కాలేజ్ కు వెళ్లాలన్నా.. గర్ల్‌ఫ్రెండ్‌తో షికారుకెళ్లాలన్నా.. ఈ బైక్‌లు అదిరిపోతాయి.. ధర కూడా తక్కువే

యూత్ నిత్యం కాలేజీకి వెళ్లేటప్పుడు బైక్ మీద వెళ్తుంటే అందరూ తననే చూడాలని తహతహలాడుతుంటారు. అయితే ఏ మోటార్‌సైకిల్ కొంటే బాగుంటుంది? అది ఎక్కువ కాలం మన్నుతుందా? అనే అనేక సందేహాలు ఉంటాయి. మీరు రూ.2 లక్షల లోపు అత్యాధునిక డిజైన్, ఫీచర్లతో కూడిన సరికొత్త బైక్‌ను కొనాలని చూస్తున్నారా?

అయితే టీవీఎస్ రైడర్ 125, హీరో ఎక్స్‌ట్రీమ్ 125ఆర్, బజాజ్ పల్సర్ ఎన్160, హోండా ఎస్‌పి160, యమహా ఎఫ్‌జెడ్-ఎస్ ఫై హైబ్రిడ్ వంటి మోడల్స్ అద్భుతమైన ఫీచర్స్, ఎన్నో స్పెషాలిటీలతో లభిస్తాయి. విశేషం ఏంటంటే వాటి ధర కూడా రూ.2లక్షల్లోపే. ఆ బైక్స్ గురించి వివరంగా తెలుసుకుందాం.

TVS Raider

1. టీవీఎస్ రైడర్ 125 (TVS Raider 125): ఈ మోటార్‌సైకిల్ ధర రూ.85,010 నుంచి రూ.1.04 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. ఇది 124.8 సిసి సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 11.38 పిఎస్ హార్స్‌పవర్, 11.2 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఈ బైక్ 67 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది.

ఎల్ఈడి హెడ్‌లైట్, ఎల్ఈడి డిఆర్‌ఎల్‌లు, ఎల్ఈడి టెయిల్ లైట్, యూఎస్‌బి చార్జింగ్ పోర్ట్, ఎల్‌సిడి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇది ఎకో, స్పోర్ట్ రైడింగ్ మోడ్‌లను కలిగి ఉంది. సేఫ్టీ కోసం డిస్క్/డ్రమ్ బ్రేక్‌లు ఉన్నాయి. ఇది స్ట్రైకింగ్ రెడ్, బ్లేజింగ్ బ్లూ వంటి వివిధ రంగుల్లో లభిస్తుంది. దీని బరువు 123 కేజీలు, ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 10 లీటర్లు.

Hero Xtrame

2. హీరో ఎక్స్‌ట్రీమ్ 125ఆర్ (Hero Xtreme 125R): ఇది కూడా యువతలో బాగా ప్రాచుర్యం పొందిన బైక్. దీని ధర రూ.96,425 నుంచి రూ.1 లక్ష వరకు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. ఇది 124.7 సిసి పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 11.55 పిఎస్ హార్స్‌పవర్,10.5 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఈ బైక్ 66 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. ఇది స్పోర్టీ డిజైన్‌ను కలిగి ఉంది.

ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు, ఎల్ఈడి డిఆర్‌ఎల్‌లను పొందింది. ఎల్‌సిడి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది కోబాల్ట్ బ్లూ, ఫైర్‌స్టార్మ్ రెడ్, స్టాలియన్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది. సేఫ్టీ కోసం డిస్క్ బ్రేక్‌లు, సింగిల్ ఛానల్ ఎబిఎస్ ఉన్నాయి. దీని బరువు 136 కేజీలు, ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 10 లీటర్లు.

Bajaj

3. బజాజ్ పల్సర్ ఎన్160 (Bajaj Pulsar N160): ఈ బైక్ ధర రూ.1.23 లక్షల నుంచి రూ.1.37 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. ఇది 164.82 సిసి ఎయిర్-/ఆయిల్-కూల్డ్ సింగిల్-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 16 పిఎస్ హార్స్‌పవర్, 14.65 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఈ బైక్ 59.11 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది.

ఇందులో ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు, ఎల్ఈడి డిఆర్‌ఎల్‌లు, ఎల్‌సిడి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, యుఎస్‌బి చార్జింగ్ పోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది బ్రూక్లిన్ బ్లాక్, రేసింగ్ రెడ్, కెరిబియన్ బ్లూ రంగుల్లో లభిస్తుంది. సేఫ్టీ కోసం డ్యూయల్ ఛానల్ ఎబిఎస్, డబుల్ డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి.

Honda SP

4. హోండా ఎస్‌పి160 (Honda SP160): ఇది కూడా యువతను ఆకర్షించే బైక్. దీని ధర రూ.1.22 లక్షల నుంచి రూ.1.28 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. ఇది 162.71 సిసి సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 13 పిఎస్ హార్స్‌పవర్,14.8 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఈ బైక్ 50 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది.

4.2-ఇంచుల టిఎఫ్‌టి స్క్రీన్, బ్లూటూత్ కనెక్టివిటీ, యుఎస్‌బి-సి చార్జింగ్ పోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది పర్ల్ ఇగ్నియస్ బ్లాక్, పర్ల్ డీప్ గ్రౌండ్ గ్రే, అథ్లెటిక్ బ్లూ మెటాలిక్ రంగుల్లో లభిస్తుంది. సేఫ్టీ కోసం సింగిల్ ఛానల్ ఎబిఎస్, డబుల్ డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. దీని బరువు 138 కేజీలు, ఫ్యూయల్ ట్యాంక్ సామర్థ్యం 12 లీటర్లు. గ్రౌండ్ క్లియరెన్స్ 177 ఎంఎం.

Yamaha

5. యమహా ఎఫ్‌జెడ్-ఎస్ ఫై హైబ్రిడ్(Yamaha FZ-S Fi Hybrid): ఈ బైక్ ధర రూ.1.45లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది 149 సిసి పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఇది 60 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. 4.2-ఇంచుల ఫుల్-కలర్ టిఎఫ్‌టి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లూటూత్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ కోసం డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. ఫ్యూయల్ ట్యాంక్ సామర్థ్యం 13 లీటర్లు.

సో.. యూత్ గ్యాంగ్! మీ స్టైల్‌కు తగ్గట్టు, మీ బడ్జెట్‌కు సరిపోయే ప్రీమియం బైక్‌ల లిస్ట్ చూశారుగా? ఇక ఆలస్యం ఎందుకు? మీ ఫేవరెట్ బైక్‌ను సెలెక్ట్ చేసుకోండి.. రోడ్లపై దూసుకుపోండి.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Monday, April 7, 2025, 12:30 [IST]
English summary
Top 5 premium look bikes under 2 lakh loved by indian youth
Read more on: #india #auto news #bajaj
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+