యూత్‌కు స్పెషల్ గిఫ్ట్.. స్పోర్టీ లుక్స్, టాప్ ఫీచర్స్‌తో సుజుకి అవెనిస్ కొత్త కలర్ వేరియంట్ లాంచ్!
భారత టూవీలర్ వాహన మార్కెట్లో నిలకడగా తన స్థానం నిలుపుకుంటున్న సుజుకి (suzuki) మోటార్‌సైకిల్, యాక్సెస్ స్కూటర్‌తో కోట్లాది మంది వినియోగదారుల నమ్మకాన్ని గెలుచుకుంది. మెరుగైన మైలేజ్, మన్నికైన ఇంజిన్, స్మూత్ డ్రైవింగ్ అనుభవంతో యాక్సెస్ సిరీస్ ఇప్పటికే మార్కెట్‌లో హాట్ ఫేవరెట్ అయింది. ఇప్పుడు, అదే విజయాన్ని మరింత బలోపేతం చేస్తూ సుజుకి కంపెనీ తన మరో ప్రముఖ మోడల్ అయిన అవెనిస్ (Avenis) స్కూటర్‌ను రిఫ్రెష్ చేసి మరింత ఆకర్షణీయంగా మార్కెట్లోకి తీసుకొచ్చింది. అవెనిస్ స్కూటర్‌ను ఈసారి నూతన డ్యూయల్-టోన్ పెయింట్ స్కీమ్‌లతో విడుదల చేశారు. కొత్త కలర్ కాంబినేషన్లు, స్టైలిష్ గ్రాఫిక్స్, స్పోర్టీ డిజైన్‌తో ఈ స్కూటర్ యూత్‌ను ఆకట్టుకునేలా ఉంది.
సుజుకి అవెనిస్ స్కూటర్ కొత్త రూపంలో మెటాలిక్ మ్యాట్ ప్లాటినం సిల్వర్ నం.2 /గ్లాస్ స్పార్కిల్ బ్లాక్ అనే డ్యూయల్-టోన్ కలర్ స్కీమ్‌తో విడుదలైన ఈ వెర్షన్, స్కూటర్‌కు మరింత స్పోర్టీ లుక్‌ను అందిస్తుంది. ఈ కొత్త కలర్ కాంబినేషన్ స్కూటర్ డిజైన్‌కు ఫ్లెయిర్‌ను జోడిస్తూ, రైడింగ్‌ను కేవలం ప్రయాణంగా కాకుండా ఒక స్టైలిష్ స్టేట్మెంట్‌గా మార్చుతుంది. బ్లాక్ టోన్‌తో ప్లాటినం సిల్వర్ స్కూటర్‌కు డైనమిక్, మోడ్రన్ లుక్‌ను తీసుకొస్తున్నాయి.

ఇది ఇప్పటికే అందుబాటులో ఉన్న సుజుకి అవెనిస్ కలర్ లైనప్‌లో చేరింది. ప్రస్తుతం మార్కెట్లో ఈ మోడల్ గ్లోసీ స్పార్కిల్ బ్లాక్/పెర్ల్ గ్లేసియర్ వైట్, గ్లోసీ స్పార్కిల్ బ్లాక్ / పెర్ల్ మీరా రెడ్, గ్లోసీ స్పార్కుల్ బ్లాక్(సింగిల్ టోన్) వంటి ఇతర ఆకర్షణియమైన వేరియంట్‌లతో కూడా లభిస్తోంది. సుజుకి అవెనిస్ తాజా డ్యూయల్-టోన్ వేరియంట్‌తో పాటు, ధర పరంగా వినియోగదారులకు ఎటువంటి అదనపు ధర పెంపు లేకపోవడం గమనార్హం.
కంపెనీ ధరను మార్చకుండా, అదే ఆకర్షణీయమైన ట్యాగ్‌తో కొత్త లుక్‌ను అందిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న రెండు వేరియంట్లు స్టాండర్డ్ ఎడిషన్ ధర రూ.91,400 (ఎక్స్-షోరూమ్, ఇండియా), రైడ్ కనెక్ట్ ఎడిషన్ ధర రూ.93,200 (ఎక్స్-షోరూమ్, ఇండియా) ఈ రెండు వేరియంట్లు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని అధీకృత సుజుకి టూవీలర్ వాహన డీలర్‌షిప్‌లలో, కొత్త డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్‌తో అందుబాటులో ఉన్నాయి.

సుజుకి అవెనిస్‌లో ఉన్న 124.3 సిసి, 4-స్ట్రోక్, సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్ BS6 ఫేజ్-2 (OBD-2B) ప్రమాణాలను పాటించేలా రూపొందించబడింది. ఇది 6,750 rpm వద్ద 8.7 PS పవర్, 5,500 rpm వద్ద 10 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌కు Suzuki Eco Performance (SEP) టెక్నాలజీ ఉండటంతో, శక్తివంతమైన పనితీరు, తక్కువ ఫ్యూయల్ వినియోగం మధ్య సరైన పనితీరును అందిస్తుంది.
ఈ స్కూటర్ స్పోర్టీ స్టాన్స్‌తో వచ్చింది. బాడీపై మౌంట్ చేసిన LED హెడ్‌ల్యాంప్‌లు, ఆకర్షణీయమైన స్పోర్టీ LED టెయిల్ లైట్స్, ఎడ్జీగా ఉండే గ్రాఫిక్స్, స్ప్లిట్ గ్రాబ్ రెయిల్స్ ఇవి అన్ని కలిసి స్కూటర్‌కు యూత్ ఫుల్ లుక్‌ను ఇస్తాయి. ఇది పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ద్వారా లేటెస్ట్ డేటాతో పాటు వినియోగదారులకు అవసరమైన అన్ని ఇన్ఫర్మేషన్‌ను క్లియర్‌గా చూపిస్తుంది. ఇది స్మార్ట్ ఫీచర్లతో వినియోగదారులకు కూడా నచ్చుతుంది.
సుజుకి అవెనిస్‌లో 21.8 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ ఉంది. దీని ద్వారా చిన్న సరుకులు,హెల్మెట్ వంటి వాటిని లోపల పెట్టుకోవచ్చు. ఈ స్కూటర్‌లో టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్,సైడ్ స్టాండ్ ఇంటర్‌లాక్, కంబైన్డ్ బ్రేక్ సిస్టమ్ (CBS), 12-అంగుళాల ఫ్రంట్ టైర్ కూడా ఉన్నాయి. ఇది నగర ప్రయాణాలలో రైడర్లకు చాలా అనుకూలంగా ఉన్నాయి.


Click it and Unblock the Notifications








