రిలీజ్ అయి కొద్ది రోజులు కూడా కాలేదు.. అప్పుడే ఆ బైక్ ధర పెంచేసిన టీవీఎస్
ఇండియన్ మోటార్‌సైకిల్ సెగ్మెంట్‌ను ఒక్కసారిగా షాక్ చేస్తూ టీవీఎస్ (TVS) తమ సరికొత్త 300 సీసీ అడ్వెంచర్ టూరర్‌ను కొద్ది రోజుల క్రితం విడుదల చేసింది. వాస్తవానికి అపాచీ RTX 300 అనే పేరుతో వచ్చిన ఈ అడ్వెంచర్ బైక్‌కు అతిపెద్ద హైలైట్ దాని ధర. ఈ క్లాస్‌లో దొరకనన్ని ఫీచర్లతో నిండిన ఈ మోడల్ ఒక పెద్ద ట్రెండ్‌ను సృష్టించింది.
చాలా మంది వాట్సాప్ స్టేటస్‌లు, ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలను ఈ బైక్ ఆక్రమించుకుంది. ఇప్పుడు షోరూమ్‌లలో ఈ బైక్ కోసం జనం ఎదురుచూస్తున్నారు R, T, X అనే పదం ర్యాలీ (Rally), టూరర్ (Tourer), ఎక్స్‌ట్రీమ్ (eXtreme) లను సూచిస్తుంది.

ఈ అడ్వెంచర్ మోటార్‌సైకిల్ ఒక టూరర్, ఆఫ్-రోడర్ రెండింటి మిశ్రమం అని బ్రాండ్ చెబుతోంది. టీవీఎస్ అపాచీ RTX 300 బేస్, టాప్, BTO (Build To Order) అనే మూడు వేరియంట్‌లలో వస్తుంది. వీటి ఎక్స్-షోరూమ్ ధరలు వరుసగా రూ.1.99 లక్షలు, రూ.2.14 లక్షలు, రూ.2.29 లక్షలు. అయితే, విడుదలైన కొద్ది రోజులకే కంపెనీ ఈ మోడల్ ధరను పెంచింది.
టీవీఎస్ అపాచీ RTX 300 అడ్వెంచర్ బైక్‌లో కేవలం టాప్-ఎండ్ BTO వేరియంట్ ధరను మాత్రమే కంపెనీ పెంచింది. గతంలో రూ.2.29 లక్షలు ఉన్న ఈ మోడల్ ధరను ఇప్పుడు రూ.2.34 లక్షలకు (ఎక్స్-షోరూమ్) పెంచారు. అంటే, దాదాపు రూ.5,000 పెరిగింది అన్నమాట. మిగిలిన బేస్, టాప్ వేరియంట్‌లు పాత ధరలలోనే దొరుకుతాయి కాబట్టి ఇది కొంచెం ఊరటనిచ్చే విషయం.

టీవీఎస్ RTX ను మొదట ఆరంభ ధరతో విడుదల చేసింది కాబట్టి, ఈ ధర పెంపు అందరూ ఊహించినదే. త్వరలో బేస్, టాప్ వేరియంట్‌ల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని సమాచారం. కాబట్టి, ఈ అడ్వెంచర్ మోటార్‌సైకిల్‌ను కొనాలని ప్లాన్ చేస్తున్న వారందరూ ఆలస్యం చేయకుండా బుక్ చేసుకుంటే మంచిది. లేదంటే ఇంకొంచెం ఎక్కువ డబ్బులు ఖర్చు చేయడానికి రెడీగా ఉండండి.
టీవీఎస్ RTX 300 బైక్‌ను వైపర్ గ్రీన్, టార్న్ బ్రోంజ్, మెటాలిక్ బ్లూ, లైటెనింగ్ బ్లాక్, పెర్ల్ వైట్ అనే 5 అద్భుతమైన కలర్ ఆప్షన్‌లలో విడుదల చేశారు. చూడగానే ఎవరినైనా ఫ్యాన్ చేసే అద్భుతమైన లుక్ అపాచీ అడ్వెంచర్‌కు ఉంది. ఇది ఒక ప్రీమియం అడ్వెంచర్ మోటార్‌సైకిల్‌లా అనిపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ LED హెడ్‌లైట్ సెటప్‌తో కూడిన సెమీ ఫెయిరింగ్ రోడ్డుపై ఒక అద్భుతమైన ప్రెజెన్స్‌ను ఇస్తుంది.

అడ్వెంచర్ బైక్ ఫెయిరింగ్, దాని ఫ్రంట్ విండ్‌షీల్డ్ హైవే టూరింగ్‌లో గాలి నుండి రక్షణ కల్పించే విధంగా రూపొందించబడ్డాయి. LED హెడ్‌లైట్‌లు, LED టెయిల్ లైట్‌లు, LED టర్న్ ఇండికేటర్‌లు కూడా RTX అడ్వెంచర్‌కు బాగా నప్పుతాయి. హ్యాండిల్‌బార్‌కి అమర్చిన మిర్రర్‌లు, స్ప్లిట్ సీట్ సెటప్, బలంగా ఉండే రియర్ లగేజ్ ర్యాక్ అన్నీ కలిసి బైక్‌ను మరింత పర్ఫెక్ట్‌గా చేస్తాయి.
పూర్తిగా అడ్జస్ట్ చేసుకోదగిన గోల్డెన్ ఫినిష్‌తో కూడిన 41 mm USD (అప్‌సైడ్ డౌన్) టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్‌లు, రియర్ మోనో-షాక్, అప్‌స్వెప్ట్ ఎగ్జాస్ట్ (పైకి లేచిన సైలెన్సర్) కూడా టీవీఎస్ అపాచీ RTX 300 అడ్వెంచర్‌లో హైలైట్‌లు. టూర్ (Tour), ర్యాలీ (Rally), అర్బన్ (Urban), రెయిన్ (Rain) అనే రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. ABS, ట్రాక్షన్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్ వంటి సేఫ్టీ ఫీచర్లతో వస్తుంది.

గూగుల్ మ్యాప్స్‌తో మ్యాప్ మిర్రరింగ్, నావిగేషన్, బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన TFT ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటివి RTX 300 అడ్వెంచర్‌లోని ముఖ్యమైన ఫీచర్లు.
గత సంవత్సరం మోటోసోల్ ఈవెంట్‌లో ప్రవేశపెట్టిన ఈ 299.1 సీసీ DOHC 4V/సిలిండర్ సింగిల్-సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ 9,000 ఆర్‌పిఎమ్ వద్ద 35 bhp పవర్, 7,000 ఆర్‌పిఎమ్ వద్ద 28.5 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. స్లిప్పర్ అసిస్ట్ క్లచ్, క్విక్-షిఫ్టర్‌తో కూడిన 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో ఇంజిన్ జత చేయబడింది. KTM అడ్వెంచర్ సిరీస్, రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్, యెజ్డి అడ్వెంచర్ వంటి బైక్‌లతో టీవీఎస్ ఈ కొత్త మోడల్ పోటీ పడుతుంది.


Click it and Unblock the Notifications








