పేదవాడి బండికి ప్రత్యామ్నాయాలు - హీరో స్ప్లెండర్ ప్లస్‌కు పోటీగా 3 ఉత్తమ బైక్‌లు!
ఇండియాలో హీరో స్ప్లెండర్ ప్లస్ ఒక పాపులర్ మోటార్ సైకిల్. ఇది మధ్యతరగతి ప్రజలకు అనువైన బైక్. దీని ధర రూ. 76,000 నుంచి రూ. 79,000 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఇది 97.2సీసీ పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. లీటరుకు 70 కి.మీ కంటే ఎక్కువ మైలేజీని అందిస్తుంది. ఇది ఫోర్స్ సిల్వర్, బ్లాక్ రెడ్ పర్పుల్ వంటి వివిధ రంగుల్లో లభిస్తుంది. సేఫ్టీ కోసం డ్రమ్ బ్రేక్‌లను కలిగి ఉంది.
ఈ బైక్ ఫ్యూయెల్ కెపాసిటీ 9.8 లీటర్లను కలిగి ఉంటుంది. హీరో స్ప్లెండర్ ప్లస్‌కు ప్రత్యామ్నాయంగా వినియోగదారులు ఈ మూడు బైక్‌లను కూడా పరిశీలించవచ్చు. వాటి ధర, ప్రత్యేకతల గురించి ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

TVS Radeon: ఈ మోటార్ సైకిల్ ధర రూ.70,000 నుంచి రూ.84,000 (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. ఇది 109.7 సీసీ సింగిల్-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 8.19 హార్స్‌పవర్ శక్తిని, 8.7 ఎన్ఎం (న్యూటన్ మీటర్) పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 4-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ కూడా ఉంది.
ఈ టీవీఎస్ రేడియన్ బైక్ లీటరుకు 73కిలోమీటర్ల వరకు మైలేజీని ఇస్తుంది. డ్యూయల్-పాడ్ అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్‌తో సహా వివిధ ఫీచర్స్ కలిగి ఉంది. ఇది బ్లూ, మెటల్ బ్లాక్, రాయల్ పర్పుల్ రంగుల్లో లభిస్తుంది. కొత్త రేడియన్ బైక్ బరువు 113 కిలోలు, ప్రయాణీకుల భద్రత కోసం డ్రమ్ బ్రేక్‌లను పొందుతుంది.

Honda CD 110 Dream : ఇది హీరో స్ప్లెండర్ ప్లస్‌కు ప్రత్యామ్నాయం కూడా. దీని ధర రూ. 76,000 (ఎక్స్-షోరూమ్). ఇది 109.51సీసీ ఎయిర్-కూల్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 8.79 పీఎస్ హార్స్‌పవర్, 9.30 ఎన్ఎం పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 4-స్పీడ్ గేర్‌బాక్స్ ఉంది.
కొత్త హోండా సీడీ 110 డ్రీమ్ మోటార్‌సైకిల్ లీటరుకు 65 కిలోమీటర్ల వరకు మైలేజీని అందిస్తుంది. ఇది రెండు-పాడ్ అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ సెటప్, స్టార్ట్/స్టాప్ స్విచ్, సైడ్-స్టాండ్ ఇంజిన్ కట్-ఆఫ్ వంటి వివిధ ఫీచర్స్ పొందుతుంది. ఇది బ్లాక్ విత్ బ్లూ, బ్లాక్ విత్ రెడ్, బ్లాక్ విత్ గ్రీన్, బ్లాక్ గ్రే రంగుల్లో కూడా లభిస్తుంది. సేఫ్టీ కోసం దీనికి డ్రమ్ బ్రేక్‌లు ఉన్నాయి.

Bajaj CT 110X: ఈ బైక్ ధర రూ. 70,000 (ఎక్స్-షోరూమ్). 115.45 సీసీ ఎయిర్-కూల్డ్ పెట్రోల్ ఇంజన్ అందుబాటులో ఉంది. ఇది 8.6 పీఎస్ హార్స్‌పవర్, 9.8 ఎన్ఎసం పీక్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులో 4-స్పీడ్ గేర్‌బాక్స్ కూడా ఉంది.
ఈ బజాజ్ సిటీ 110ఎక్స్ మోటార్ సైకిల్ లీటరకు 70 కిలోమీటర్ల వరకు మైలేజీని అందిస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 90 కి.మీ. ట్విన్ పాడ్ అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌తో సహా వివిధ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ కొత్త బైక్ బరువు 127 కిలోలు, ప్రయాణీకుల సేఫ్టీ కోసం డ్రమ్ బ్రేక్‌లను కలిగి ఉంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








