సింగిల్ ఛార్జ్‌తో 150 Km.. సుజుకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. నగరాల్లో రైడింగ్‌కు బెస్ట్ ఛాయిస్!

భారత ఎలక్ట్రిక్ టూవీలర్ మార్కెట్ వేగంగా విస్తరిస్తున్న సమయంలో, సుజుకి తన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను భారతీయులకు అందించడానికి సిద్ధమవుతోంది. ఇ-యాక్సెస్ (e-access) పేరుతో రాబోతున్న ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇంకా అధికారికంగా ప్రారంభించకపోయినా, సుజుకి ఈ మోడల్ గురించి పలు కీలక వివరాలను బయటపెట్టింది. ప్రముఖంగా, ఇది ప్రస్తుతం భారత మార్కెట్‌ను ఆక్రమిస్తున్న ఓలా, ఈథర్, విడా, చేతక్ EV వంటి టాప్ బ్రాండ్లకు గట్టి పోటీ ఇవ్వగలదని పరిశ్రమ విశ్లేషకులు భావిస్తున్నారు. సుజుకి ఇప్పటికే ఇ-యాక్సెస్‌ను విస్తృతంగా పరీక్షిస్తోంది. టెస్ట్ మోడళ్లను రోడ్లపై పలుసార్లు చూస్తున్నట్లు ఆటో ప్రియులు చెబుతున్నారు. అన్నీ సజావుగా జరిగితే, ఈ-యాక్సెస్‌ను డిసెంబర్ 2025లో భారత మార్కెట్‌లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.

ధర బడ్జెట్ విభాగంలోనే ఉంటుందని అంచనా, సుమారు రూ. 1,00,000 నుంచి రూ. 1,20,000 మధ్యగా ఉండవచ్చు. ఇది సుజుకి అభిమానులను మాత్రమే కాకుండా, కొత్తగా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునే వారికి కూడా ఆకర్షణీయమైన ఎంపికగా మారుతుంది. ఇక ఈ మోడల్ తరహాలోనే కనిపించే మరో ముఖ్యమైన ఎలక్ట్రిక్ స్కూటర్ సుజుకి బర్గ్‌మాన్ స్ట్రీట్ ఎలక్ట్రిక్ కూడా అభివృద్ధి దశలో ఉంది. దీనిని ఫిబ్రవరి 2026లో ప్రారంభించే అవకాశముందని సమాచారం.

Suzuki E Access Will Be Launched Soon In India

పనితీరు పరంగా మార్కెట్లో ఉన్న ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్‌లకు గట్టి పోటీ ఇచ్చే విధంగా రూపుదిద్దుకుంటోంది. ఇందులో అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్ 4.1 kW శక్తి, 15 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే, రైడింగ్ పరిస్థితులపై ఆధారపడి 100 నుండి 150 కిలోమీటర్ల వరకు రేంజ్ అందిస్తుంది. స్కూటర్‌లో మూడు వేర్వేరు డ్రైవ్ మోడ్‌లు ఉండటంతో పాటు, రీజెన్ బ్రేకింగ్ కూడా ఏర్పాటు చేశారు.

ఇది బ్రేకింగ్ సమయంలో శక్తిని తిరిగి బ్యాటరీలో నిల్వ చేయడం ద్వారా రేంజ్‌ను కొంతవరకు పెంచుతుంది. చార్జింగ్ విషయానికి వస్తే, ఇంట్లోనే పోర్టబుల్ ఛార్జర్ ఉపయోగించి ఈ-యాక్సెస్‌ను 6.5 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. దీని వలన రాత్రిపూట ఛార్జింగ్ మరింత అనువుగా మారుతుంది. మరోవైపు, ఫాస్ట్ ఛార్జర్ సహాయంతో కేవలం 1 గంట 12 నిమిషాల్లో 80% ఛార్జ్ చేయగలుగుతుంది.

Suzuki E Access Will Be Launched Soon In India

పూర్తి 100% ఛార్జింగ్ పొందడానికి 2 గంటల కంటే కొద్దిగా ఎక్కువ సమయం పడుతుందని సమాచారం. మెకానికల్ నిర్మాణంలో ప్రత్యేకత ఉంది. ఈ-యాక్సెస్ బెల్ట్ డ్రైవ్ సిస్టమ్‌పై నడుస్తుంది. ఈ బెల్ట్ సాధారణ బెల్ట్‌లతో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువ లైఫ్ కలిగినదని సుజుకి చెప్పింది. కంపెనీ ప్రకారం, ఈ బెల్ట్ 7 సంవత్సరాలు లేదా 70,000 కిలోమీటర్ల వరకు పనిచేస్తుందని అంచనా, ఇది మెయింటెనెన్స్ ఖర్చులను గణనీయంగా తగ్గిస్తుంది.

ఈ-యాక్సెస్‌లో ఉపయోగిస్తున్న LFP బ్యాటరీ టెక్నాలజీ ఈ స్కూటర్‌కు పెద్ద ప్లస్ పాయింట్‌గా చెప్పవచ్చు. సాధారణంగా చాలా ఎలక్ట్రిక్ స్కూటర్‌లు NMC (నికెల్ మాంగనీస్ కోబాల్ట్) బ్యాటరీలను వాడుతున్నప్పటికీ, సుజుకి మాత్రం LFP (లిథియం ఐరన్ ఫాస్ఫేట్) బ్యాటరీలను ఎంచుకుంది. LFP బ్యాటరీలు నిర్మాణ పరంగా మాత్రమే కాదు, భద్రత, స్థిరత్వం, లైఫ్‌టైం విషయంలో కూడా ముందంజలో ఉంటాయి.

Suzuki E Access Will Be Launched Soon In India

బ్యాటరీ జీవితం 2-3 రెట్లు ఎక్కువ ఉండటం వల్ల దీని ఉపయోగం మరింత ఆర్థికంగా మారుతుంది. భద్రతను మరింత బలోపేతం చేయడానికి, సుజుకి ప్రత్యేకంగా ఫ్రేమ్‌లోనే సురక్షితమైన బ్యాటరీ బాక్స్‌ను నిర్మించింది. ఇది బ్యాటరీను బయట పరిస్థితుల నుంచి రక్షించే పాత్రను పోషిస్తుంది. డిజైన్ పరంగా కూడా ఈ-యాక్సెస్ ఆకర్షణీయంగా ఉంది. LED ల్యాంప్‌లు, అల్లాయ్ వీల్స్ ఈ స్కూటర్‌కు స్పోర్టీ, మోడర్న్ లుక్‌ను ఇస్తాయి.

More from DriveSpark

Article Published On: Monday, November 10, 2025, 13:18 [IST]
English summary
Suzuki e access will be launched soon in india more details inside
Read more on: #suzuki motorcycle #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+