పెట్రోల్ భయం లేదు.. రూ.60వేల లోపు బడ్జెట్లో పేదవారికి కూడా అందుబాటులో ఉండే బెస్ట్ బైక్స్ ఇవే
టూవీలర్ కొనాలని అనుకునేవారు, ముఖ్యంగా బడ్జెట్ ధరలో మంచి మైలేజ్ ఇచ్చే బైక్ కావాలనుకునేవారు చాలా మంది ఉంటారు. ఒకప్పుడు బడ్జెట్ బైక్ అంటే మైలేజ్ ఒక్కటే చూసేవారు. కానీ ఇప్పుడు మంచి డిజైన్, కొన్ని ఆధునిక ఫీచర్లు కూడా కావాలని కోరుకుంటున్నారు. అయితే, రూ. 60,000 లోపు ధరలో మంచి మైలేజ్ ఇచ్చే, నమ్మదగిన బైక్‌లు ఉన్నాయని చాలా మందికి తెలియదు.
అందుకే తక్కువ ధరలో మంచి మైలేజ్ ఇచ్చే కొన్ని బెస్ట్ బైక్‌ల వివరాలు ఇక్కడ అందిస్తున్నాం. ఈ బైక్‌లు బడ్జెట్ ధరలో ఉన్నా మీ అవసరాలను తీర్చగలవు. మరి ఆ బైక్‌లు ఏంటో ఇప్పుడు చూద్దాం రండి.

భారతదేశంలో బడ్జెట్ ధరలో దొరికే బైక్‌లు పేద, మధ్య తరగతి ప్రజలకు చాలా ముఖ్యమైనవి. ఎక్కువ మంది కొనేవారు మైలేజ్, నమ్మకం, మరియు తక్కువ మెయింటెనెన్స్ ఉన్న బైక్‌లనే వెతుకుతారు. వాహనాలు తయారుచేసే కంపెనీలు కూడా కస్టమర్ల కోరికలకు తగ్గట్టుగా తక్కువ ధరలో మంచి బైక్‌లను అందిస్తున్నాయి.
చాలా మందికి రూ.60,000 కన్నా తక్కువ ధరలో మంచి మైలేజ్, ఆధునిక డిజైన్ ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్న బైక్‌లు దొరుకుతాయని తెలియదు. కింద చెప్పిన ఎంట్రీ లెవెల్ బైక్‌లు మీ అవసరాలకు సరిపోవచ్చు.

హీరో HF100: హీరో HF100 (Hero HF100) బైక్ రూ.59,018 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరలో దొరుకుతుంది. దీనిలో 97.2 సీసీ ఎయిర్-కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 7.9 బీహెచ్‌పి (బ్రేక్ హార్స్‌పవర్) పవర్‌ను, 8.05 ఎన్ఎమ్ (న్యూటన్ మీటర్) టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ చెప్పిన ప్రకారం, ఇది లీటరుకు ఏకంగా 70 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.

టీవీఎస్ రేడియాన్: టీవీఎస్ రేడియాన్ (TVS Radeon) బైక్ రూ.59,880 ప్రారంభ ధరలో (ఎక్స్-షోరూమ్) దొరుకుతుంది. దీనిలో 109.7 సీసీ ఇంజిన్ ఉంటుంది. ఇది 8.08 బీహెచ్‌పి పవర్‌ను, 8.7 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ చెప్పిన ప్రకారం, ఇది లీటరుకు ఏకంగా 73.68 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.
టీవీఎస్ స్పోర్ట్: టీవీఎస్ స్పోర్ట్ (TVS Sport) బైక్ రూ.59,881 ప్రారంభ ధరలో (ఎక్స్-షోరూమ్) దొరుకుతుంది. దీనిలో 109.7 సీసీ ఎయిర్-కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 8.08 బీహెచ్‌పి పవర్‌ను, 8.7 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. టీవీఎస్ మోటార్ చెప్పిన ప్రకారం, ఇది లీటరుకు ఏకంగా 70 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.

హీరో HF డీలక్స్: హీరో HF డీలక్స్ (Hero HF Deluxe) బైక్ రూ.59,998 ప్రారంభ ధరలో (ఎక్స్-షోరూమ్) దొరుకుతుంది. దీనిలో 97.2 సీసీ ఎయిర్-కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 7.9 బీహెచ్‌పి పవర్‌ను, 8.05 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ చెప్పిన ప్రకారం, ఇది లీటరుకు ఏకంగా 70 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.
డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం: మీ బడ్జెట్‌కు సరిపోయే మంచి బైక్‌ను కనుగొనడం నిజంగా కష్టం. అందుకే రూ.60,000 కన్నా తక్కువ ధరలో బైక్ కొనాలనుకుంటే, మేము పైన చెప్పిన తక్కువ ధరలోని ఈ బైక్‌లు మీ అవసరాలకు సరిపోతాయి. ఇవి కేవలం ఎక్స్-షోరూమ్ ధరలు అని గుర్తుంచుకోండి. ఇవి మీ ప్రాంతం, డీలర్‌షిప్‌లను బట్టి ఆన్-రోడ్ ధరలు మారవచ్చు. అందుకే ఇక్కడ ఎక్స్-షోరూమ్ ధరలు మాత్రమే.


Click it and Unblock the Notifications








