బెస్ట్ మైలేజీ ఇచ్చే బైక్స్ ఇవే.. ఒక్కసారి ఫుల్ ట్యాంక్ చేస్తే చాలు నెలంతా తిరిగొచ్చు
ఇండియాలో ఒకప్పుడు ఇంటికో సైకిల్ ఉండేది. ప్రస్తుతం ఇంటికో బైక్ అనివార్యం అయింది. కార్లున్నా కచ్చితంగా బైక్ ఉండాల్సిందే. అయితే కొత్త బైక్ కొనుగోలు చేసే ముందు మనలో చాలా మంది ఆలోచించే ప్రధాన అంశం మైలేజ్.. తక్కువ ధరలో ఎక్కువ మైలేజీ అందించే బైక్స్ కోసం చూస్తుంటారు.
మీరు కూడా ఇలాంటి బైక్ కొనుగోలు చేయాలని చూస్తున్నారా.. అయితే మరి రూ. 70 వేల నుంచి రూ. 80 వేల బడ్జెట్ లో అందుబాటులో ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్స్ పై ఓ లుక్కేయండి. మనదేశంలో అధిక మైలేజీని అందించే బైక్‌లకు చాలా డిమాండ్ ఉంది. ఇవి పేద, మధ్యతరగతి ప్రజలకు చాలా ముఖ్యం. రాపిడో, స్విగ్గీ, జొమాటోలలో పనిచేసే వారికి బెస్ట్ మైలేజీ బైక్స్ ప్రధాన ఆధారం.

ప్రస్తుతం ఇండియాలో హీరో, టీవీఎస్, బజాజ్, హోండా వంటి కంపెనీలు తక్కువ ధరలకు అధిక మైలేజ్, మంచి ఫీచర్స్ అందించే బైక్స్ అందిస్తున్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టాప్ 5 అత్యధిక మైలేజ్ ఇచ్చే బైక్స్ గురించి తెలుసుకుందాం.
Honda CD 110 Dream : ఈ బైక్ ప్రస్తుతం ఒకే వేరియంట్‌ను కలిగి ఉంది. నాలుగు రంగులలో అందుబాటులో ఉంది. ఇందులో 109.51 సిసి బిఎస్-6 ఇంజిన్ ఉంటుంది. ఇది 9.1 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ కలిగి ఉంది. లీటరుకు 65 కి.మీ మైలేజీని ఇస్తుంది. దీని ధర రూ. దీని ఎక్స్-షోరూమ్ ధర 76,401 రూపాయలు.

TVS Sport : ఈ బైక్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. సెల్ఫ్ స్టార్ట్ ఈఎస్, సెల్ఫ్ స్టార్ట్ ఈఎల్ఎస్ ధరలు వరుసగా రూ. 59,881, రూ. 71,223 (ఎక్స్-షోరూమ్). మూడు డ్యూయల్ టోన్ కలర్స్ కలిగి ఉంటుంది. ఇది BS6 కంప్లైంట్ 109.7సీసీ సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఇది 10-లీటర్ ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ కలిగి ఉంటుంది. లీటరుకు 70 కి.మీ మైలేజీని అందిస్తుంది.
Bajaj CT 110X: ఈ బైక్ ఒకే ఒక వేరియంట్‌లో విక్రయానికి ఉంది. దీని ధర రూ. 69,216 (ఎక్స్-షోరూమ్). మూడు రంగుల్లో కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఇది ఎలక్ట్రానిక్ కార్బ్యురేటర్‌తో కూడిన 115.45సీసీ ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 11-లీటర్ ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ కలిగి ఉంది. లీటరుకు 70 కి.మీ మైలేజీని అందిస్తుంది.

Hero Splendor Plus: భారతదేశంలో హీరో స్ప్లెండర్ ప్లస్ ధర రూ. 77,176 నుంచి ప్రారంభమై రూ.79,926వరకు ఉంటుంది. హీరో స్ప్లెండర్ ప్లస్ 4 వేరియంట్లలో కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఇది 97.2 సిసి, ఎయిర్-కూల్డ్, 4-స్ట్రోక్, సింగిల్-సిలిండర్, ఓహెచ్సీ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 9.8 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీని కలిగి ఉంటుంది. లీటరుకు 70 కి.మీ మైలేజీని అందిస్తుంది.
TVS Radeon: టీవీఎస్ రేడియన్ బైక్ బేస్ ఎడిషన్, డిజి డ్రమ్, డిజి డిస్క్ అనే మూడు వేరియంట్లలో అమ్మకానికి ఉంది. బేస్ ఎడిషన్ బైక్ ధర రూ. 59,880. డిజి డ్రమ్ వేరియంట్ ధర రూ. 77,394 కాగా, డిజి డిస్క్ మోడల్ ధర రూ. 81,394 ( ఎక్స్-షోరూమ్).

టీవీఎస్ రేడియన్ బైక్‌లో 109.7 సిసి సింగిల్ సిలిండర్ ఇంజన్ ఉంది. ఇది 10 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీని కలిగి ఉంటుంది. లీటరుకు 73 కి.మీ మైలేజీని అందిస్తుంది. 110cc కమ్యూటర్ విభాగంలో ఈ అన్ని బైక్‌ల తర్వాత, హోండా షైన్ 100, బజాజ్ ప్లాటినా 110 కూడా మంచి మైలేజీని అందించే చౌక బైక్స్.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








