బైక్ కలిగి ఉన్నవారు తప్పనిసరిగా తెలుసుకోవాలి! వర్షాకాలంలో బైక్‌ను సూపర్ ఫిట్‌గా ఉంచే టిప్స్!

దేశంలో వర్షాకాలం వచ్చేసింది. రుతుపవనాల ప్రభావంతో క్రమంగా వర్షాలు పుంజుకునే అవకాశం ఉంది. ఈ కాలంలో వాహనాలపై ప్రయాణం చేయడం, వాటిని జాగ్రత్తగా కాపాడుకోవడం ఎంతో సవాలుతో కూడుకున్న అంశం. ముఖ్యంగా బైకులు కలిగిన ఉన్న వారికి చాలా సవాళ్లు ఉంటాయి. తడిచే భాగాలు, బ్రేక్స్ ఇవన్నీ జాగ్రత్తగా గమనించకపోతే పెద్ద సమస్యలు అవుతాయి. అందుకే వర్షాకాలంలో బైక్‌ని కాపాడుకోవడం, మెయింటెన్ చేయడం చాలా ముఖ్యం. ఉద్యోగాలు చేసేవారు, కాలేజ్‌లకు వెళ్లేవారు, ఇంటి అవసరాల కోసం ఇప్పుడు బైకులు లేనిదే ఏ పని పూర్తి చేయలేము. ఇవి మన నిత్య జీవితంలో ఎంతో ముఖ్యమైన భాగం అయ్యాయి. ఈ నేపథ్యంలో బైకులు కలిగి ఉన్న యజమానులు తప్పనిసరిగా ఈ వర్షాకాలంలో కొన్ని కీలకమైన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వాటిని మరింత ఎక్కువ కాలం కాపాడుకోవచ్చు. అవెంటో ఈ కింది కథనంలో తెలుసుకుందాం.

షెడ్డులో పార్క్ చేయడం: వర్షాకాలంలో బైక్‌ను వీలైనంత వరకు బయట రోడ్డుపై లేదంటే ఎలాంటి షెడ్డు లేని ప్రాంతంలో నిలపవద్దు. వర్షం పడిన నీరు కారణంగా కొన్ని భాగాల్లో తుప్పు పట్టడం వంటి సమస్యలు మొదలవుతాయి. బైక్‌ని ఎక్కడైనా బయట పార్క్ చేస్తే, చైన్, బాడీ ప్యానెల్స్, నట్-బోల్టులు తడి అవుతాయి. ఆ తడి తక్కువ సమయంలోనే తుప్పుగా మారుతుంది. అందుకే బైక్‌‌ను గ్యారేజ్/ షెడ్డు/ ఇంట్లో ఉంచడం ఉత్తమం.

Monsoon Bike Care Tips

పార్కింగ్ కవర్ వాడటం: వర్షాకాలంలో బైక్‌కి మంచి పార్కింగ్ ఒక ప్రధాన అంశం. సాధారణంగా చాలా మంది బైక్‌ను ఇంటి ముందు లేదా ఓపెన్‌లోనే ఉంచుతారు. కానీ వర్షంలో ఈ అలవాటు మీ వాహనానికి కొత్త సమస్యలు తెస్తుంది. పార్కింగ్ సదుపాయం లేని వారు, ఇంటి ముందు ఖాళీ ప్రదేశంలో బైకును నిలుపుతున్న వారు తప్పనిసరిగా మార్కెట్లో లభించే మంచి క్వాలిటీ గల కవర్ ఉపయోగించడం చాలా మంచిది.

టైర్లను చెక్ చేయడం: వర్షాకాలంలో బైక్ సేఫ్టీకి సంబంధించి మీరు అత్యంత ముఖ్యంగా పరిగణించవలసిన అంశం టైర్ కండిషన్. చల్లటి వాతావరణం, రోడ్లపై నీరు నిలిచిపోవడం వల్ల టైర్ల గ్రీప్ బలంగా ఉండటం ముఖ్యం. గ్రీప్ బలంగా లేకపోతే, బైక్ జారి పడే ప్రమాదం ఎక్కువ. వర్షాకాలంలో అరిగిపోయిన టైర్లతో బయటకు వెళ్లవద్దు. మీ టైర్ ట్రెడ్‌లు అరిగిపోయి ఉంటే బైక్ జారుతుంది. కాబట్టి వెంటనే వాటిని మార్చడం మంచిది.

