రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ కొనాలని చూస్తున్నారా.. ఆ డేట్ వరకు ఆగండి క్రేజీ మోడల్ వచ్చేస్తోంది

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ మన దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడుపోతూ సంచలనం సృష్టిస్తోంది. ప్రస్తుతం ఈ బైక్ యూత్ ఫేవరేట్‎గా మారిపోయింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ వాళ్లను టార్గెట్‎గా చేసుకుని ఎప్పటికప్పుడు లేటెస్ట్ బైక్స్ తీసుకొస్తుంది. అద్భుతమైన ఫీచర్లు, అందుబాటులో ఉండే ధర కారణంగా మధ్య తరగతి వాళ్లు కూడా వీటిని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఇండియాలోని మోటార్ సైకిల్ విభాగంలో ఓ సంచలనం. గతంలో ఎన్ ఫీల్డ్ లైనప్‌లో భావోద్వేగాలు, వైబ్రేషన్స్‎తో నిండిన పాత బైక్స్ ఉండేవి. ఇప్పటి కాలానికి తగినట్లు షో రూంలలో చాలా ఆధునిక బైక్స్ చూడవచ్చు. కంపెనీ ప్రస్తుత శ్రేణిలో హంటర్ 350, గెరిల్లా 450, హిమాలయన్ 450, బేర్ 650 వంటి పాపులర్ యూత్ బైక్స్ ఉన్నాయి.

Royal Enfield New Bike

ఈ గ్రూప్‌లో త్వరలో కొత్త బైక్ యాడ్ కాబోతుంది. అదే క్లాసిక్ 650. ఇటలీలోని మిలన్‌లో జరిగిన EICMA మోటార్ షోలో ఆవిష్కరించబడిన ఈ వెహికల్ ఇండియాకు ఎప్పుడు వస్తుందోనని మోటార్‌సైకిల్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వెయిటింగ్ పిరియడ్ కు ముగింపు పలుకుతూ రెట్రో క్లాసిక్ బ్రాండ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ లాంచ్ తేదీని ప్రకటించింది.

ఇండియన్ మార్కెట్ కోసం క్లాసిక్ 650 మోడల్ ధరను కంపెనీ మార్చి 27,2025న ప్రకటించనుంది. దీని బ్రాండ్ లైనప్‌లో ఎంతో ఇష్టపడే 650 పారలల్ ట్విన్-సిలిండర్ ఇంజిన్‌తో నడిచే ఆరో మోటార్ సైకిల్ అవుతుంది. గతంలో 500సీసీ నిలిపివేయడంతో విచారంలో ఉన్న బైక్ ప్రియులకు కొత్త క్లాసిక్ 650 కచ్చితంగా ఆనందాన్ని కలిగిస్తుంది.

Royal Enfield Look

డిజైన్‌ను చూస్తే ఇది మొదటి చూపులో 350సీసీ క్లాసిక్‌లా కనిపిస్తుంది. కానీ ఆకారం పరంగా క్లాసిక్ 650 దానికి చాలా దూరంగా ఉంటుంది. దీని రెట్రో లుక్ కోల్పోకుండా, టియర్‌డ్రాప్ ఫ్యూయల్ ట్యాంక్, స్పోక్డ్ రిమ్స్, న్యూట్రల్ రైడింగ్ ట్రయాంగిల్‌తో దీనిని నిర్మించడం అభిమానులను ఆనందపరుస్తుంది.

అన్ని లైటింగ్ అంశాలు గుండ్రంగా ఉన్నాయి. ప్రధాన హెడ్‌ల్యాంప్ LED యూనిట్‌గా ఉండటమే కాకుండా, రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 మోటార్‌సైకిల్‌లో సింగిల్ సీటుతో పాటు పిలియన్ సీటు ఆఫ్షన్ కూడా లభిస్తుంది. ఈ వాహనం టీల్, వల్లం రెడ్, బ్రుండింగ్‌థోర్ప్ బ్లూ, బ్లాక్ క్రోమ్ అనే 4కలర్ ఆఫ్షన్లలో అందుబాటులో ఉంటుందని తెలిసింది.

ఫీచర్ల పరంగా రాబోయే కొత్త క్లాసిక్ 650సీసీ మోడల్ 350 వెర్షన్ మాదిరిగానే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను పొందుతుంది. ఈ క్లస్టర్‌లో టెల్‌టేల్ లైట్స్‌తో కూడిన అనలాగ్ స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, ఫ్యూయల్ స్టేటస్, సర్వీస్ రిమైండర్ చూపించే చిన్న డిజిటర్ రీడౌట్, గేర్ పొజిషన్ ఇండికేటర్, వాచ్ కూడా ఉంటుంది.

Royal Enfield 650

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650లో ట్రిప్పర్ నావిగేషన్ సిస్టమ్‌ను కూడా అందిస్తున్నారు. ఈ మోటార్ సైకిల్ 270-డిగ్రీల ఫైరింగ్ ఆర్డర్‌ను ఉపయోగించే అదే 647cc, ఎయిర్-ఆయిల్ కూల్డ్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. స్లిప్పర్ అసిస్ట్ క్లచ్‌తో 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో ఈ ఇంజిన్, 7,250 rpm వద్ద 46.39 bhpపవర్, 5,650 rpm వద్ద 52.3 Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది.

ఇతర మెకానికల్ అంశాల విషయానికి వస్తే.. రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 బైక్‌లో ముందు టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక భాగంలో షోవా నుండి ట్విన్ షాక్‌లు సస్పెన్షన్ కోసం ఉన్నాయి. రైడర్ సేఫ్టీ కోసం ముందు, వెనుక డిస్క్ బ్రేక్స్ అందించారు. అలాగే బైక్‎లో డ్యూయల్-ఛానల్ ABS కూడా అందించారు.

FAQs
DriveSpark Automotive

More from DriveSpark

Article Published On: Thursday, March 20, 2025, 17:45 [IST]
English summary
Thinking of buying a royal enfield wait until this date for the exciting new model
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+