పెట్రోల్ అవసరం లేదు, ఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు.. గాలితో నడిచే స్కూటర్ వస్తోంది!

ప్రస్తుతం భారతీయ టూవీలర్ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్ల విప్లవం నడుస్తోంది. ప్రతి బ్రాండ్‌ కూడా తమదైన కొత్త ఎలక్ట్రిక్ మోడళ్లను విడుదల చేస్తూ ఈ రంగంలో ఆధిపత్యం సాధించాలనే పోటీ పడుతున్నాయి. కానీ ఈ ఎలక్ట్రిక్ ఉత్సాహం మధ్యలో, సుజుకి మాత్రం ఇతర కంపెనీలకు పూర్తి భిన్నంగా ఆలోచిస్తోంది. సాధారణ EV టెక్నాలజీ కంటే ముందుకు వెళ్లి, భవిష్యత్‌లో ఇంధనంగా హైడ్రోజన్ (Hydrogen) వినియోగానికి కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఈ సరికొత్త ప్రయోగం కోసం కంపెనీ తన అత్యంత ప్రజాదరణ పొందిన బర్గ్‌మాన్ (burgman) స్కూటర్‌ను ఎంపిక చేసింది. అంటే, పెట్రోల్‌పై నడిచే ఈ లగ్జరీ స్కూటర్‌ను హైడ్రోజన్ ఫ్యూయల్‌తో నడిచే మోడల్‌గా మార్చే ప్రయత్నం సుజుకి చేస్తోంది. ఈ నిర్ణయం కంపెనీ భవిష్యత్ దృష్టికోణాన్ని స్పష్టంగా చూపిస్తోంది.

ఇది కేవలం ఎలక్ట్రిక్ వాహనాలకే పరిమితం కాకుండా, పర్యావరణానికి హాని చేయని, సుస్థిరమైన ఇంధన పరిష్కారాల వైపు అడుగులు వేస్తోందని చెప్పాలి. సుజుకి బర్గ్‌మాన్ భారత మార్కెట్‌లో లగ్జరీ స్కూటర్‌లకు ప్రతీకగా నిలిచింది. అద్భుతమైన బాడీ డిజైన్, సౌకర్యవంతమైన రైడింగ్ పొజిషన్, శక్తివంతమైన ఇంజిన్ పనితీరు, ఇవన్నీ కలిసి బర్గ్‌మాన్‌ను యువతతో పాటు రోజువారీ ప్రయాణికుల మనసుల్లో ప్రత్యేక స్థానం కల్పించాయి.

Suzuki Developing Burgman Hydrogen Scooter And Will Launch It Soon

ఇప్పుడు అదే మోడల్ హైడ్రోజన్ శక్తిని ఉపయోగిస్తే, ఇది కేవలం సుజుకికే కాకుండా మొత్తం టూవీలర్స్‌కు ఒక మైలురాయి అవుతుంది. హైడ్రోజన్ ఫ్యూయల్ టెక్నాలజీ అంటే, ఇది విద్యుత్ వాహనాల మాదిరిగా బ్యాటరీపై ఆధారపడదు. బదులుగా, హైడ్రోజన్‌ను ఫ్యూయల్ సెల్‌లో ఆక్సిజన్‌తో కలిపి విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్రక్రియలో ఉత్పత్తయ్యేది కేవలం నీటి ఆవిరే, అంటే పూర్తి పర్యావరణహితం. ఇంధన ట్యాంక్ నింపడం కూడా కొన్ని నిమిషాల్లో పూర్తవుతుంది.

సుజుకి ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించడం ద్వారా భవిష్యత్ ద్విచక్ర వాహన రంగంలో కొత్త అధ్యాయం తెరిచిందని చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే హైడ్రోజన్ వాహనాలపై ప్రయోగాలు జరుగుతున్నప్పటికీ, భారత మార్కెట్‌లో స్కూటర్ సెగ్మెంట్‌లో ఈ ఆలోచన మొదటిసారిగా పెద్ద స్థాయిలో రూపుదిద్దుకుంటోంది. సుజుకి బర్గ్‌మాన్ హైడ్రోజన్ స్కూటర్ రాబోయే కాలంలో భారత రోడ్లపై కనిపిస్తే, అది కేవలం మరో స్కూటర్ కాదు, భవిష్యత్ ఇంధన విప్లవానికి నాంది అవుతుంది.

Suzuki Developing Burgman Hydrogen Scooter And Will Launch It Soon

సుజుకి తన కొత్త ఆలోచనలను ప్రపంచానికి పరిచయం చేయడానికి 2025 జపాన్ మొబిలిటీ షోలో తన హైడ్రోజన్ ఆధారిత స్కూటర్ కాన్సెప్ట్ మోడల్‌ను ప్రదర్శించాలనే యోచనలో ఉంది. ఈ ప్రదర్శన విజయవంతమైతే, వచ్చే ఏడాది ఈ వినూత్న హైడ్రోజన్-శక్తితో నడిచే స్కూటర్‌ను మార్కెట్లోకి విడుదల చేసే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ ద్వారా సుజుకి సున్నా ఉద్గార(Zero Emission) వాహనాల అభివృద్ధిపై ఎంతటి దృష్టి పెట్టిందో స్పష్టంగా తెలుస్తోంది.

పర్యావరణానికి హాని చేయని వాహనాలను అందించడం అనే లక్ష్యంతో కంపెనీ ఇప్పటికే E-యాక్సెస్ అనే ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇప్పుడు హైడ్రోజన్ ఆధారిత సాంకేతికత వైపు మళ్లడం ద్వారా, సుజుకి రవాణా భవిష్యత్తుకు మరో అడుగు వేసినట్లయింది. ఇదిలా ఉంటే, ఇప్పటికే హైడ్రోజన్ స్కూటర్ టెక్నాలజీ ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతోంది.

ఈ టెక్నాలజీ బ్యాటరీ ఛార్జింగ్ వంటి సమయపరిమితి సమస్యలను తగ్గిస్తూ, ఇంధనం నింపడం కేవలం కొన్ని నిమిషాల్లో పూర్తయ్యే విధంగా రూపుదిద్దుకుంటోంది. అంతేకాక, ఉద్గారాలుగా కేవలం నీటి ఆవిరి మాత్రమే విడుదల అవ్వడం దీన్ని పూర్తిగా పర్యావరణహితమైన పరిష్కారంగా నిలబెడుతోంది. ఇక ఈ హైడ్రోజన్ స్కూటర్ భారత మార్కెట్లో ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో అన్న వివరాలు మాత్రం ఇంకా వెల్లడికాలేదు.

More from DriveSpark

Article Published On: Monday, October 13, 2025, 11:03 [IST]
English summary
Suzuki developing burgman hydrogen scooter and will launch it soon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+