Tips To Take Care Of Your Bike In Rainy Season

బ్రేక్‌లు: వర్షాకాలంలో బైక్‌పై సురక్షితంగా ప్రయాణించడం అంటే కేవలం స్లోగా నడపడం మాత్రమే కాదు. ముఖ్యంగా, బ్రేక్ సిస్టం సక్రమంగా చూసుకోవడం చాలా ముఖ్యం. డిస్క్ బ్రేక్‌ల విషయానికి వస్తే, వర్షకాలంలో మట్టి, నీరు డిస్క్‌లపై చుట్టుకుని, బ్రేక్ బైటింగ్ (గట్టిగా పట్టుకునే సామర్థ్యం)ను తగ్గిస్తుంది. అందుకే, డిస్క్ బ్రేక్‌లను రెగ్యులర్‌గా శుభ్రం చేయాలి. అందుకు మృదువైన క్లోత్, సిఫార్సు చేసిన క్లీనర్ సహయంతో బ్రేకులను తుడవాలి.

బైక్‌కి యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్(ABS) ఉన్నా లేకపోయినా, వర్షంలో ఆకస్మికంగా బ్రేక్ కొట్టడం చాలా ప్రమాదకరం. ఎందుకంటే, నీటితో తడిచిన రోడ్డుపై టైర్లు సడెన్‌గా ట్రాక్షన్ కోల్పోయి బైక్ జారిపోతుంది. ఇంటి నుంచి బయలుదేరింది మొదలు తిరిగి వచ్చే వరకు కూడా ఎక్కడా అకస్మాత్తుగా బ్రేకులు వేయకుండా ఎదురుగా ఉన్న వాహనాలను ముందుగానే గమనిస్తూ, మెల్ల మెల్లగా బ్రేకులు వేయడం వలన బైక్ స్కిడ్ అయ్యే అవకాశం ఉండదు.

Tips To Take Care Of Your Bike In Rainy

చైన్: వర్షపు నీరు కారణంగా, ఇరుకైన ట్రాక్‌లతో చైన్‌పై ఉండే లూబ్రికేషన్ తొలగిపోతుంది. అలాంటప్పుడు చైన్ తుప్పుకు పట్టే అవకాశం ఉంది. తక్కువ లూబ్రికేషన్ వల్ల చైన్ నుంచి గిరగిర శబ్ధం వస్తుంది. అందుకే, ప్రతి కొన్ని రోజులకు చైన్‌ను శుభ్రం చేసి మళ్ళీ లూబ్రికేట్ చేయడం చాలా అవసరం. దీన్ని రోజు చేయడం వలన చైన్ జీవితకాలం పెరుగుతుంది, రైడింగ్ స్మూత్‌గా ఉంటుంది.

టెఫ్లాన్ పూత: వర్షాకాలంలో బైక్‌పై జాగ్రత్తలు తీసుకోవడంలో మరొక ప్రయోజనకరమైన పరిష్కారం పూత వేయించడం. సాధారణంగా, వర్షపు నీరు బైక్ మెటల్ భాగాలపై నిలవటం వల్ల తుప్పు వేయడం ప్రారంభమవుతుంది. కొంతకాలం తర్వాత రంగు మసకబారి, మెటల్ బిట్‌లు ఆక్సిడైజ్ అవుతాయి. ఈ సమస్యకు అద్భుతమైన మార్గం టెఫ్లాన్ లేదా సిరామిక్ కోటింగ్. ఇది వర్షపు నీరు, ధూళి, మురికిని ఏకకాలంలో నిలువరిస్తుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, July 1, 2025, 7:03 [IST]
English summary
Top six tips to take care of your bike during in rainy season details
Read more on: #tips #auto news #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+