మార్కెట్లో బెస్ట్ స్కూటర్ల లిస్ట్ ఇదే.. కొంటే ఇవి తప్ప వేరేవి అస్సలు ముట్టుకోకండి!
భారతదేశంలో టూ-వీలర్ మార్కెట్ ఎప్పుడూ హడావుడిగా ఉంటుంది. అందులోనూ స్కూటర్ల హవా కొనసాగుతోంది. సిటీ రోడ్లపై దూసుకుపోవాలన్నా, కాలేజీకి హడావిడిగా వెళ్లాలన్నా, ఇంటి పనుల కోసం ఉపయోగించాలన్నా స్కూటర్ ఒక మంచి ఆఫ్షన్. మీ బడ్జెట్ ఒక లక్ష రూపాయల లోపు ఉండి, స్టైలిష్ లుక్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు, మతిపోగొట్టే మైలేజ్ అందించే స్కూటర్ కోసం చూస్తున్నారా?
అయితే టెన్షన్ వదిలేయండి! మీ కోసం హోండా యాక్టివా నుండి సుజుకి యాక్సెస్ వరకు, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచిన 5 అద్భుతమైన స్కూటర్ల సమాచారాన్ని ఈ కథనంలో తీసుకొచ్చాం. ఇవి కేవలం వాహనాలు మాత్రమే కాదు. మీ రోజువారీ జీవితంలో ఒక ముఖ్యమైన భాగం కానున్నాయి.

Honda Activa 6G: హోండా యాక్టివా 6G భారతీయ మార్కెట్లో అత్యంత విశ్వసనీయమైన, అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్‌గా పేరుగాంచింది. దీని ఆన్-రోడ్ ధర రూ.92,181 నుండి రూ.98,731 మధ్య ఉంటుంది. ఈ స్కూటర్‌లో 109.51cc ఇంజన్ అమర్చబడి ఉంది.
ఇది లీటరుకు 59.5 కిలోమీటర్ల మైలేజ్‌ను అందిస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 85 కిమీ. హోండా యాక్టివా బిల్డ్ క్వాలిటీ. తక్కువ మెయింటెన్స్ కారణంగా ఇదో బెస్ట్ ఫ్యామిలీ స్కూటర్ గా పేర్గాంచింది. మన దేశంలో ప్రతి వీధిలో ఈ స్కూటర్ కనిపిస్తుంది.

TVS Jupiter 110: టీవీఎస్ జూపిటర్ తన బలమైన పట్టు, స్మూత్ రైడ్, అద్భుతమైన గ్రౌండ్ క్లియరెన్స్ కోసం ప్రసిద్ధి చెందింది. ఇది రోజువారీ ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. దీని ఆన్-రోడ్ ధర రూ.88,561 నుండి రూ.1.06 లక్షల మధ్య ఉంటుంది. ఇది లీటరుకు 48 కిమీ మైలేజ్‌ను అందిస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 82 కిమీ.
Suzuki Access 125: సుజుకి యాక్సెస్ 125 కాస్త ఎక్కువ పవర్, ఆకర్షణీయమైన డిజైన్, మంచి పర్ఫామెన్స్ కోరుకునే వినియోగదారులకు సరైన ఎంపిక. దీని ఆన్-రోడ్ ధర సుమారు రూ.1 లక్ష నుండి ప్రారంభమవుతుంది. ఈ స్కూటర్‌లో 124cc ఇంజన్ అమర్చబడి ఉంది. ఇది 8.42 PS పవర్ అందిస్తుంది. ఇది లీటరుకు 45 కిమీ మైలేజ్‌ను అందిస్తుంది.

TVS Jupiter 125: టీవీఎస్ జూపిటర్ 125 ప్రత్యేకంగా ఎక్కువ స్థలం, సౌకర్యవంతమైన రైడ్, మంచి ఫ్యూయెల్ కెపాసిటీ అవసరమైన కుటుంబాల కోసం రూపొందించబడింది. దీని ఆన్-రోడ్ ధర రూ.93,891 నుండి ప్రారంభమవుతుంది. ఈ స్కూటర్‌లో 124.8cc ఇంజన్ అమర్చబడి ఉంది, ఇది లీటరుకు 57.27 కిమీ మైలేజ్, గంటకు 95 కిమీ గరిష్ట వేగాన్ని అందిస్తుంది.
Yamaha Fascino 125 Fi Hybrid: యమహా ఫాసినో 125 Fi హైబ్రిడ్ ముఖ్యంగా యువతను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడింది. దీని ఆన్-రోడ్ ధర రూ.99,969 నుండి ప్రారంభమవుతుంది. హైబ్రిడ్ టెక్నాలజీతో కూడిన స్టైలిష్ డిజైన్, అద్భుతమైన మైలేజ్ దీన్ని ఒక స్మార్ట్ ఎంపికగా చేస్తాయి. ఈ స్కూటర్‌లో 125cc ఇంజన్ అమర్చబడి ఉంది.ఇది లీటరుకు 68.75 కిమీ మైలేజ్‌ను అందిస్తుంది. దీని గరిష్ట వేగం 90 కిమీ/గం.

ఈ ఐదు స్కూటర్లు కూడా ఒక లక్ష రూపాయల బడ్జెట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఫీచర్లు, మైలేజ్, విశ్వసనీయత పరంగా ఉత్తమమైన ఎంపికలను అందిస్తున్నాయి. మీ అవసరాలు, ప్రాధాన్యతలను బట్టి మీరు వీటిలో ఏదైనా ఎంచుకోవచ్చు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








