అందరికి ఇదే స్కూటర్ కావాలి! ఈ ఒక్క మోడల్ కోసం షోరూమ్‌కు క్యూ కట్టిన జనాలు

జపాన్‌కు చెందిన ప్రముఖ టూవీలర్ తయారీ సంస్థ సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా (Suzuki Motorcycle India) దేశీయ మార్కెట్లో తన స్థానం మరింత బలోపేతం చేసుకుంటోంది. బైకులు, స్కూటర్ల తయారీలో నమ్మకమైన బ్రాండ్‌గా పేరుగాంచిన ఈ సంస్థ, భారత వినియోగదారుల హృదయాలను గెలుచుకుంటూ ముందుకు సాగుతోంది. వినియోగదారుల నుంచి వస్తున్న మంచి స్పందనకు అనుగుణంగా, ఈ కంపెనీ తన అమ్మకాల్లో భారీ వృద్ధిని నమోదు చేసింది. తాజాగా మే 2025 అమ్మకాల గణాంకాలను సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా వెల్లడించింది. ఇందులో వెల్లడించిన వివరాల ప్రకారం, సంస్థ గత నెలలో మొత్తం 1,28,896 యూనిట్ల టూవీలర్ వాహనాలను విక్రయించింది. ఇది గత సంవత్సరం మే 2024లో 1,11,512 యూనిట్లుగా మాత్రమే ఉంది. అంటే ఒక సంవత్సరం వ్యవధిలో అమ్మకాల్లో 16 శాతం వృద్ధి సాధించడం గమనార్హం.

ఇది కంపెనీ వ్యూహాత్మక మార్కెటింగ్, పనితీరుపై నమ్మకం, వినియోగదారుల అవసరాలను అర్థం చేసుకుని మోడళ్లలో అనుసరిస్తున్న కొత్తదనానికి నిదర్శనంగా చెప్పవచ్చు. ఈ అమ్మకాలను సాధించడానికి కంపెనీకి ఒక మోడల్ బాగా ఉపయోగపడింది, అదే 'యాక్సెస్ 125 (Access 125)'. ఈ మోడల్‌ ఇటీవల కాలంలో గేమ్‌ ఛేంజర్‌గా నిలిచింది. మే 2025లో నమోదైన సుజుకీ విక్రయాల వృద్ధికి ఈ స్కూటర్ ముఖ్య కారణంగా మారింది.

Suzuki Motorcycle Sales 16 Percent Growth

మైలేజ్, సాఫ్ట్ రైడింగ్ అనుభవం వంటి ఫీచర్లతో ఇది వినియోగదారులను ఆకట్టుకుంది. లేటెస్ట్ డిజైన్, స్మార్ట్ ఫీచర్లు, ఇంకా డైలీ యూజ్‌కు తగిన విధంగా ఉండటంతో యాక్సెస్ 125 అత్యధికంగా అమ్ముడైన మోడళ్లలో ముందంజలో నిలిచింది. వాస్తవానికి, సుజుకీ విక్రయించిన మొత్తం టూవీలర్ సింహభాగం 'యాక్సెస్ 125'కి చెందింది. దేశవ్యాప్తంగా అన్ని వయస్సుల వినియోగదారులకు ఇది అనుకూలంగా ఉండటంతో, చిన్నపట్టణాలు నుంచి మెట్రో నగరాల వరకు విస్తృత ఆదరణ పొందింది.

దీంతో ఈ మోడల్ కంపెనీ అమ్మకాల పెరుగుదలకి ప్రధాన బలమైన మూలస్తంభంగా మారింది. అలాగే, యాక్సెస్ 125తో పాటు సుజుకీకి చెందిన ఇతర మోడళ్లకు కూడా మార్కెట్లో మంచి స్పందన లభిస్తోంది. బర్గ్మాన్ స్ట్రీట్, జిక్సర్ సిరీస్ వంటి బైకులు, స్కూటర్లు శక్తివంతమైన పెర్ఫార్మెన్స్‌ను అందించడంతో, వాటికి స్థిరమైన డిమాండ్ నెలకొంది. ఈ ప్రదర్శన వల్లే మే నెలలో సుజుకీ 16 శాతం వృద్ధిని సాధించగలిగింది.

Suzuki Motorcycle Sales 16 Percent Growth May 2025

సుజుకీ యాక్సెస్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన 125సీసీ స్కూటర్లలో ఒకటిగా చెప్పవచ్చు. దాని ధర రూ.87,000 నుంచి రూ.98,000 వరకు ఉండటం, వినియోగదారులకు దీన్ని ఆకర్షణీయమైన ఎంపికగా నిలిపింది. ఇవి ఎక్స్-షోరూమ్ ధరలు.ఈ స్కూటర్‌ 125సీసీ సింగిల్-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది సాధారణ రైడింగ్‌లో సుమారు 47 కిలోమీటర్ల మైలేజీని అందించగలదు. నగర ప్రయాణాల కోసం, ఉద్యోగస్తులు, కాలేజ్‌లకు వెళ్లేవారికి ఇది మంచి మైలేజ్ అవుతుంది.

అంతేకాదు, యాక్సెస్ 125 మారుతున్న వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, లేటెస్ట్ ఫీచర్లను కూడా అందిస్తోంది. ఇందులో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, టర్న్-బై-టర్న్ నావిగేషన్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇవి యువతను ఆకట్టుకునే విధంగా డిజైన్ చేయబడ్డాయి. దీని ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 5.6 లీటర్లుగా ఉంది. భద్రత పరంగా, యాక్సెస్ 125 డిస్క్, డ్రమ్ బ్రేక్ వేరియంట్లలో లభిస్తుంది.

Suzuki Motorcycle Sales 16 Percent Growth Recorded In May 2025

మరో విషయం ఏమిటంలటే, దీనికి కొనసాగింపుగా కంపెనీ యాక్సెస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఇ యాక్సెస్ పేరుతో త్వరలో తీసుకువస్తుంది. దీంతో అమ్మకాల సంఖ్య పెరుగుతుందని అంచనా.. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ నెలలోనే ఘనంగా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. గురుగ్రామ్‌లోని తయారీ కేంద్రంలో కంపెనీ ఇప్పటికే కొత్త ఇ-స్కూటర్ తయారీని ప్రారంభించింది. దీని ధర రూ. 1 లక్ష (ఎక్స్-షోరూమ్)గా ఉంటుందని అంచనా.

More from DriveSpark

Article Published On: Thursday, June 5, 2025, 12:50 [IST]
English summary
Suzuki motorcycle sales 16 percent growth recorded in may 2025 more details inside
Read more on: #suzuki motorcycle #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+