తక్కువ బడ్జెట్లో ఎక్కువ మైలేజ్.. ప్రతి రోజూ ఆఫీసుకు వెళ్లేందుకు పర్ఫెక్ట్ బైక్స్ ఇవే !
ప్రతి రోజూ ఆఫీసుకు వెళ్లేందుకు, అలాగే ఇతరత్రా ప్రయాణాల కోసం బైక్ కొనాలనుకుంటున్నారా? తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్ కోసం చూస్తున్నారా? అయితే మీకోసం కొన్ని బెస్ట్ ఆఫ్షన్లు ఇక్కడ ఉన్నాయి. హోండా లివో, హీరో గ్లామర్, టీవీఎస్ రేడియన్, హోండా సిడి 110 డ్రీమ్, బజాజ్ సిటి 110 ఎక్స్ - ఈ బైక్స్ మీ రోజువారీ అవసరాలకు సరిగ్గా సరిపోతాయి. వాటి ధర, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
ప్రతి ఒక్కరికీ రోజువారీ ఉపయోగం కోసం ప్రస్తుతం బైక్స్ చాలా అవసరం. ముఖ్యంగా ఉద్యోగాలకు వెళ్లేవారికి బైక్సు తప్పనిసరి. అయితే, చాలా మందికి ఏ మోటార్‌సైకిల్ కొంటే మంచిది.. అది ఎక్కువ కాలం మన్నికగా ఉంటుందన్న అనేక సందేహాలు ఉంటాయి. మీరు కొత్త బైక్ కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే, హోండా లివో, హీరో గ్లామర్, టీవీఎస్ రేడియన్, హోండా సిడి 110 డ్రీమ్, బజాజ్ సిటి 110 ఎక్స్ మోడల్‌లు మీకు బాగా సరిపోతాయి.

1.హోండా లివో (Honda Livo): ఈ మోటార్‌సైకిల్ చాలా తక్కువ ధరలో అందుబాటులో ఉంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.82,951 నుండి రూ.86,951 వరకు ఉంటుంది. మధ్యతరగతి ప్రజలు కూడా దీనిని సులభంగా కొనుగోలు చేయవచ్చు. కొత్త బైక్ పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్, పెర్ల్ సైరన్ బ్లూతో సహా వివిధ రంగుల్లో లభిస్తుంది.
కొత్త హోండా లివో బైక్ 109.51 సిసి ఒబిడి-2బి ఎయిర్-కూల్డ్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 7,500 ఆర్‌పిఎమ్ వద్ద 8.68 పిఎస్ హార్స్‌పవర్‌ను, 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 9.30 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 4-స్పీడ్ గేర్‌బాక్స్ ఆఫ్షన్ కలిగి ఉంది. లీటరుకు 70 కిలోమీటర్ల వరకు మైలేజ్‌ను ఇస్తుంది.
ఈ మోటార్‌సైకిల్‌లో ఎల్‌సిడి ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, ఇంజిన్ స్టార్ట్/స్టాప్ స్విచ్, సైడ్-స్టాండ్ ఇంజిన్ కట్-ఆఫ్‌తో సహా అనేక ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ కోసం ముందు టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక డ్యూయల్-స్ప్రింగ్ షాక్ అబ్జార్బర్ సస్పెన్షన్ సెటప్‌ను కలిగి ఉంది. డ్రమ్ బ్రేక్‌లు కూడా ఉన్నాయి.

2.హీరో గ్లామర్ (Hero Glamour): ఇది కూడా ఒక పాపులర్ బైక్. దీని ధర రూ.83,765 నుండి రూ.89,079 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఇది డ్రమ్ బ్రేక్, డిస్క్ బ్రేక్ అనే రెండు వేరియంట్‌లలో లభిస్తుంది. ఇది క్యాండీ బ్లేజింగ్ రెడ్, టెక్నో బ్లూ-బ్లాక్, స్పోర్ట్స్ రెడ్-బ్లాక్ రంగుల్లో అందుబాటులో ఉంది.
ఈ కొత్త మోటార్‌సైకిల్ 124.7 సిసి సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 10.72 బిహెచ్‌పి హార్స్‌పవర్‌ను,10.6 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. లీటరుకు 55 కిలోమీటర్ల వరకు మైలేజ్‌ను ఇస్తుంది.
కొత్త హీరో గ్లామర్ బైక్‌లో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంటేషన్ స్క్రీన్, స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ పోర్ట్, ఐడిల్ స్టార్ట్-స్టాప్ సిస్టమ్‌తో సహా అనేక ఫీచర్లు ఉన్నాయి. ముందు టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్, వెనుక ట్విన్ షాక్ అబ్జార్బర్ సస్పెన్షన్ సెటప్‌ను కలిగి ఉంది. సేఫ్టీ కోసం డిస్క్/డ్రమ్ బ్రేక్‌లు ఉన్నాయి.

