లోకల్ వాళ్లు పట్టించుకోలేదు.. ఫారిన్ వాళ్లు మాత్రం తెగ కొనేశారు..జీఎస్టీ తగ్గింపు కూడా సుజుకీకి కలిసొచ్చింది

అక్టోబర్ 2025లో భారతీయ టూ వీలర్ వెహికల్ రంగం అద్భుతమైన వృద్ధిని నమోదు చేయగా సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా (Suzuki Motorcycle India - SMIPL) కూడా ఈ విజయంలో భాగమైంది. ముఖ్యంగా ఎగుమతి (Exports) విభాగంలో అనూహ్యమైన వృద్ధిని సాధించడం ద్వారా, సుజుకి కంపెనీ తమ చరిత్రలోనే ఒక నెలలో అత్యధిక అమ్మకాలను నమోదు చేసింది. పండుగ సీజన్‌తో పాటు, కొత్త జీఎస్టీ సంస్కరణలు (GST Reforms), ప్రపంచ మార్కెట్‌లో ఉన్న బలమైన డిమాండ్ కారణంగా సుజుకి టూ-వీలర్లు విదేశాలకు భారీగా తరలి వెళ్లాయి.

సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా కంపెనీ గత 2025 అక్టోబర్ నెలకు సంబంధించిన అమ్మకాల వివరాలను విడుదల చేసింది. వీటి ప్రకారం, గత నెలలో సుజుకి మోటార్‌సైకిల్ కంపెనీకి విదేశీ ఎగుమతులు (Foreign Exports) అమ్మకాల వృద్ధికి ప్రధాన చోదకశక్తిగా నిలిచాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఇప్పుడు చూద్దాం.

Suzuki s Record Sales in October Strong Exports Offset Domestic Demand Decline

సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (SMIPL) గత అక్టోబర్ నెలలో మొత్తం 1,29, 261 టూ వీలర్లను విక్రయించి, తన చరిత్రలోనే ఒక నెలలో అత్యధిక అమ్మకాలను నమోదు చేసింది. ఇందులో సుజుకి కంపెనీ దేశీయ, విదేశీ అమ్మకాలు ఉన్నాయి.

గత 2024 అక్టోబర్ నెలలో విక్రయించిన 1,20,055 సుజుకి టూ వీలర్లతో పోలిస్తే ఇది 7.67% వృద్ధిని సూచిస్తుంది. అదే సమయంలో, 2025 సెప్టెంబర్‌లో విక్రయించిన 1,23,550 సుజుకి టూ వీలర్లతో పోలిస్తే అమ్మకాలు 4.62% పెరిగాయి.

Suzuki s Record Sales in October Strong Exports Offset Domestic Demand Decline

ఇంతకు ముందు చెప్పినట్లుగా సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా కంపెనీ అమ్మకాల వృద్ధి ముఖ్యంగా ఎగుమతి విభాగంలో కనిపించింది. అదే సమయంలో దేశీయ డిమాండ్ కాస్త మందకొడిగా ఉంది. గత నెలలో సుజుకి దేశీయ అమ్మకాలు 1,03,454 టూ వీలర్లుగా ఉన్నాయి. ఇది 2024 అక్టోబర్‌లో భారతదేశంలో విక్రయించిన 1,04,940 సుజుకి టూ వీలర్లతో పోలిస్తే 1.42% క్షీణతను చూపుతుంది.

అదేవిధంగా, 2025 సెప్టెంబర్‌లో విక్రయించిన 1,05,886 సుజుకి టూ వీలర్తో పోలిస్తే కూడా 2.30% క్షీణత కనిపించింది. సుజుకి మోటార్‌సైకిల్ మొత్తం అమ్మకాలలో దేశీయ అమ్మకాల వాటా 80.03% గా ఉండగా, ఎగుమతుల వాటా 19.97% గా ఉంది. గత నెలలో సుజుకి 2-వీలర్ల ఎగుమతులు 70.74% పెరిగి 25 వేల 807 యూనిట్లకు చేరుకున్నాయి.

Suzuki s Record Sales in October Strong Exports Offset Domestic Demand Decline

ఇది అంతకుముందు 2024 అక్టోబర్ నెలలో ఎగుమతి చేయబడిన 15,115 సుజుకి 2-వీలర్ల సంఖ్య కంటే 10,692 యూనిట్లు ఎక్కువ. ప్రపంచ మార్కెట్‌లలో మేడ్-ఇన్-ఇండియా(Made-in-India) సుజుకి 2-వీలర్లకు డిమాండ్ నిరంతరం ఎక్కువగా ఉన్నందున, 2025 సెప్టెంబర్‌లో విదేశాలకు పంపిన 17,664 సుజుకి 2-వీలర్లతో పోలిస్తే, గత అక్టోబర్ నెలలో ఎగుమతి చేయబడినవి 46.10% ఎక్కువ.

గత అక్టోబర్ నెలలో మాత్రమే కాకుండా, 2025 ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు ఉన్న కాలంలో కూడా సుజుకీ కంపెనీ దేశీయ అమ్మకాలు, విదేశీ ఎగుమతులు గణనీయంగా మెరుగుపడ్డాయి. ఈ కాలంలో సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా కంపెనీ ప్రపంచవ్యాప్తంగా మొత్తం 8 లక్షల 17 వేల 435 ద్విచక్ర వాహనాలను విక్రయించింది.

ఇది అంతకుముందు సంవత్సరం ఇదే కాలంలో విక్రయించిన 7 లక్షల 40 వేల టూ వీలర్ల కంటే 10.46% ఎక్కువ. దీని ప్రకారం చూస్తే, గత 7 నెలల్లో సుజుకి మోటార్‌సైకిల్ సుమారు 77,435 అదనపు టూ వీలర్లను విక్రయించింది. సుజుకి దేశీయ అమ్మకాలు ఈ 7 నెలల కాలంలో 6,73, 926 ద్విచక్ర వాహనాల అమ్మకాలతో సానుకూల స్థితిలో ముగిసింది.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం: 2025 అక్టోబర్ నెల సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా వృద్ధి ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. ఇది సుజుకి మోటార్‌సైకిల్ కంపెనీ ఉత్పత్తులపై కస్టమర్‌లు ఉంచిన నమ్మకానికి ప్రత్యక్ష ప్రతిబింబం. అంతేకాకుండా, సుజుకి ఈ అద్భుతమైన అమ్మకాలకు పండుగ సీజన్ (Festive Season), కొత్త GST సంస్కరణలు (GST Reforms), ప్రపంచ మార్కెట్‌లలో ఉన్న బలమైన డిమాండ్ కూడా కారణం.

More from DriveSpark

Article Published On: Monday, November 10, 2025, 7:17 [IST]
English summary
Suzukis record sales in october strong exports offset domestic demand decline
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+