ఓలా, ఉబెర్, రాపిడో డ్రైవర్లకు బాగా సరిపోయే టాప్ బెస్ట్ బైక్స్.. వీటితో మీ ఆదాయం డబుల్!
ప్రస్తుతం మన దేశంలో యువతలో చాలా మంది ఓలా బైక్, ఉబెర్, రాపిడో వంటి రైడ్-షేరింగ్ ప్లాట్‌ఫామ్‌లలో చేరుతున్నారు. చదువుతో పాటు అదనంగా సంపాదించాలనుకునే వారు, ఉద్యోగం వెతుకుతూ ఉన్న వారు లేదా పార్ట్‌టైమ్‌గా ఆర్థిక లాభం పొందాలనుకునే వారు ఈ అవకాశాన్ని గట్టిగా పట్టుకుంటున్నారు. నిజానికి, ఈ రంగం ఇప్పుడు ఫాస్ట్ మనీ, ఫ్లెక్సిబుల్ అవర్స్ కోసం చూస్తున్న వారికి ఒక కొత్త మార్గాన్ని చూపుతోంది. అయితే, ఈ పనిని ప్రారంభించే ముందు ప్రతి ఒక్కరూ ఒక ముఖ్యమైన ప్రశ్నను ఆలోచించాలి.. ఏ బైక్‌ను ఎంచుకోవాలి? ఎందుకంటే ఇక్కడ ఉపయోగించే బైక్ కేవలం ఒక వాహనం మాత్రమే కాదు, అది మీకు రోజువారీ ఆదాయం తెచ్చిపెట్టేది. కాబట్టి, బైక్ మైలేజ్ బాగుండాలి, మెయింటెనెన్స్ తక్కువగా ఉండాలి, అలాగే పట్టణ ట్రాఫిక్‌లో ఈజీగా నడపగలిగేలా ఉండాలి.
ఎక్కువసేపు రైడ్‌లు చేసే సమయంలో డ్రైవర్‌కు సౌకర్యంగా ఉండటం మాత్రమే కాదు, వెనుక కూర్చున్న ప్రయాణికుడికి కూడా కంఫర్ట్‌గా ఉండే బైక్ కావాలి. లైట్ వెయిట్‌తో పాటు స్మూత్ గేర్ షిఫ్టింగ్, మంచి బ్రేకింగ్ సిస్టమ్ ఉంటే అది ఎప్పటికీ ప్రయాణికుడి అనుభవాన్ని మెరుగుపరుస్తుంది. అలాంటి వాటిలో కొన్ని మోడళ్లు టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్, హీరో స్ప్లెండర్ ప్లస్, హోండా షైన్ 125 గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

Tvs Star City Plus: ఓలా, ఉబెర్, రాపిడో వంటి ప్లాట్‌ఫామ్‌ల కోసం చూస్తున్న వారికి టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ నిజంగా ఒక పర్ఫెక్ట్ ఆప్షన్. ఎందుకంటే ఈ బైక్ మైలేజ్ పరంగా కూడా అద్భుతమైనది, అలాగే పట్టణ ట్రాఫిక్‌లో నడిపేందుకు సూపర్ ఈజీ. ముందుగా మైలేజ్ గురించి చెప్పాలంటే, ఈ బైక్ ఒక లీటర్ పెట్రోల్‌తో 70 కి.మీ నుంచి 85 కి.మీ వరకు వెళ్తుంది.
అంటే రోజూ ఎక్కువ రైడ్‌లు చేసే వారికి ఇది ఒక పెద్ద వరం. ఫ్యూయల్ ఖర్చులు సేవ్ చేయడానికి ఇది బెస్ట్. ఈ బైక్ మార్కెట్‌లో రెండు వేరియంట్లలో డ్యూయల్ టోన్ డ్రమ్ వేరియంట్ ధర రూ.75,286, డ్యూయల్ టోన్ డిస్క్ వేరియంట్ ధర రూ.79,282 (ఎక్స్-షోరూమ్ ధరలు)లలో కొనుగోలు చేయడానికి లభిస్తుంది. ఇందులో 109.7cc ఇంజిన్ అమర్చబడింది. వెనుక సీటు ప్రయాణికుడికి కూడా కంఫర్ట్ ఇచ్చే డిజైన్ ఉంది.

Hero Splendor Plus: హీరో స్ప్లెండర్ ప్లస్ భారతదేశంలో మైలేజ్ బైక్‌లలో ఒక లెజెండరీ మోడల్. చాలా కాలంగా మార్కెట్లో ఉంటూ, బెస్ట్ సెల్లింగ్ బైక్‌గా నిలుస్తూ, రైడ్‌షేరింగ్ ప్లాట్‌ఫామ్‌లకు పర్ఫెక్ట్ ఛాయిస్ అవుతోంది. మైలేజ్ గురించి మాట్లాడుకుంటే, స్ప్లెండర్ ప్లస్ 65 కి.మీ నుంచి 80 కి.మీ వరకు ఇస్తుంది. అంటే రోజూ ఓలా, ఉబెర్ లేదా రాపిడోలో ఎక్కువ రైడ్‌లు చేసే వారికి ఇది అత్యంత ఉపయోగకరం.
తక్కువ ఇంధన ఖర్చుతో ఎక్కువ సంపాదన సాధ్యం అవుతుంది. దీని ప్రారంభ ధర వచ్చేసి రూ.79 వేల నుంచి ఉంటుంది. ఆన్‌రోడ్ ధర వచ్చేసరికి మరింత ఎక్కువ ఉంటుంది. ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో 97.2cc సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్ అమర్చబడింది. ఇది 8.02 bhp పవర్, 8.05 Nm టార్క్ అందిస్తుంది. నగర ట్రాఫిక్‌లోనూ, హైవేలోనూ ఈ ఇంజిన్ స్మూత్‌గా పనిచేస్తుంది.

Honda Shine 125: హోండా షైన్ 125 మోస్ట్ ట్రస్టెడ్ కమ్యూటర్ బైక్‌లలో ఒకటి. 125cc సెక్టార్‌లో బెస్ట్ సేలింగ్ బైక్‌గా చాలా కాలంగా కొనసాగుతోంది. రైడ్‌షేరింగ్ పనికి ఇది పర్ఫెక్ట్ ఆప్షన్. ముందుగా మైలేజ్ విషయానికి వస్తే, Honda Shine 125 సాధారణంగా 55 kmpl ఇంధన సామర్థ్యం ఇస్తుంది. రోజూ ఎక్కువ దూరాలు వెళ్లే వారికి, ఫ్యూయల్ ఖర్చులను తగ్గించుకోవాలనుకునే వారికి ఇది పెద్ద ప్లస్ పాయింట్.
మార్కెట్లో దీని ప్రారంభ ధర వచ్చేసి రూ.86 వేల నుంచి మొదలవుతుంది. ఆన్‌రోడ్ ధర లక్షకు పైనే ఉంటుంది. కొత్తగా ఓలా, ఉబెర్, రాపిడోలో జాయిన్ అవ్వాలనుకునే వారికి ఇది సరైన బైక్. ఇది సూపర్ కంఫర్టబుల్ సీటింగ్.. డ్రైవర్, వెనుక ప్రయాణికుడు ఇద్దరికీ సౌకర్యంగా ఉంటుంది. తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులు, కంపెనీ నెట్‌వర్క్ సర్వీస్ అంతటా ఉండటం కారణంగా ఇది రైడ్ షేరింగ్‌కు బెస్ట్.


Click it and Unblock the Notifications








