ఒక్క రూపాయి లేకుండా సుజుకీ స్కూటర్ కొనేయవచ్చు.. పైగా రూ.5,000 క్యాష్ బ్యాక్ కూడా.. హోండాకు గట్టిదెబ్బే!

భారతీయులకు స్కూటర్లంటే ఎంత మోజో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వాటి వినియోగ సౌలభ్యం, మోటార్‌సైకిళ్ల కంటే ఎక్కువ ప్రాక్టికల్‌గా ఉండడం వల్లనే ఆడ, మగ తేడా లేకుండా అందరూ స్కూటర్లను ఇష్టపడుతున్నారు. ఒకప్పుడు హోండా యాక్టివా, సుజుకి యాక్సెస్ వంటి కొన్ని కంపెనీలు మాత్రమే గేర్‌లెస్ మోడళ్లను మార్కెట్లోకి రిలీజ్ చేసేవి.

కానీ ఇప్పుడు దాదాపు అన్ని ప్రముఖ టూ-వీలర్ తయారీదారుల వద్ద ఈ స్కూటర్లు ఉన్నాయి. ఈ విభాగంలో ఇప్పటివరకు హోండా అగ్రగామిగా ఉన్నప్పటికీ, సుజుకి, టీవీఎస్, హీరో వంటి బ్రాండ్లు కూడా బాగానే ప్రజాదరణ సంపాదిస్తున్నాయి. సుజుకికి యాక్సెస్, బర్గ్‌మాన్, అవెనిస్ వంటి బలమైన మోడళ్లు ఉన్నాయి.

Suzuki Access Price

యాక్సెస్ బాగా అమ్ముడవుతుండగా, బర్గ్‌మాన్ స్ట్రీట్, అవెనిస్ కూడా దానికి మంచి సపోర్ట్‌గా నిలుస్తున్నాయి. ఇప్పుడు సుజుకి ఈ మూడు మోడళ్ల కోసం కొత్త ఆఫర్లు,ప్రయోజనాలతో ముందుకు వచ్చింది. తమ బ్రాండ్‌లోని ఏదైనా స్కూటర్‌ను కొనుగోలు చేసే వారికి రూ. 5,000 క్యాష్‌బ్యాక్‌తో పాటు 100 శాతం వరకు లోన్ కూడా అందిస్తోంది.

సుజుకి ఎలాంటి హైపోథెకేషన్ లేకుండా లోన్ ఇవ్వడం విశేషం. అయితే ఈ ఆఫర్లు లిమిటెడ్ టైం మాత్రమే అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది. ఆసక్తిగల వినియోగదారులు ఈ ఆఫర్ల గురించి మరింత సమాచారం కోసం దగ్గరలోని సుజుకి అధీకృత డీలర్‌షిప్‌లను సందర్శించవచ్చు.

Suzuki Access Features

సుజుకి యాక్సెస్ ఇంట్లో ఏ వయస్సు వారైనా ఉపయోగించడానికి అనువైన ఫ్యామిలీ స్కూటర్. ఇది యూత్‌కు కావాల్సిన పెర్ఫార్మెన్స్ మరియు స్టైల్‌ను, కుటుంబ సభ్యులకు కావాల్సిన మైలేజ్ మరియు స్టోరేజ్ స్పేస్‌ను కలిగి ఉన్న ఆల్‌రౌండర్. యాక్సెస్ 125 స్టాండర్డ్, స్పెషల్ మరియు రైడ్ కనెక్ట్ ఎడిషన్ అనే మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది.

సాలిడ్ ఐస్ గ్రీన్, పెర్ల్ షైనీ బేజ్, మెటాలిక్ మ్యాట్ స్టెల్లార్ బ్లూ, పెర్ల్ గ్రేస్ వైట్, మెటాలిక్ మ్యాట్ బ్లాక్ నంబర్ 2 అనే ఐదు రంగుల్లో ఇది మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. యాక్సెస్ 125 ఎక్స్-షోరూమ్ ధర రూ. 81,700నుంచి ప్రారంభమవుతుంది. ఇది 6,750ఆర్‌పిఎమ్‌ వద్ద 8.58బిహెచ్‌పి పవర్‌ను, 5,500ఆర్‌పిఎమ్‌ వద్ద 10ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేసే 125సిసి ఎయిర్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను కలిగి ఉంది.

Suzuki Bike

ఈ ఇంజన్ సివిటి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో ఈ స్కూటర్ వస్తుంది. బరువు తక్కువగా ఉండటం వల్ల యాక్సెస్ మంచి పికప్‌ను, అద్భుతమైన పెర్ఫార్మెన్స్‌ను అందిస్తుంది. దీనితో పాటు కంపెనీ 60 కిలోమీటర్ల మైలేజ్‌ను కూడా ఇస్తుందని చెబుతుంది. ఇదే ఇంజన్‌ను సుజుకి అవెనిస్, బర్గ్‌మాన్ స్ట్రీట్‌లో కూడా ఉపయోగిస్తున్నారు. కాబట్టి ఇంజన్ విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదు.

ఇటీవల కంపెనీ ఈ రెండు మోడళ్లకు 2025 మోడల్ ఇయర్ అప్‌డేట్‌లను అందించింది. బర్గ్‌మాన్ స్ట్రీట్ ధర రూ. 95,800 నుండి ప్రారంభమవుతుంది. బర్గ్‌మాన్ స్ట్రీట్ EX వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1,16,200 వరకు ఉంటుంది. మ్యాక్సీ స్కూటర్ శైలిలో రూపొందించబడిన ఇది స్టాండర్డ్ ఎడిషన్, రైడ్ కనెక్ట్ అనే రెండు వేరియంట్‌లలో వస్తుంది.

టీవీఎస్ ఎన్‌టార్క్‌ వంటి స్పోర్టీ స్కూటర్లకు పోటీగా కంపెనీ విడుదల చేసిన అవెనిస్ ప్రారంభ ధర భారతీయ మార్కెట్‌లో రూ. 93,200. మెటాలిక్ మ్యాట్ బ్లాక్ నంబర్ 2, మ్యాట్ టైటానియం సిల్వర్‌తో కూడిన అవెనిస్ కొత్త స్పెషల్ ఎడిషన్ వేరియంట్ కూడా ఇప్పుడు రూ. 94,000కు అందుబాటులో ఉంది. సుజుకి ఇకో పెర్ఫార్మెన్స్ (SEP) టెక్నాలజీ, అడ్వాన్స్‌డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్‌లతో ఈ స్కూటర్ తయారు చేశారు.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Monday, April 21, 2025, 9:14 [IST]
English summary
Suzuki offers 5 000 cashback 100 loan on access rival to activa
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+