సుజుకి నుంచి తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేస్తోంది.. ఫీచర్లు ఎక్స్‌క్లూజివ్‌గా మీకోసం!
దిగ్గజ ఆటో మొబైల్ సంస్థ సుజుకి ఇండియా.. తమ వాహనాలతో భారతీయ వినియోగదారులను ఎన్నో ఏళ్లుగా ఆకట్టుకుంటోంది. కార్లతో పాటు టూ- వీలర్లలోనూ ఈ సంస్థ తమ వాహనాలతో ప్రత్యేక గుర్తింపును సొతం చేసుకుంది. ఈ ఏడాది ఈ సంస్థ టూ- వీలర్స్‌కు సంబంధించి గట్టి ప్లాన్స్‌తో ముందుకు వస్తోంది. ఇందులో భాగంగా.. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో తమ సంస్థ నుంచి కొత్త వాహనాలను పరిచయం చేయనుంది. దేశంలో ప్రస్తుతం ఈవీల హవా కొనసాగుతున్న నేపథ్యంలో.. ఈవీల తయారీపై ఈ సంస్థ దృష్టి సారించింది.
తమ బ్రాండ్ నుంచి తొలిసారి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆటో ఎక్స్‌పోలో పరిచయం చేయడానికి సిద్ధమైంది. ఈ ఈవీ స్పెసిఫికేషన్లపై ఓ డాక్యుమెంట్‌ను సుజుకి సంస్థ విడుదల చేసింది. సుజుకి ఇ-యాక్సెస్ పేరుతో రానున్న ఈ స్కూటర్ 3.07 kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇది ఫుల్ ఛార్జ్‌పై 95 కి.మీ.ల రేంజ్‌ని అందిస్తుందని తెలుస్తోంది. ఇది 4.1 kW ఎలక్ట్రిక్ మోటార్‌తో అనుసంధానించి ఉంటుంది.

ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ గరిష్ఠంగా 15 Nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. అలాగే ఈ స్కూటర్ 71 kmph టాప్ స్పీడ్‌తో పరుగెత్తగలదు. ఈ స్కూటర్ బ్యాటరీ 0-80 శాతం ఛార్జింగ్ కావడానికి 4 గంటల 30 నిమిషాల సమయం తీసుకుంటుంది. 240W పోర్టబుల్ ఛార్జర్‌తో ఈ బ్యాటరీ ఫుల్ ఛార్జ్ కావడానికి 6 గంటల 42 నిమిషాల సమయం పడుతుంది.
ఫాస్ట్ ఛార్జర్ వినియోగిస్తే ఈ ఛార్జింగ్ టైం 1 గంట నుంచి 12 నిమిషాల నుంచి 2 గంటల నుంచి 12 నిమిషాల సమయం తగ్గుతుంది. ఈ సుజుకి ఇ- యాక్సెస్ ఎలక్ట్రిక్ స్కూటర్... పూర్తిగా కొత్త ప్లాట్‌ఫామ్‌తో ఉంటుంది. ఇది ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్‌పై ఆధారపడి ఉంటుంది. వెనుక వైపు.. స్వింగ్ ఆర్మ్ టైప్ సస్పెన్షన్‌తో ఉంటుంది. 12 అంగుళాల- అలాయ్ వీల్స్‌తో ఇది ఉంటుంది.

దీని రెండు ఎండ్‌లు ఒకటి 90/90 సెక్షన్‌తో, మరొకటి 100/80 సెక్షన్‌తో ఉంటాయి. డిస్క్/ డ్రమ్ బ్రేక్స్‌తో దీని బ్రేకింగ్ డ్యూటీస్ ఉంటాయి. 1,880 mm పొడవు, 715 mm వెడల్పుతో ఈ స్కూటర్ ఉంటుంది. ఇది 165 మి.మీ.ల గ్రౌండ్ క్లియరెన్స్, 122 కిలోల బరువుతో ఉండి, 765 మి.మీ ఎత్తుతో దీని సీట్ ఉంటుంది.
హెడ్ లైట్ LED, టెయిల్ లైట్ LED, డీఆర్ ఎల్ LEDతో ఈ స్కూటర్ అందుబాటులోకి రానుంది. ఓలా, ఏథర్ వంటి అనేక స్టార్టప్ సంస్థలతో పాటు, దిగ్గజ ఆటో మొబైల్ తయారీ సంస్థలు కూడా ఇప్పుడు ఈవీలవైపు అడుగులు వేస్తున్నాయి. సుజుకీ నుంచి రానున్న ఇ-యాక్సెస్ స్కూటర్... ఇతర ఎలక్ట్రిక్ వాహనాలకు గట్టి పోటీనిస్తుందని చెప్పవచ్చు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








