తక్కువ ధరకే అడ్వెంచర్ టూరర్ బైక్‌ను సొంతం చేసుకునే ఛాన్స్.. ఎక్స్ఛేంజ్‌తో పాటు భారీ క్యాష్‌బ్యాక్..
భారత్‌లో అడ్వెంచర్ టూరింగ్ బైకులకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ఇటీవల కాలంలో చాలా మంది బైక్స్‌తో లాంగ్ టూర్లకు, ఆఫ్‌రోడ్ రైడింగ్‌లకు ఇంట్రెస్ట్ చూపిస్తుండటంతో ఇలాంటి మోడళ్లు ఇప్పుడు మార్కెట్లోకి వరుసగా విడుదల అవుతున్నాయి. బైకుల రారాజు రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ వంటి బైక్స్‌తో పాటు జపనీస్ టూవీలర్ తయారీదారు సుజుకీకి కూడా పలు మోడళ్లను విక్రయిస్తుంది. అయితే హిమాలయన్ మోడల్ దేశీయంగా బాగా అమ్ముడుపోతున్న అడ్వెంచర్ టూరింగ్ బైకుల జాబితాలో ముందు స్థానంలో ఉంటుంది. ఈ క్రమంలో దీనికి పోటీగా సుజుకీకి(Suzuki) చెందిన ఇదే తరహా బైక్ 250cc అడ్వెంచర్ టూరర్ V-Strom SX ప్రస్తుతం అమ్మకానికి అందుబాటులో ఉంది. ఈ బైక్‌ను ఆఫ్ రోడ్ రైడింగ్‌లకు అత్యంత అనువైన మోడల్ అని సుజుకీ పేర్కొంది. హైవే మార్గాల్లో టూరింగ్‌కు ప్లాన్ చేసిన వారికి కూడా ఇది బెస్ట్ ఆప్షన్.
అయితే ఈ అడ్వెంచరర్ టూరర్ అమ్మకాలను పెంచడానికి సుజుకీ ప్రస్తుతం అదిరిపోయే ఆఫర్స్‌ను అందిస్తుంది. ఈ నెలలో అడ్వెంచర్ టూరర్ V-Strom SX బైక్‌ను కొనుగోలు చేసే కస్టమర్లకు రూ. 15,000 వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను అలాగే, రూ. 20,000 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఇస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఆఫర్స్ ద్వారా షోరూమ్‌కు కస్టమర్లను ఆకర్షించవచ్చని దీంతో ఈ బైక్ సేల్స్ పెరుగుతాయని కంపెనీ భావిస్తుంది.

అలాగే, కంపెనీ ఎక్స్-షోరూమ్ ధరలో 100 శాతం వరకు లోన్ ఫెసిలిటీ కూడా అందిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఇది ఎంత కాలం వరకు అందుబాటులో ఉంటుందో ఆ వివరాలు తెలియజేయలేదు. 250cc విభాగంలో అడ్వెంచర్ టూరింగ్‌ను కోరుకునే వారు అడ్వెంచర్ టూరర్ V-Strom SXను కొనుగోలు చేయాలనుకుంటే ఈ ఆఫర్స్ గురించిన మరింత స్పష్టమైన సమాచారం కోసం మీ దగ్గరలోని కంపెనీ డీలర్‌షిప్‌ను సంప్రదించడం ఉత్తమం.
ఎందుకంటే ఏరియాను బట్టి ఆఫర్స్‌లో కూడా పలు మార్పులు ఉంటాయి. లోన్ సౌకర్యం కూడా ప్రాంతాలను బట్టి వేరుగా ఉండే అవకాశం ఉంది. కొనుగోలు సమయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండటానికి ముందుగా ఆఫర్స్ గురించి అధీకృత డీలర్‌షిప్‌లను సంప్రదించి తెలుసుకోండి. V-Strom SX బైక్ ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 249cc ఇంజిన్‌తో రన్ అవుతుంది. ఇది 26 bhp పవర్, 22.2 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఈ ఇంజిన్ ప్రత్యేకంగా సుజుకీ ఆయిల్ కూలింగ్ సిస్టమ్ (SOCS), సింగిల్-సిలిండర్ టెక్నాలజీని కలిగి ఉంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ను ఇంజిన్ జత చేశారు. దీంతో రైడింగ్ ఈజీగా అనిపిస్తుంది. దీని బరువు 167 కిలోగ్రాముల వరకు ఉంటుంది. ఆన్-రోడ్‌లో ఏవిధంగా అయితే సాఫీగా ప్రయాణిస్తుందో అదే విధంగా ఆఫ్ రోడ్‌లో కూడా అలాగే రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది.
దీని సీటింగ్ నిటారుగా కంఫర్ట్‌గా ఉంటుంది. ప్రధానంగా టూరింగ్-ఓరియెంటెడ్ బైక్ కాబట్టి ఇది రైడర్లకు అవసరమయ్యే అధునాతన ఫీచర్స్‌ను కలిగి ఉంది. USB ఛార్జింగ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, డ్యూయల్-పర్పస్ సెమీ-బ్లాక్ ప్యాటర్న్ టైర్లు మొదలైనవి ఉన్నాయి. ఇది గ్లాస్ స్పార్కిల్ బ్లాక్, ఛాంపియన్ ఎల్లో నంబర్ టూ, పెర్ల్ బ్లేజ్ ఆరెంజ్ కలర్స్‌లో అందుబాటులో ఉంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








