షోరూమ్‌కు వచ్చే వారు ఈ స్కూటర్ గురించే అడుగుతున్నారు.. కనీవిని ఎరుగని రీతిలో సుజుకి సేల్స్!
సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా (Suzuki Motorcycle India) ఇప్పుడు దేశంలోని అత్యంత నమ్మకమైన టూవీలర్ తయారీదారులలో ఒకటిగా ఎదిగింది. ఈ బ్రాండ్ స్కూటర్లు, బైక్‌ల విభాగంలో తమకు ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఎప్పటికప్పుడు కొత్త మోడళ్లను, నాణ్యమైన ఇంజినీరింగ్‌ను, విశ్వసనీయమైన పనితీరును అందించడం వల్ల వినియోగదారులు సుజుకిపై నమ్మకం పెంచుకున్నారు. ఇటీవలి సెప్టెంబర్ నెలలో కూడా ఈ నమ్మకం మరోసారి సుజుకి అమ్మకాల రూపంలో బయటపడింది. కంపెనీ ఈ నెలలో మొత్తం 1,23,550 టూవీలర్ వాహనాలను విక్రయించింది. గత ఏడాది ఇదే నెలలో అమ్మిన 99,185 యూనిట్లతో పోలిస్తే, ఈసారి అమ్మకాలు సుమారు 25 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ఇది సుజుకి కోసం ఒక గణనీయమైన విజయంగా చెప్పుకోవచ్చు.
మొత్తం అమ్మకాలలో 1,05,886 యూనిట్లు దేశీయ మార్కెట్లో విక్రయించబడగా, 17,664 యూనిట్లు విదేశాలకు ఎగుమతి చేయబడ్డాయి. అంతర్జాతీయ స్థాయిలో కూడా సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా తన ఉనికిని బలపరుస్తున్నది అని ఇది నిరూపిస్తోంది. ఈ అమ్మకాల వృద్ధికి ప్రధాన కారణంగా సుజుకి యాక్సెస్ 125 స్కూటర్ నిలిచింది. సొగసైన డిజైన్, మైలేజ్, పనితీరుతో యాక్సెస్ 125 వినియోగదారుల మనసును గెలుచుకుంది.

దీనితో పాటు, అవెనిస్, బర్గ్‌మాన్ స్ట్రీట్, బర్గ్‌మాన్ స్ట్రీట్ EX, జిక్సర్ సరీస్, V-స్ట్రోమ్ SX వంటి మోడళ్లు కూడా గణనీయమైన అమ్మకాలను సాధించాయి. ప్రస్తుతం భారత ద్విచక్ర వాహన మార్కెట్‌లో పోటీ తీవ్రంగా ఉన్నా, సుజుకి మాత్రం తన ప్రత్యేకతను కొనసాగిస్తోంది. ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ విషయంలో చూపుతున్న కట్టుదిట్టమైన నిబద్ధత కారణంగా, వినియోగదారుల నమ్మకం రోజురోజుకూ మరింత బలపడుతోంది.
సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా తాజా అమ్మకాల పెరుగుదలపై కంపెనీ సేల్స్ & మార్కెటింగ్ సీనియర్ ఆఫీసర్ దీపక్ ముత్రేజా స్పందించారు. ఆయన మాట్లాడుతూ, సెప్టెంబర్ నెలలో పండుగ సీజన్ రావడంతో వినియోగదారుల్లో కొత్త వాహనాలపై ఉత్సాహం గణనీయంగా పెరిగింది. ఈ సీజన్ సుజుకి ద్విచక్ర వాహనాలకు మంచి డిమాండ్‌ను సృష్టించింది. అదేవిధంగా, ఇటీవల జీఎస్టీ సవరణ కూడా కొనుగోలుదారుల ఉత్సాహాన్ని మరింతగా పెంచి, మార్కెట్‌కి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందని తెలిపారు.

సుజుకి యాక్సెస్ 125 గురించి మాట్లాడితే, ఇది దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన స్కూటర్‌లలో ఒకటి. ఈ స్కూటర్ ఎందుకు ఇంత బాగా అమ్ముడవుతోందో తెలుసుకోవాలంటే, దాని ధర, పనితీరు, ఫీచర్లు అన్నీ వినియోగదారుల అవసరాలకు అచ్చుగుద్దినట్లుగా ఉండటమే కారణం. ధరను చూస్తే సుజుకి యాక్సెస్ 125 చాలా తక్కువ ధరకే అందుబాటులో ఉంది. దాని కనిష్ట ధర రూ.80,572 నుంచి ప్రారంభమై, గరిష్టంగా రూ.97,166(ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.
ఈ ధర పరిధిలో ఇంత సమతుల్యమైన డిజైన్, ఫీచర్లు, పనితీరు అందించే స్కూటర్ చాలా అరుదు. ఇది స్టాండర్డ్ ఎడిషన్ (డ్రమ్ బ్రేక్), స్పెషల్ ఎడిషన్ (డిస్క్ బ్రేక్), రైడ్ కనెక్ట్ ఎడిషన్ (డిస్క్ బ్రేక్), రైడ్ కనెక్ట్ TFT ఎడిషన్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ప్రతి వేరియంట్ వినియోగదారుల బడ్జెట్, అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడింది. ఇంజిన్ విషయానికొస్తే, కొత్త యాక్సెస్ 125లో 124cc పెట్రోల్ ఇంజిన్ ఉంది.

ఇది శక్తివంతమైనది. స్కూటర్ లీటరుకు సగటున 47 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదు. అలాగే దీని గరిష్ట వేగం గంటకు 90 కిలోమీటర్లు, ఇది నగర రైడింగ్‌కు సరైన ఎంపికగా నిలుస్తుంది. ఫీచర్ల పరంగా కూడా ఈ స్కూటర్ ఆధునికతకు ప్రతీకగా నిలుస్తోంది. ఇందులో 4.2 అంగుళాల TFT డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, USB ఛార్జింగ్ పోర్ట్, స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్లు, డిస్క్/డ్రమ్ బ్రేక్‌లు వంటి రైడర్ భద్రతా సౌకర్యాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications








