2 గంటల్లో రెడీ.. 95 కి.మీలు ఆగకుండా వెళ్లండి! సుజుకీ తొలి ఎలక్ట్రిక్ స్కూటర్.. బజాజ్, టీవీఎస్‌కు బలమైన పోటీ!

భారతదేశంలో భారీగా ఉన్న పెట్రోల్ ధరల ప్రభావంతో ఇటీవల ఎలక్ట్రిక్ స్కూటర్లు బాగా అమ్ముడవుతున్నాయి. ఎలక్ట్రిక్ స్కూటర్ల మార్కెట్ రోజురోజుకూ విస్తరిస్తున్నందున, వివిధ ప్రముఖ కంపెనీలు పోటీపడి కొత్త ఉత్పత్తులను విడుదల చేస్తున్నాయి. ఇప్పటికే టాప్ కంపెనీలు ఈ విభాగంలో ముందడుగు వేసి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తూ ఈవీ టూవీలర్ సెగ్మెంట్‌లో ఆధిపత్యం చలాయిస్తున్నాయి. బజాజ్ చేతక్, టీవీఎస్ iQube, హీరో విడా V1 వంటివి ప్రజల నుంచి మంచి ఆదరణ సంపాదించాయి. ఇతర తయారీదారులు ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో దూసుకుపోతున్న తరుణంలో, సుజుకీ (suzuki) మాత్రం ఇప్పటివరకు ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేయలేదు. ఇది కొంతమంది వినియోగదారుల్లో ఆశ్చర్యాన్ని కలిగించేదే అయినా, ఇప్పుడు ఆ ఎదురుచూపులు త్వరలో ముగిసే అవకాశం కనిపిస్తోంది.

ఆలస్యం అయినా సరే, సుజుకీ తన స్కూటర్‌ను మార్కెట్లోకి విడుదల చేయడానికి అన్ని రకాల సన్నాహాలు పూర్తిచేసిందని సమాచారం. జపనీస్ టూవీలర్ బ్రాండ్ సుజుకీ ఇటీవల 2025 ఆటో ఎక్స్‌పోలో ఈవీ మోడల్ యాక్సెస్ EVని ఆవిష్కరించింది. దీని రాక కోసం అప్పటి నుంచి చాలా మంది ఎదురుచూస్తున్నారు. తాజాగా అందిన సమాచారం ప్రకారం, సుజుకీ ఇ-యాక్సెస్ (e-Access) జూన్‌లో అమ్మకానికి వస్తుందని తెలుస్తుంది.

Suzuki Electric Scooter E Access Price

సుజుకీ ఇ-యాక్సెస్ అనేది భారత మార్కెట్లో కంపెనీకి మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ అవుతుంది. ఇది స్పోర్టీ లుక్‌తో, లేటెస్ట్ ఫీచర్లతో అందుబాటులోకి రాబోతుంది. దీని విడుదల తరువాత ఈవీ టూవీలర్ సెగ్మెంట్‌లో తయారీదారుల మధ్య విపరీతమైన పోటీ ఏర్పడే అవకాశం ఉంది. సుజుకీ తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం, ఇది 3.07 kWh సామర్థ్యం గల లిథియం ఐరన్ ఫాస్ఫేట్(LFP) బ్యాటరీతో పనిచేస్తుంది.

ఈ బ్యాటరీ ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే, దాదాపు 95 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేయగలదని సమాచారం. ఈ రేంజ్‌‌తో రోజువారి ప్రయాణాలు చేసే వారు తక్కువ మెయింటనెన్స్ ఖర్చుతో డబ్బులను ఆదా చేసుకోవచ్చు. ఛార్జింగ్ విషయానికొస్తే, ఇది రెండు విధాలుగా చేయవచ్చు. సాధారణ పోర్టబుల్ ఛార్జర్‌ను ఉపయోగిస్తే బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ కావడానికి సుమారు 6 గంటల 20 నిమిషాలు పడుతుంది.

Suzuki Electric Scooter E Access Details

ఫాస్ట్ ఛార్జింగ్‌ను కోరేవారికి DC ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉంది, దీని సహాయంతో కేవలం 2 గంటల 12 నిమిషాల్లో స్కూటర్ పూర్తిగా ఛార్జ్ అవుతుంది. ఇది నగరాల్లో రైడింగ్‌లు చేసే వారికి అనువుగా ఉంటుంది. ఇ-యాక్సెస్ ఎలక్ట్రిక్ స్కూటర్ 4.1 kW శక్తి కలిగిన ఎలక్ట్రిక్ మోటారుతో పనిచేస్తుంది. ఈ మోటార్ గరిష్టంగా 71 కిలోమీటర్ల వేగంతో స్కూటర్‌ను నడిపించగలదు. ఈ స్పీడ్ దాదాపుగా సురక్షితంగా ఉంటుందని భావించవచ్చు.

ఇ-యాక్సెస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో కూడిన 4.2-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ఉంది. కీలెస్ ఎంట్రీ కూడా ఉండటం విశేషం. డిజిటల్ డాష్‌బోర్డ్, రైడింగ్ మోడ్‌లు, రిజెనరేటివ్ బ్రేకింగ్, స్మార్ట్‌ఫోన్లను ఛార్జ్ చేయడానికి USB పోర్ట్, రైడింగ్‌లో ఎక్కువ సామాన్లను తీసుకెళ్లడానికి సీటు కింద 17 లీటర్ల ఖాళీ స్థలం కూడా ఉంటుంది. మొత్తంగా చూస్తే, సుజుకీ ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌లో ఈ మోడల్‌తో ఒక గొప్ప ముందుడుగు వేస్తుంది.

Suzuki Electric Scooter E Access Launch

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Thursday, May 29, 2025, 12:50 [IST]
English summary
Suzuki electric scooter e access launch soon in india battery range and features details
Read more on: #suzuki motorcycle #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+