ఈ స్కూటర్ చూసిన తర్వాత ఇంకేమీ కనిపించదు! ఫీచర్స్ విన్నవెంటనే బుక్ చేస్తారు!

భారతీయ మార్కెట్లోకి ఇటీవల కొత్త స్కూటర్ విడుదల అయింది. దేశంలో టూవీలర్ సెగ్మెంట్‌లో పెరుగుతున్న పోటీని తట్టుకుని ఎక్కువ మంది కస్టమర్లను సంపాదించడానికి ప్రముఖ వాహన తయారీ కంపెనీ సుజుకి (SUZUKI) 2025లో మళ్లీ ఒకసారి యువతను ఆకట్టుకునేలా స్టైల్‌, మైలేజీ అందించే అవెనిస్ స్కూటర్ (avenis scooter) లాంచ్ అయింది. ఈ స్కూటర్‌ను మే 17, 2025న రూ. 91,400 (ఎక్స్-షోరూమ్) ధరకు లాంచ్ చేశారు. ఇది వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని సాంకేతికంగా కూడా బలంగా రూపుదిద్దుకుంది. ఈ కొత్త అవెనిస్‌ స్కూటర్‌లోని ప్రధాన అప్‌డేట్ OBD-2B ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా పవర్‌ట్రెయిన్‌లో తీసుకువచ్చిన మార్పులే. వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకొని ఇంజిన్ పనితీరు మెరుగుపరిచారు. దీని ద్వారా తక్కువ స్థాయిలో కాలుష్యం విడుదల అవుతుంది.

స్టైల్ పరంగా చూసుకుంటే, 2025 అవెనిస్ మరింత ఆకర్షణీయంగా మారింది. కొత్త కలర్ ఛాయిస్‌లు, స్పోర్టీ డిజైన్, షార్ప్ లైన్స్‌, యువతను ఆకర్షించే డ్యూయల్ టోన్ టచ్‌ ఈ స్కూటర్‌కు ప్రత్యేక ఆకర్షణను అందిస్తున్నాయి. ఇది కేవలం ఒక ట్రాన్స్‌పోర్ట్ కోసం మాత్రమే కాదు, రోడ్డుపై స్టేట్‌మెంట్ ఇవ్వాలనుకునే వారి కోసం సరైన ఎంపికగా నిలుస్తుంది. ప్రతిరోజు ప్రయాణాలు చేసే వారికి ఇది అత్యంత అనువైన మోడల్ అవుతుంది.

2025 Avenis Scooter

2025 సుజుకీ అవెనిస్‌ స్కూటర్‌లో తీసుకువచ్చిన ముఖ్యమైన మార్పులు దీన్ని మరింత ఆకట్టుకునే విధంగా మార్చాయి. మెకానికల్ పరంగా చూసుకుంటే, ఇందులో 124.3 cc సింగిల్-సిలిండర్ ఇంజిన్ ఉపయోగించారు. ఈ ఇంజిన్‌ అల్యూమినియంతో తయారయ్యింది, దీని వల్ల తక్కువ బరువు, మెరుగైన వేడి నిరోధకత, పెరిగిన పనితీరు లభిస్తుంది. ఈ శక్తివంతమైన ఇంజిన్ 6,750 rpm వద్ద 8.5 bhp పవర్‌ను అందిస్తుంది.

అలాగే 5,500 rpm వద్ద 10 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది నగర వాతావరణంలో స్మూత్‌గా రైడ్ చేసేందుకు తగిన శక్తిని అందిస్తుంది. రైడర్లు కోరుకునే ఫీచర్స్ దీనిలో బోలెడు ఉన్నాయి. అవెనిస్ స్కూటర్‌కి ఉన్న ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఎంతో అడ్వాన్స్‌డ్‌గా రూపొందించబడింది. ఇందులో రైడర్‌కు అవసరమైన అన్ని సమాచారం ఒకే డిస్‌ప్లేలో అందుబాటులో ఉంటుంది. దీనిలో అవసరమైన సమాచారం అంతా కూడా చూడవచ్చు.

ఇంజన్ ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు ముందుగానే హెచ్చరించే హీట్ ఇండికేటర్ కూడా ఉంది. దీని ద్వారా రైడర్‌కి జాగ్రత్తగా ఉండే అవకాశం కల్పిస్తుంది. అలాగే, ఫ్యూయల్ గేజ్, ఇంధన వినియోగ మీటర్, మైలేజీ వివరాలను స్పష్టంగా చూపిస్తూ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవడంలో సహాయపడతాయి. ఎకో మోడ్ ఇండికేటర్ స్కూటర్‌ను మైలేజీ వచ్చే రీతిలో నడుపుతున్నారో లేదో తెలుపుతుంది. బ్యాటరీ వోల్టేజ్, ఆయిల్ చేంజ్ ఇండికేటర్ వంటివి కూడా దీనిలో ఉన్నాయి.

డిజిటల్ వాచ్, డ్యూయల్ ట్రిప్ మీటర్ వంటి ఫీచర్లు కూడా ప్రయాణంలో అవసరమైన వివరాలను సులభంగా తెలుసుకునేలా చేస్తాయి. ఈ ఫీచర్లన్నీ కలిపి చూస్తే, సుజుకి 2025 అవెనిస్‌ స్కూటర్‌ను టెక్నాలజీతో కూడిన స్మార్ట్ కమ్యూటింగ్ పార్ట్‌నర్‌లా తీర్చిదిద్దినట్లు చెప్పొచ్చు. రోజువారీ ప్రయాణం సౌకర్యవంతంగా ఉండాలని ఆశించే వినియోగదారుల కోసం, ఈ స్కూటర్ అన్నింటిలోనూ అద్భుతంగా నిలుస్తుంది.

ఈ స్కూటర్‌లో, ముందు భాగంలో USB పోర్ట్‌తో కూడిన స్టోరేజ్ బాక్స్ కలిగి ఉంది, ఇది మొబైల్ వంటి గాడ్జెట్‌లను ఛార్జ్ చేసుకునేందుకు ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే, ఫ్రంట్ రాక్ ద్వారా అదనపు స్టోరేజ్ స్పేస్ లభిస్తుంది, ఇది చిన్న బ్యాగ్స్ లేదా వస్తువుల్ని ఉంచడానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. వన్-పుష్ సెంట్రల్ లాకింగ్ వ్యవస్థను అందించగా, షట్టర్ కీ సిస్టమ్ ద్వారా ఇగ్నిషన్ లాక్ మరింత భద్రతను అందిస్తుంది.

ఎక్స్‌టర్నల్ హింజ్ టైప్ ఫ్యూయల్ క్యాప్ ద్వారా సీటును ఎత్తాల్సిన అవసరం లేకుండా నేరుగా పెట్రోల్ నింపుకోవచ్చు. అంతేకాదు, రైడర్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని 21.8 లీటర్ల అండర్-సీట్ స్టోరేజ్ స్పేస్‌‌ను కూడా అందించారు. ఇది హెల్మెట్, బ్యాగ్, లేదా ఇతర అవసరమైన వస్తువులు ఉంచేందుకు ఉపయోగపడుతుంది. రాత్రి ప్రయాణాలను మరింత సురక్షితంగా చేయడానికి LED లైటింగ్ కూడా ఇవ్వబడింది.

More from DriveSpark

Article Published On: Monday, May 19, 2025, 12:45 [IST]
English summary
Suzuki newly launched 2025 avenis scooter price design features and all top things
Read more on: #suzuki #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+