సైలెంట్‌గా వచ్చి, సంచలనం సృష్టించబోతున్న సుజుకి ఈ-యాక్సెస్.. ఓలా, ఏథర్‌కి గట్టి పోటీ తప్పదు

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ రోజురోజుకు విస్తరిస్తోంది. ఓలా, ఏథర్ వంటి స్టార్టప్ కంపెనీలు సృష్టించిన ఈ మార్కెట్‌లో ఇప్పుడు బజాజ్, టీవీఎస్ వంటి పెద్ద బ్రాండ్లు కూడా దూసుకుపోతున్నాయి. ఈ పోటీలో తమకంటూ ఒక స్థానాన్ని పదిలం చేసుకోవడానికి జపాన్ దిగ్గజం సుజుకి కూడా సిద్ధమైంది. ఆటో ఎక్స్‌పో 2025లో సుజుకి ప్రదర్శించిన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ-యాక్సెస్ త్వరలోనే భారత మార్కెట్లోకి రాబోతోంది. ఈ స్కూటర్ ఫీచర్లు, ధర, లాంచ్ తేదీ వివరాలు ఈ వార్తలో తెలుసుకుందాం.

లాంచ్, డిజైన్ వివరాలు
సుజుకి ఈ-యాక్సెస్ ఎలక్ట్రిక్ స్కూటర్ సెప్టెంబర్ 2025లో లాంచ్ అవుతుందని తాజా రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా పండుగ సీజన్‌ను లక్ష్యంగా చేసుకుని సుజుకి ఈ లాంచ్ టైమ్‌ను ఎంచుకున్నట్లు సమాచారం. తొలి దశలో దేశంలోని 30 ప్రధాన నగరాల్లో ఈ స్కూటర్‌ను విడుదల చేయనున్నారు. అనంతరం ఈ ఏడాది చివరి నాటికి అన్ని నగరాలకు విస్తరించాలని కంపెనీ ప్రణాళికలు సిద్ధం చేసింది.

Suzuki to Launch First Electric Scooter e-Access with 95 KM Range

ఈ-యాక్సెస్ డిజైన్ విషయంలో ఇది పెట్రోల్ యాక్సెస్ స్కూటర్ నుండి కొంత స్ఫూర్తి పొందినట్లు కనిపిస్తోంది. ఇందులో షార్ప్ లుకింగ్ ఎల్ఈడీ హెడ్‌లైట్లు, స్టైలిష్ సైడ్ ప్యానెల్స్, పొడవాటి, సౌకర్యవంతమైన సీటు, అలాగే ఫ్లాట్ ఫుట్‌వెల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా సీటు కింద 17 లీటర్ల స్టోరేజ్ స్పేస్ కూడా ఉంది. ఇది రోజువారీ అవసరాలకు చాలా ఉపయోగపడుతుంది.

బ్యాటరీ, పర్ఫార్మెన్స్
సుజుకి ఈ-యాక్సెస్‌లో 3.07 kWh లిథియం ఐరన్ ఫాస్ఫేట్ (LFP) బ్యాటరీని అమర్చారు. ఎల్‌ఎఫ్‌పీ బ్యాటరీలను ఉపయోగించిన మొదటి కంపెనీలలో సుజుకి కూడా ఒకటి. ఇది సురక్షితమైనది, అలాగే ఎక్కువ కాలం మన్నుతుంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే సుమారు 95 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ పేర్కొంది. అయితే సాధారణ వాస్తవ పరిస్థితుల్లో 75-80 కిలోమీటర్ల రేంజ్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

Suzuki to Launch First Electric Scooter e-Access with 95 KM Range

ఈ స్కూటర్‌లో 4.1 kW కెపాసిటీ గల పర్మనెంట్ మ్యాగ్నెట్ మోటారును ఉపయోగించారు. ఇది 15 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీంతో ఈ-యాక్సెస్ గంటకు గరిష్టంగా 71 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. రోజువారీ ప్రయాణాలకు ఈ వేగం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఇందులో ఈకో, రైడ్ మోడ్ ఎ, రైడ్ మోడ్ బి వంటి మూడు రైడింగ్ మోడ్స్ కూడా ఉన్నాయి.

ఛార్జింగ్, పోటీదారులు
ఈ-యాక్సెస్ స్కూటర్‌కు పోర్టబుల్ ఆఫ్‌బోర్డ్ ఛార్జర్ లభిస్తుంది. దీనితో స్కూటర్‌ను 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయడానికి 4 గంటల 30 నిమిషాలు పడుతుంది. పూర్తిగా ఛార్జ్ అవ్వడానికి 6 గంటల 42 నిమిషాలు పడుతుంది. అదే డీసీ ఫాస్ట్ ఛార్జర్ ఉపయోగిస్తే కేవలం 1 గంట 12 నిమిషాల్లోనే 80 శాతం వరకు ఛార్జింగ్ పూర్తవుతుంది.

Suzuki to Launch First Electric Scooter e-Access with 95 KM Range

భారత మార్కెట్లో ఈ-యాక్సెస్ స్కూటర్ ఓలా ఎస్1, ఏథర్ రిజ్తా, టీవీఎస్ ఐక్యూబ్, బజాజ్ చేతక్ వంటి ప్రధాన మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. ఈ స్కూటర్ల రేంజ్ సుమారు 120-150 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అయితే సుజుకి తన క్వాలిటీ, పర్ఫామెన్స్‎తో మార్కెట్లో నిలబడాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ స్కూటర్ ప్రారంభ ధర సుమారు రూ.లక్ష నుండి రూ.1.2 లక్షల మధ్య ఉండవచ్చని అంచనా.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Friday, August 29, 2025, 18:22 [IST]
English summary
Suzuki to launch first electric scooter e access with 95 km range
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+