స్టైల్‎గా కాలేజీకి వెళ్లాలని అనుకుంటున్నారా.. బెస్ట్ పర్ఫామెన్స్, మంచి బడ్జెట్లో బెస్ట్ బైక్స్ ఇవే !

మీరు కాలేజీ మెట్లు ఎక్కబోతున్నారా? కొత్త బైక్ కొనే ఆలోచనలో ఉన్నారా? అయితే ఏ బైక్ కొనాలి, అది స్టైలిష్‌గా ఉండాలి బడ్జెట్లో ఉండాలని ఆలోచిస్తున్నారా ? కొత్తగా బైక్ నడపడం నేర్చుకున్న వారికి లేదా కాలేజీకి వెళ్లే విద్యార్థులకు సరైన బైక్‌ను ఎంచుకోవడం పెద్ద టాస్క్.

అలాంటి వారికి టీవీఎస్ రోనిన్, రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350, బజాజ్ పల్సర్ ఎన్160 వంటి బైక్‌లు అద్భుతమైన ఆప్షన్లు కాగలవు. ఈ బైక్‌ల ధరలు, ఫీచర్లు, మైలేజ్ వివరాలు తెలుసుకుందాం.

కాలేజీలోకి అడుగుపెట్టే యువతకు కొత్త బైక్ కొనుగోలు చేయాలనే కోరిక బలంగా ఉంటుంది. అయితే, మార్కెట్లో ఎన్నో బైక్‌లు ఉండటంతో ఏది కొనాలి, ఏది ప్రీమియంగా ఉంటుంది అనే గందరగోళం ఉంటుంది. మీరు కొత్తగా బైక్ నడపడం నేర్చుకున్న వారైతే, లేదా కాలేజీకి వెళ్లే యువకులైతే, ఈ కింద చెప్పబడిన బైక్‌లు మీకు అద్భుతమైన ఎంపికలు కాగలవు. ఇవి స్టైల్, పనితీరు, సరసమైన ధరలను అందిస్తాయి.

Ronin

1. టీవీఎస్ రోనిన్(TVS Ronin): టీవీఎస్ రోనిన్ యువతలో బాగా పాపులర్ అయిన బైక్. ఇది ఆధునిక డిజైన్‌తో పాటు పవర్‎ఫుల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. దీని ధర రూ. 1.36 లక్షల నుంచి రూ.1.73లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. దీనికి రౌండెడ్ LED హెడ్‌ల్యాంప్, 'T' ఆకారంలో ఉండే LED DRLలు (డేటైమ్ రన్నింగ్ లైట్స్), LED టర్న్ ఇండికేటర్‌లు ఉన్నాయి. ఇది చాలా స్టైలిష్‌గా కనిపిస్తుంది.

నూతన టీవీఎస్ రోనిన్ మోటార్‌సైకిల్‌ 225.9 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్-కూల్డ్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. లీటరుకు 42 కి.మీ.ల వరకు మైలేజ్ ఇస్తుంది. సింగిల్-పాడ్ ఎల్‌సీడీ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ వంటి లేటెస్ట్ ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ కోసం డబుల్ డిస్క్ బ్రేక్‌లను కలిగి ఉంది. ఇది మంచి బ్రేకింగ్ పర్ఫామెన్స్ అందిస్తుంది.

Royal Enfield

2. రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 (Royal Enfield Bullet 350): రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 ఎప్పుడూ యువకులకు ఒక ప్రత్యేక ఆకర్షణ. దాని క్లాసిక్ లుక్, పవర్ఫుల్ ఇంజిన్ దీనిని ఒక ఐకానిక్ బైక్‌గా నిలబెట్టాయి. ఇది రూ. 1.75 లక్షల నుంచి రూ. 2.18 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ధరలో లభిస్తుంది.

క్లాసిక్ డిజైన్‌తో పాటు మిలిటరీ బ్లాక్, మిలిటరీ రెడ్, మరూన్, స్టాండర్డ్ బ్లాక్, బెటాలియన్ బ్లాక్ వంటి ఆకర్షణీయమైన రంగుల్లోనూ ఇది అందుబాటులో ఉంది.

ఈ మోటార్‌సైకిల్‌ 349 సీసీ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. లీటరుకు 37 కి.మీ.ల వరకు మైలేజ్ ఇస్తుంది. సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. సేఫ్టీ కోసం డిస్క్/డ్రమ్ బ్రేక్ కాంబినేషన్‌తో వస్తుంది.

3. బజాజ్ పల్సర్ ఎన్160(Bajaj Pulsar N160): బజాజ్ పల్సర్ సిరీస్ ఎప్పటినుంచో యువతకు బాగా ఇష్టమైనది. పల్సర్ ఎన్160పవర్‎ఫుల్ పనితీరును, స్టైలిష్ రూపాన్ని తక్కువ ధరలో అందిస్తుంది. ఇది రూ. 1.22 లక్షల నుంచి రూ.1.34లక్షల వరకు(ఎక్స్-షోరూమ్) ధరను కలిగి ఉంది. LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, LED DRLలను కలిగి ఉంది. రేసింగ్ రెడ్, కరేబియన్ బ్లూ, బ్రూక్లిన్ బ్లాక్, పెర్ల్ మెటాలిక్ వైట్ వంటి రంగుల్లోనూ లభిస్తుంది.

నూతన పల్సర్ ఎన్160 మోటార్‌సైకిల్‌ 164.82 సీసీ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. 5-స్పీడ్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంది. లీటరుకు 59 కి.మీ.ల వరకు అద్భుతమైన మైలేజ్ ఇస్తుంది. ఎల్‌సీడీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి. భద్రత దృష్ట్యా డబుల్ డిస్క్ బ్రేక్‌లను కలిగి ఉంది. ఇది మెరుగైన భద్రతను అందిస్తుంది.

More from DriveSpark

Article Published On: Thursday, May 22, 2025, 11:15 [IST]
English summary
Top bike picks for college students tvs ronin bullet 350 pulsar n160
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+