొత్తం 75,778 యాక్సెస్ 125 యూనిట్లను అమ్మిందని గణాంకాలు చెబుతున్నాయి. ఇదే మోడల్ 2024 మేలో 64,812 యూనిట్ల అమ్మకాలతో నిలిచింది. అంటే, ఒక్క ఏడాది వ్యవధిలో అమ్మకాలు దాదాపు 17 శాతం పెరిగాయి, సరిగ్గా చెప్పాలంటే 16.92 శాతం వృద్ధి.

ఈ గణాంకాలు చూస్తే స్పష్టంగా తెలుస్తోంది, యాక్సెస్ 125 మార్కెట్‌లో తన స్థానం మరింత బలోపేతం చేసుకుంటోంది. కొత్త రైడర్లు, ఫ్యామిలీ యూజర్లు, వృద్ధులు, కాలేజ్ విద్యార్థులు, అన్ని వర్గాల వారికి సరిపోయేలా ఉండటంతో ఈ స్కూటర్‌పై నమ్మకం రోజురోజుకీ పెరుగుతోంది. నేటి మార్కెట్లో నిలదొక్కుకోవాలంటే, నాణ్యతతో పాటు వినియోగదారుల అవసరాలను అర్థం చేసుకోవడం ఎంతో ముఖ్యం. సుజుకీ ఈ విషయంలో ముందంజలో ఉన్నట్లు ఈ అమ్మకాలు చూపిస్తున్నాయి.
సుజుకీ యాక్సెస్ 125 స్కూటర్ ధర రూ. 87,000 నుండి రూ. 98,000 (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది, ఇది దాని వేరియంట్‌పై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ఇది స్టాండర్డ్ ఎడిషన్, స్పెషల్ ఎడిషన్ (డిస్క్ బ్రేక్‌తో), రైడ్-కనెక్ట్ ఎడిషన్, రైడ్-కనెక్ట్ TFT ఎడిషన్ అనే నాలుగు ప్రధాన వేరియంట్లలో కొనుగోలు చేయడానికి లభిస్తుంది. ప్రతి వేరియంట్‌కి ప్రత్యేక ఆప్షన్లు, వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించబడ్డాయి.

ఇందులో 125 సీసీ సింగిల్-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ కలదు, ఇది 8.3 PS పవర్, 10.2 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. నగర ప్రయాణాల్లోనూ, తక్కువగా ఇంధన వినియోగం కావాలన్న వారికి ఇది మంచి ఎంపిక. ఈ స్కూటర్ 45 కి.మీ లీటరుకు మైలేజీని ఇవ్వగలదు. 5 లీటర్ల ఇంధన ట్యాంక్‌తో దూర ప్రయాణాలకూ సరిపోతుంది. సుజుకీ యాక్సెస్ 125 రోజువారీ అవసరాలకు మాత్రమే కాకుండా, లాంగ్‌కు కూడా ఉపయోగపడుతుంది.
ఈ స్కూటర్ ముందు భాగంలో స్టైలిష్ LED హెడ్‌లైట్, వెనుక భాగంలో LED టెయిల్ ల్యాంప్ మరింత లేటెస్ట్‌గా ఉండేలా చేస్తాయి. కలర్స్ విషయానికి వస్తే, ఇది పెర్ల్ షైనీ బీజ్, మెటాలిక్ మ్యాట్ స్టెల్లార్ బ్లూ, పెర్ల్ గ్రే వైట్, మెటాలిక్ మ్యాట్ బ్లాక్, సాలిడ్ ఐస్ గ్రీన్ వంటి వాటిలో అందుబాటులో ఉంది. ఇవి ప్రతి రైడర్‌కు ఓ ప్రత్యేకమైన స్టైల్‌ను అందిస్తాయి.

కొత్తగా అప్‌డేట్ అయిన యాక్సెస్ స్కూటర్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌తో పాటు స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్ వంటి వివిధ ఫీచర్స్‌తో వస్తుంది. ఇది దాదాపు 90 కి.మీల వేగంతో దూసుకుపోగలదు. కేవలం 8.95 సెకన్లలో 0 నుండి 30 కి.మీ. వేగాన్ని అందుకోగలదు. ఇది ముందు టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక సింగిల్-షాక్ అబ్జార్బర్ సస్పెన్షన్ సెటప్‌ను ఏర్పాటు చేశారు.


Click it and Unblock the Notifications








