సుజుకి స్కూటర్లు-బైకులు కనపడితేనే కొనేస్తున్నారట.. ఒక్క నెలలో లక్షకు పైగా.. ఏం మాయ చేసిందో మరి
సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (SMIPL) ఇటీవల జూలై 2025 నెలకు గాను తమ అమ్మకాల గణాంకాలను విడుదల చేసింది. దేశీయ టూవీలర్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఈ సంస్థ, గత నెలలో మొత్తం 1,13,600 యూనిట్లను విక్రయించడం ద్వారా మార్కెట్‌లో మంచి ఉనికిని చూపించింది. ఈ మొత్తం అమ్మకాలలో 96,029 యూనిట్లు భారతీయ మార్కెట్‌లోనే అమ్ముడుపోయినవిగా సంస్థ ప్రకటించింది. దీనితోపాటు, 17,571 యూనిట్లు అంతర్జాతీయంగా విదేశీ మార్కెట్లకు ఎగుమతైనట్లు వెల్లడించింది. దేశీయ అమ్మకాలతో పాటు గ్లోబల్ ఎక్స్‌పోర్ట్ మార్కెట్‌కి అందించిన వాహనాల వల్ల, కంపెనీ వృద్ధి దిశగా మైలురాయిగా నిలిచింది. ఈ గణాంకాలు చూస్తే, సుజుకి వాహనాలపై వినియోగదారులలో ఉన్న నమ్మకాన్ని స్పష్టంగా చెప్పొచ్చు.
ఇది చూస్తే కంపెనీకి ఒక స్థిరమైన అమ్మకాల పనితీరుగా చెప్పుకోవచ్చు. అయితే, గత సంవత్సరం ఇదే నెలతో పోలిస్తే అమ్మకాల్లో కొంత తక్కువగా ఉంది. జూలై 2024లో, సుజుకి 1,16,714 యూనిట్ల అమ్మకాలు నమోదు చేయగా, అందులో 1,00,602 యూనిట్లు దేశీయ విక్రయాలు, మిగతా 16,112 యూనిట్లు ఎగుమతులుగా నమోదయ్యాయి. ఈ అంకెలు పరిశీలిస్తే, ఎగుమతుల్లో స్వల్ప వృద్ధి కనిపిస్తున్నప్పటికీ, దేశీయ అమ్మకాలలో మాత్రం స్వల్ప క్షీణత ఉంది.

మార్కెట్ ఒత్తిడులు, పోటీ వాతావరణం, వినియోగదారుల ప్రాధాన్యతల్లో మార్పుల మధ్య కూడా సుజుకి అమ్మకాల పరంగా మెరుగ్గానే ఉంది. తగిన మోడళ్లను, ఫీచర్లను కస్టమర్లకు అందించడంలో సంస్థ మరోసారి తన డిమాండ్‌ను ప్రదర్శించింది. రానున్న రోజుల్లో ఈ అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ అమ్మకాలపై , సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగం వైస్ ప్రెసిడెంట్ దీపక్ ముత్రేజా మాట్లాడారు తన స్పందనను తెలియజేశారు.
దీపక్ ముత్రేజా మాట్లాడుతూ, దేశీయ మార్కెట్లో 93,141 యూనిట్ల అమ్మకాలతో, మా కస్టమర్ల నుండి మాకు బలమైన మద్దతు లభిస్తోంది. రాబోయే నెలల్లో కూడా ఈ ఊపును కొనసాగించేందుకు మేము ప్రయత్నాలను కొనసాగిస్తామని చెప్పారు. సుజుకి సేల్స్ చూస్తే, మార్కెట్ పోటీ, ఇతర ప్రభావాల మధ్య గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే అమ్మకాలు కొద్దిగా తగ్గినప్పటికీ, వినియోగదారుల నుండి వస్తున్న సానుకూల స్పందన, సంస్థకు ఉన్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది.

జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ సుజుకి మోటార్ కార్పొరేషన్ అనుబంధంగా, సుజుకి మోటార్ సైకిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్(SMIPL) తన కార్యకలాపాలను భారత్‌లో 2006లో ప్రారంభించింది. మొదటగా, హర్యానాలోని గురుగ్రామ్‌లో ఉన్న తయారీ ప్లాంట్ నుంచే ఈ ప్రయాణం మొదలైంది. ప్లాంట్‌కి ప్రస్తుతం వార్షికంగా 13 లక్షల యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉంది. నెలకు లక్షకు పైగా టూవీలర్ వాహనాలను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఈ సంస్థకు ఉంది.
సుజుకి ఈ ప్లాంట్‌లో 125cc స్కూటర్లు, 150cc కంటే ఎక్కువ కెపాసిటీ కలిగిన ప్రీమియం మోటార్‌సైకిళ్లు, ఇంకా భారతీయ రోడ్ల పరిస్థితులకు ప్రత్యేకంగా డిజైన్ చేసిన భారీ బైకులు వంటి అనేక వేరియంట్లను తయారు చేస్తోంది. వినియోగదారుల అభిరుచులు, భారతీయ మార్కెట్ డిమాండ్స్‌ను బట్టి వీటి డిజైన్, ఫీచర్లు అభివృద్ధి చేయబడతాయి. ఇది భారత మార్కెట్లో సుజుకి స్థిరంగా ఎదగడానికి ఒక ప్రధాన కారణం అని చెప్పవచ్చు.



Click it and Unblock the Notifications








