అతి తక్కువ ధరలో టీవీఎస్ జూపిటర్ CNG, సుజుకీ E యాక్సెస్! ఎప్పుడొస్తాయో తెలుసా?
ఇండియాలో టూవీలర్ తయారీదారుల్లో టీవీఎస్(TVS), సుజుకీ మోటార్ సైకిల్‌కు ప్రత్యేకమైన స్థానం ఉంది. దేశీయ ప్రజల రోజువారి అవసరాల కోసం బడ్జెట్ ధరలో టూవీలర్స్‌ను విక్రయిస్తూ తమదైన ముద్ర వేసుకున్నాయి. హీరో, హోండా, బజాజ్ వంటి కంపెనీలకు బలమైన పోటీగా ఉంటూ ప్రతి ఏడాది సేల్స్‌ను పెంచుకుంటున్నాయి. కస్టమర్ల అభిరుచులకు తగ్గట్లు బైకులు, స్కూటర్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ టూ వీలర్ మార్కెట్లో వేగంగా వృద్ధిని సాధిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ఇతర తయారీదారుల నుంచి పోటీ ఎక్కువగా ఎదుర్కొంటున్న నేపథ్యంలో కొత్త మోడళ్లను తీసుకురావడంపై కీలకంగా దృష్టి సారించాయి. ఎప్పటిలాగే పేద, మధ్యతరగతి కుటుంబాలను టార్గెట్ చేసి జూపిటర్ CNG, సుజుకీ ఇ యాక్సెస్ స్కూటర్‌లను విడుదల చేయాలని చూస్తున్నాయి.
జనవరిలో ముగిసిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025 ఈవెంట్‌లో ఈ రెండు మోడళ్లను ఘనంగా ఆవిష్కరించారు. ఇవి అత్యాధునిక ఫీచర్స్‌తో మార్కెట్లోకి లాంచ్ కావడానికి సిద్దంగా ఉన్నాయి. ఆటోఎక్స్‌పోలో ప్రదర్శించిన తరువాత ఇవి దేశవ్యాప్తంగా బడ్జెట్ టూవీలర్ లవర్స్‌ను బాగా ఆకర్షించాయి. ఇప్పటికే జూపిటర్, సుజుకీ యాక్సెస్ స్కూటర్లకు దేశంలో భారీ డిమాండ్ ఉంది. స్కూటర్ విభాగంలో ఇది టీవీఎస్ పేరును దిగ్గజ కంపెనీల మధ్యలో చేరేలా చేసింది.

టీవీఎస్ అంటే ఇండియాలో దిగ్గజ టూవీలర్ తయారీ కంపెనీగా బాగా ప్రసిద్ది చెందింది. అలాంటి కంపెనీ నుంచి CNG స్కూటర్ విడుదల అవుతుందని వార్త రావడంతో దీని గురించి చాలా మంది నెట్‌లో తెగ వెతికారు. ఆటోఎక్స్‌పోలో దీన్ని ఆవిష్కరించడంతో దీనిపై అంచనాలు మరింత పెరిగాయి. అలాగే దేశంలో మంచి ఆదరణ కలిగిన సుజుకీ యాక్సెస్ ఎలక్ట్రిక్ వెర్షన్‌పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.
అయితే ఈ రెండు ప్రసిద్ధ స్కూటర్లను కూడా భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ఆవిష్కరించిన తరువాత ఇవి ఎప్పుడు మార్కెట్లోకి విడుదల అవుతాయా అని చాలా మంది ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొనుగోలుకు అందుబాటులోకి వచ్చిన తరువాత వెంటనే తమ సొంతం చేసుకోవాలని కొంతమంది వేచి ఉన్నారు. అలాంటి వారికి వీటి లాంచ్ అలాగే, ఫీచర్స్ గురించి ప్రత్యేకంగా ఈ కథనంలో అందిస్తున్నాం.

TVS జూపిటర్ CNG: ఈ స్కూటర్ చాలా తక్కువగా ధరకు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. సమాచారం ప్రకారం, దేశీయంగా దీని ధర రూ. 90,000 నుంచి రూ. 1 లక్ష (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండే అవకాశం ఉంది. లాంచ్ విషయానికి టీవీఎస్ ఈ స్కూటర్‌ను అక్టోబర్ నెలలో దసరా, దీపావళి పండుగ సమయంలో దేశంలో ఘనంగా విడుదల చేయాలని చూస్తుందని తెలుస్తుంది.
ఇది 124.8-సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో వస్తుంది. 7.1 హార్స్‌పవర్, 9.4 ఎన్‌ఎమ్ గరిష్ట టార్కును ఉత్పత్తి చేస్తుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 80.5 కి.మీ. పెట్రోల్‌తో పాటు 1.4-కిలోల CNG ఇంధన ట్యాంక్‌ను కలిగి ఉంటుంది. మైలేజ్ దాదాపు 226 కి.మీల వరకు ఇస్తుంది. ఇది మొబైల్ ఛార్జింగ్ పోర్ట్, సైడ్ స్టాండ్ ఇండికేటర్, ఇంటెలిగో టెక్నాలజీ, LED హెడ్‌లైట్ వంటి ఆప్షన్లతో రాబోతుంది.

సుజుకి ఇ-యాక్సెస్: ఎలక్ట్రిక్ విభాగంలో క్రమంగా దూసుకుపోతున్న సుజుకీ తన స్కూటర్‌ను అందరు కొనగలిగే విధంగా తక్కువ ధరకు విడుదల చేయాలని సన్నాహాలు చేస్తుంది. అంచనాల ప్రకారం, లాంచ్ సమయంలో దీని ధర రూ. లక్ష నుంచి రూ. 1.20 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండవచ్చు. సుజుకి ఇ-యాక్సెస్ స్కూటర్ ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో దేశీయంగా అత్యంత ఘనంగా విడుదల చేసే అవకాశం ఉంది.
కొత్త సుజుకి యాక్సెస్ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ వచ్చేసి గంటకు 71 కి.మీలు. దీనిలో 3.07 కిలోవాట్ (kWh) బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. దీన్ని పూర్తిగా ఛార్జ్ చేసినట్లయితే 95 కి.మీల రేంజ్ అందిస్తుంది. ఇది 6 గంటల 42 నిమిషాల్లో హోమ్ ఛార్జర్‌ని వాడి 0 నుండి 100% ఛార్జ్ చేయవచ్చు.


Click it and Unblock the Notifications








