తక్కువ ధర, ట్రెండీ డిజైన్, సూపర్ మైలేజ్.. అందరికి ఇష్టమైన స్కూటర్.. ఏకంగా సేల్స్‌లో మూడో స్థానం
ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీ సుజుకీకి చెందిన యాక్సెస్ 125 (Access 125) స్టైలిష్, పనితీరు పరంగా మెరుగైన స్కూటర్‌గా ఇప్పటికే మంచి పేరు సంపాదించుకుంది. దేశీయ ప్రజల నుంచి ఆదరాభిమానాన్ని పొందిన ఇది దేశీయ మార్కెట్‌లో మరోసారి తన ప్రభావాన్ని చూపించింది. ఏప్రిల్ 2025లో 'యాక్సెస్ 125' అత్యధికంగా అమ్ముడైన స్కూటర్ల జాబితాలో మూడవ స్థానాన్ని దక్కించుకుంది. ఇది హోండా యాక్టివా (మొదటి స్థానం), టీవీఎస్ జూపిటర్ (రెండవ స్థానం) తర్వాతి స్థానంలో నిలవడం గమనార్హం. మార్కెట్‌లో తీవ్ర పోటీ ఉన్నా కూడా, యాక్సెస్ తన స్థిరమైన డిమాండ్‌ను కొనసాగించడంలో విజయవంతమైంది. మార్కెట్లోకి ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్ మోడళ్లు రావడం వలన చాలా మంది వాటివైపు ఆసక్తి చూపిస్తున్నప్పటికి ఇదే కాలంలో యాక్సెస్ 125 ఐసీఈ వేరియంట్ మంచి ఆదరణ సంపాదించడం విశేషం.
సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా ఇటీవల వెల్లడించిన డేటా ప్రకారం, ఈ ఏప్రిల్‌లో 65,107 యాక్సెస్ 125 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది గతేడాది అదే నెలలో అమ్ముడుపోయిన 61,960 యూనిట్లతో పోలిస్తే సుమారు 5.08 శాతం వృద్ధిని సూచిస్తోంది. సంవత్సరం ప్రాతిపదికన అమ్మకాలు పెరుగుదలతో కంపెనీ ఉన్నతాధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బ్రాండ్ ఇమేజ్, యాక్సెస్ 125 అందించే మైలేజ్, కంఫర్ట్, పనితీరు వంటివి దీనిని మార్కెట్లో డిమాండ్ స్కూటర్‌గా మార్చాయి.

మొత్తంగా చూస్తే, వాహన పరిశ్రమలో కొనసాగుతున్న అస్థిరత మధ్య కూడా, సుజుకీ యాక్సెస్ 125 తన స్థిరమైన పనితీరు ద్వారా మార్కెట్‌ను ఆకర్షించడంలో విజయం సాధించింది. ఇది సంవత్సరాలుగా వినియోగదారుల నమ్మకాన్ని పొందుతుంది. ప్రస్తుతం ఈ స్కూటర్ అమ్మకాలు రోజురోజుకూ పెరుగుతున్నాయంటే, దానికి పలు స్పష్టమైన కారణాలు ఉన్నాయి. దీని డిజైన్ ఇప్పటి ట్రెండ్స్‌కు అనుగుణంగా ఉంటుంది. క్లాసిక్ స్టైలింగ్‌కి ఆధునిక టచ్‌ను కలిపిన విధంగా ఉంది.
ఇది అన్ని వయసులవారినీ ఆకర్షిస్తోంది. స్కూటర్‌లో లభించే LED హెడ్ల్యాంప్, డిజిటల్-అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్ వంటి ఫీచర్లు దాన్ని మరింత ప్రాక్టికల్‌గా మార్చాయి. ముఖ్యంగా పెట్రోల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో, యాక్సెస్ 125 లీటర్‌కు సగటున 45-55 కిలోమీటర్ల మైలేజ్ అందించడం కూడా బాగా కలిసి వచ్చింది. దీంతో పాటు, బడ్జెట్ ధరలో లభించడమూ మరో కీలక అంశం.

ప్రస్తుతం ఇది చాలా తక్కువ ధరకు కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది, దీని ధర రూ. 86,000 నుంచి మొదలవుతుంది. ఇది ఎక్స్-షోరూమ్ హైదరాబాద్ ధర. మైలేజ్ కూడా బాగానే వస్తుండటంతో రోజు ప్రయాణాలు చేసే వారికి ఇది పెట్రోల్ ఖర్చులను తగ్గించడంలో సహయపడుతుంది. ఇది శక్తివంతమైన 125సీసీ సింగిల్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ద్వారా రన్ అవుతుంది. బలమైన పవర్‌ను, స్మూత్ రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది.
వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా మెటాలిక్ మ్యాట్ స్టెల్లార్ బ్లూ, పెర్ల్ గ్రే వైట్, మెటాలిక్ మ్యాట్ బ్లాక్ అనే కలర్స్ ఆప్షన్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. కొత్త మోడల్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ ద్వారా 'స్మార్ట్'గా మారిపోయింది. ఈ స్కూటర్‌కి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉండడం వల్ల అవసరమైన సమాచారం ఒక్క చూపుతో కనిపిస్తుంది. టర్న్-బై-టర్న్ నావిగేషన్ సౌకర్యం, ట్రాఫిక్ పరిస్థితుల్లో బాగా ఉపయోగపడుతుంది.

సేఫ్టీ విషయంలో కూడా సుజుకీ ఎలాంటి రాజీ పడలేదు. ముందు డిస్క్, వెనుక డ్రమ్ బ్రేక్‌లతో రైడర్‌కు మంచి బ్రేకింగ్ కంట్రోలింగ్ లభిస్తుంది. గంటకు గరిష్టంగా 90 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. దీని బరువు కేవలం 106 కిలోలు కావడంతో, ఇది సిటీ ట్రాఫిక్‌లో చక్కగా పరుగుతు పెడుతుంది. అదే సమయంలో, దీని 5.6 లీటర్ల సామర్థ్యం గల ఫ్యూయల్ ట్యాంక్ దీన్ని దూర ప్రయాణాలకు కూడా తీసుకెళ్లవచ్చు.


Click it and Unblock the Notifications








