బరువు తక్కువ, లైసెన్స్‌తో పనే లేదు.. లేడీస్ కోసం బెస్ట్ స్కూటర్లు ఇవే..ధర కూడా రూ.55వేల లోపే
ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో ఎలక్ట్రిక్ స్కూటర్లు అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న సెగ్మెంట్. ప్రస్తుతం మార్కెట్లో వివిధ ధరలలో సైజులలో అనేక మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. సురక్షితంగా , సులభంగా నడపడానికి వీలుగా ఉండే కాంపాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లకు మహిళా రైడర్‌ల మధ్య ప్రియారిటీ పెరుగుతోంది.
స్టైలిష్‌గా, బరువు తక్కువగా, సులభంగా హ్యాండిల్ చేయగలిగేలా, తక్కువ బడ్జెట్‌లో దొరికే ఈ స్కూటర్లు అర్బన్, సెమీ-అర్బన్ నగరాలలో రోజువారీ ప్రయాణాలకు బాగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా రిమూవబుల్ బ్యాటరీ, కీ-లెస్ ఎంట్రీ, ఆంటీ-థెఫ్ట్ లాక్ వంటి ఫీచర్లు ఉండడం వలన వీటిని ఉపయోగించడం చాలా సౌకర్యంగా ఉంటుంది.

జీలియో లిటిల్ గ్రేసీ
జీలియో లిటిల్ గ్రేసీ అతి తక్కువ ధరలో లభించే ఒక ప్రముఖ మోడల్. ఇది కేవలం 80 కిలోల బరువుతో ట్రాఫిక్‌లో మహిళలు సులభంగా నడపడానికి వీలుగా ఉంటుంది. ఈ స్కూటర్ 1.5 యూనిట్ల విద్యుత్‌తో 60 నుంచి 90 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. ఇందులో సెంటర్ లాక్ ఆంటీ-థెఫ్ట్ అలారం, యూఎస్‌బీ ఛార్జింగ్, లైసెన్స్ అవసరం లేని డ్రైవ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని ధర రూ.55,000 నుంచి రూ.60,000 వరకు ఉంటుంది.
ఒకినావా లైట్
ఇక ఒకినావా లైట్ విషయానికి వస్తే ఇది రోజువారీ సిటీ రైడ్‌ల కోసం రూపొందించబడినది. దీని 1.25 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ఒకే ఛార్జ్‌పై 60 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 25 కిలోమీటర్లు. కేవలం 740 mm సీటు ఎత్తు ఉండటం వలన మహిళలు దీనిని సులభంగా ఆపరేట్ చేయగలరు. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 69,093.

ఆంపియర్ మాగ్నస్ EX
ఆంపియర్ మాగ్నస్ EX అనేది ఆకర్షణీయమైన లుక్‌తో కూడిన బడ్జెట్-ఫ్రెండ్లీ సిటీ ఈవీ. దీని బరువు కేవలం 82 కిలోలు. దీని ఏఆర్‌ఏఐ క్లెయిమ్ చేసిన రేంజ్ 121 కిలోమీటర్లు, గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఇందులో లింప్ హోమ్ అనే ప్రత్యేక ఫీచర్ ఉంది, దీని ద్వారా బ్యాటరీ చాలా తక్కువగా ఉన్నప్పుడు కూడా కొద్ది దూరం ప్రయాణించవచ్చు. దీని ధర రూ.67,999 నుంచి రూ.94,900 వరకు ఉంది.
హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా CX 2.0
హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా CX 2.0 అనేది నమ్మకమైన, సౌకర్యవంతమైన కాంపాక్ట్ ఈవీ. దీని బరువు 72.5-83 కిలోలు. ఇది ఫుల్ ఛార్జ్‌పై దాదాపు 89 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. పోర్టబుల్ బ్యాటరీ ఉండటం వలన ఇంట్లో కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. దీని ధర రూ.85,000 నుంచి రూ.90,000 ప్రైస్ రేంజ్‌లో లభిస్తుంది.

కొమాకి SE
కొమాకి SE ఇకో అనేది రోజువారీ నగర ప్రయాణాల కోసం రూపొందించబడిన స్టైలిష్, పర్యావరణ అనుకూలమైన ఎలక్ట్రిక్ స్కూటర్. దీని బరువు కూడా కేవలం 82 కిలోగ్రాములు మాత్రమే. స్మార్ట్ డిజిటల్ డాష్‌బోర్డ్, మంచి బూట్ స్పేస్ దీనికి అదనపు ఆకర్షణ. 2 kW LiPo బ్యాటరీ ద్వారా శక్తిని పొందే ఈ స్కూటర్, ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్ల వరకు దూరం ప్రయాణిస్తుందని తయారీదారులు పేర్కొన్నారు.
ఆంటీ-థెఫ్ట్ లాక్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌లు, ఆంటీ-స్కిడ్ టైర్లు వంటి ఫీచర్లు సేఫ్టీని అందిస్తాయి. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.97,256. ఈ విధంగా ఈ 5 కాంపాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు బడ్జెట్‌కు అనుగుణంగా ఉండి, మహిళా రైడర్‌లకు బెస్ట్ ఆప్షన్గా నిలుస్తున్నాయి.


Click it and Unblock the Notifications