3.టీవీఎస్ రేడియన్ (TVS Radeon): ఈ బైక్ చాలా తక్కువ ధరలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. దీని ధర రూ.75,274 నుండి రూ.84,518 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఇది ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తుంది. అవి స్టార్‌లైట్ బ్లూ, మెటల్ బ్లాక్, టైటానియం గ్రే.
కొత్త రేడియన్ మోటార్‌సైకిల్ 109.7 సిసి సింగిల్-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 8.08 పిఎస్ హార్స్‌పవర్‌ను, 8.7 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. లీటరుకు 73.68 కిలోమీటర్ల వరకు మైలేజ్‌ను ఇస్తుంది. ఇందులో ఎల్‌సిడి ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌తో సహా అనేక ఫీచర్లు ఉన్నాయి.

4.హోండా సిడి 110 డ్రీమ్ (Honda CD 110 Dream): ఇది ఒక చౌకైన బైక్. దీని ధర రూ. 76,401 (ఎక్స్-షోరూమ్). ఇది బ్లాక్ విత్ బ్లూ, బ్లాక్ విత్ రెడ్, బ్లాక్ విత్ గ్రీన్, బ్లాక్ విత్ గ్రే కలర్ ఆఫ్షన్లలో లభిస్తుంది.
ఈ మోటార్‌సైకిల్ 109.51 సిసి ఎయిర్-కూల్డ్, ఫ్యూయెల్-ఇంజెక్టెడ్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 7500 ఆర్‌పిఎమ్ వద్ద 8.7 పిఎస్ హార్స్‌పవర్‌ను, 5500 ఆర్‌పిఎమ్ వద్ద 9.30 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 4-స్పీడ్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంది. లీటరుకు 65 కిలోమీటర్ల వరకు మైలేజ్‌ను ఇస్తుంది.
కొత్త హోండా సిడి 110 డ్రీమ్ బైక్‌లో అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ సెటప్, స్టార్ట్/స్టాప్ స్విచ్, సైడ్-స్టాండ్ ఇంజిన్ కట్-ఆఫ్‌తో సహా అనేక ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ కోసం డ్రమ్ బ్రేక్‌లు ఉన్నాయి. ఈ బైక్ సుమారు 112 కేజీల బరువు ఉంటుంది. 9.1 లీటర్ల కెపాసిటీ గల ఫ్యూయల్ ట్యాంక్‌ను కలిగి ఉంది.

5.బజాజ్ సిటి 110 ఎక్స్ (Bajaj CT 110X): ఈ బైక్ ధర రూ.70,381 (ఎక్స్-షోరూమ్). ఇది చాలా ఆకర్షణీయమైన డిజైన్‌ను కలిగి ఉంది మరియు మ్యాట్ వైల్డ్ గ్రీన్, ఎబొనీ బ్లాక్-రెడ్, ఎబొనీ బ్లాక్-బ్లూ కలర్ ఆఫ్షన్లలో లభిస్తుంది.
కొత్త బజాజ్ సిటి 110 ఎక్స్ మోటార్‌సైకిల్ 115.45 సిసి ఎయిర్-కూల్డ్ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 7000 ఆర్‌పిఎమ్ వద్ద 8.6 పిఎస్ హార్స్‌పవర్‌ను, 5000 ఆర్‌పిఎమ్ వద్ద 9.81 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 4-స్పీడ్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంది. లీటరుకు 70 కిలోమీటర్ల వరకు మైలేజ్‌ను ఇస్తుంది.
ఈ బైక్ 90 కెఎంపిహెచ్ టాప్ స్పీడ్‌ను కలిగి ఉంది. ట్విన్ పాడ్ అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, క్రాష్ గార్డ్, గైటర్డ్ ఫోర్క్, మెటల్ బెల్లీ పాన్, హెడ్‌లైట్ గార్డ్, రబ్బర్ ట్యాంక్ ప్యాడ్‌లతో సహా అనేక ఫీచర్లను కలిగి ఉంది. ముందు టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక ట్విన్ షాక్ అబ్జార్బర్ సెటప్‌ను కలిగి ఉంది. సేఫ్టీ కోసం డ్రమ్ బ్రేక్‌లు ఉన్నాయి.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








