ఇక పెట్రోల్ అవసరమే లేకుండా రోజూ 95 కి.మీలు తిరగచ్చు.. సుజుకి యాక్సెస్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌తో ఇది సాధ్యం

దేశీయ, అంతర్జాతీయ కంపెనీలు వరుసగా ఎలక్ట్రిక్ టూవీలర్లను విడుదల చేస్తున్నాయి. సాంప్రదాయ ఇంధన వాహనాలతో పాటు ఈవీలకు కూడా మంచి ఆదరణ వస్తుండటంతో తయారీ దారులు పోటా పోటీగా అధునాతన ఫీచర్స్‌తో కూడిన మోడళ్లను విడుదల చేస్తూ, మార్కెట్లో తమ వ్యాపారాన్ని విస్తరించుకుంటున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో అత్యంత ఘనంగా జరుగుతున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పో 2025 ఈవెంట్‌లో పలు వాహన తయారీ దారులు తమ ఎలక్ట్రిక్ మోడళ్లను ప్రదర్శనకు ఉంచారు. ఇదే కార్యక్రమంలో దిగ్గజ టూవీలర్ తయారీ కంపెనీ సుజుకి (Suzuki) కూడా రాబోయే తన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆవిష్కరించింది. ఈ కొత్త మోడల్ పేరు యాక్సెస్ ఇ స్కూటర్ (e scooter). ఇప్పటికే మార్కెట్లో సాధారణ యాక్సెస్ అమ్మకానికి అందుబాటులో ఉండగా, ఇది దేశీయంగా మంచి డిమాండ్ ఉన్న మోడల్. ఇప్పుడు దీనిని మరింత అప్‌డేట్ చేస్తూ, ఎలక్ట్రిక్ వెర్షన్‌లో తీసుకొస్తుంది.

సుజుకి కంపెనీకి మార్కెట్లో మంచి పేరు ఉంది. అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన వాహనాలను తయారు చేయడంలో కంపెనీ చాలా ప్రసిద్ధి చెందింది. ఈ నేపథ్యంలో ఈవీ విభాగంలో మాత్రం చాలా వెనుకబడి ఉంది. ఇప్పటికే ప్రత్యర్థి కంపెనీలు ఈవీలను వరుసగా విడుదల చేస్తున్నాయి. గత ఏడాది హోండా కంపెనీ సైతం తన ఫేవరెట్ మోడల్ యాక్టివాను ఎలక్ట్రిక్ వేరియంట్‌లో విడుదల చేసి అందరిని ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేసింది.

Suzuki Electric Scooter

దీంతో ఈవీలో పెరుగుతున్న పోటీని గుర్తించిన సుజుకీ తన ఫేవరెట్ స్కూటర్ యాక్సెస్‌కు కొనసాగింపుగా ఎలక్ట్రిక్‌ మోడల్‌ను తీసుకొస్తుంది. ఆటో ఎక్స్‌పోలో ఇది సందర్శలకులను కనువిందు చేస్తుంది. ఎలక్ట్రిక్ స్కూటర్ రంగంలోకి దింపి కొత్త ఏడాదిలో మరింత మంది వినియోగదారులను ఆకట్టుకోవాలని సుజుకి కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ స్కూటర్‌ను పెట్రోల్ పవర్డ్ వెర్షన్‌లో ఉన్న అదే ప్లాట్‌ఫారమ్ ఆధారంగా నిర్మించారు. డిజైన్ మాత్రం వేరుగా ఉంటుంది.

సుజుకి యాక్సెస్ ఇ స్కూటర్ రానున్న నెలల్లో అంటే, 2025 మధ్య భాగంలో విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇది 3.07kW ఫిక్స్‌డ్ బ్యాటరీ ప్యాక్‌ కలిగి ఉంటుంది. అంటే బ్యాటరీని ఛార్జ్ చేయడానికి బయటకు తీయడానికి వీలుండదు. దీంతో స్కూటర్ సీటు క్రింది భాగంలో మరింత ఎక్కువ స్థలం ఉంటుంది. దీనిని సింగిల్ ఛార్జ్ చేసినట్లయితే దాదాపు 95 కి.మీల వరకు ప్రయాణిస్తుంది.

Suzuki E Access Details

ఈ రేంజ్ అంటే లోకల్‌గా రోజువారి ప్రయాణాలు చేసే వారికి బెస్ట్ ఆప్షన్‌ అవుతుంది. ఇ స్కూటర్‌లో అమర్చిన బ్యాటరీని సాధారణ ఛార్జర్‌ ఉపయోగించి 80 శాతం వరకు ఛార్జ్ చేయడానికి దాదాపు 4 గంటల 30 నిమిషాలు సమయం పడుతుంది. అదే ఫాస్ట్ ఛార్జర్ అయితే 1 గంట 12 నిమిషాల్లో 80 శాతం వరకు ఛార్జ్ అవుతుందని కంపెనీ పేర్కొంటుంది. దీనిలో లేటెస్ట్ ఫీచర్స్ బోలెడు ఉన్నాయి.

సుజుకి యాక్సెస్ ఇ స్కూటర్‌లో ప్రధానంగా ఎకో, రైడ్ ఎ, రైడ్ బి అనే 3 రైడింగ్ మోడ్స్‌ ఉన్నాయి. ఇది దీర్ఘచతురస్రాకార LED హెడ్ లైట్, టర్న్-బై-టర్న్ నావిగేషన్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, E-యాక్సెస్ టర్న్-ఇండికేటర్, TFT కన్సోల్, ముందు వైపు టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక ట్విన్ రియర్ షాక్ అబ్జార్బర్ సస్పెన్షన్ సెటప్‌ను కలిగి ఉంటుంది. దీని టాప్ వచ్చేసి గంటకు 80 కిమీలుగా ఉంది.

Suzuki E Access Unveiled With Enhanced Features

ఆటో ఎక్స్‌పోకి సంబంధించిన లైవ్‌ అప్‌డేట్స్‌ కోసం మా డ్రైవ్‌స్పార్క్‌ సోషల్‌ మీడియా పేజీలను ఫాలో అవ్వండి. మా తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు.

More from DriveSpark

Article Published On: Wednesday, January 22, 2025, 8:20 [IST]
English summary
Suzuki electric scooter e access battery design and all top things details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+