పెట్రోల్‌కు గుడ్ బై చెప్పేయండి.. కేవలం రూ. 10,000లకే మీ పాత స్కూటర్‌ను ఎలక్ట్రిక్‌గా మార్చేయండి
ప్రస్తుతం పెట్రోల్ ధరలు మండిపోతున్నాయి.. పెరుగుతున్న పెట్రోల్ ధరలతో విసిగిపోయారా? కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలంటే లక్షలు ఖర్చు చేయాలా అని ఆలోచిస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. మీ పాత పెట్రోల్ స్కూటర్‌ను కేవలం రూ. 10,000 ఖర్చుతో ఎలక్ట్రిక్ స్కూటర్‌గా మార్చుకోవచ్చు.. వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.
గత కొన్నేళ్లుగా స్కూటర్ల వినియోగం నగరాల్లో బాగా పెరిగింది. డ్రైవ్ చేయడానికి సులువుగా ఉండటం, ట్రాఫిక్‌లో సులువుగా మేనేజ్ చేయగలగడం వంటి కారణాల వల్ల చాలా మంది స్కూటర్లను ఇష్టపడుతున్నారు. ఇక ఎలక్ట్రిక్ స్కూటర్ల విషయానికొస్తే, వాటి అమ్మకాలు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. ఓలా, టీవీఎస్, ఏథర్ వంటి అనేక కంపెనీలు ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తున్నాయి.

ఎక్కువ మంది ఎలక్ట్రిక్ స్కూటర్లను ఎంచుకోవడానికి ప్రధాన కారణం వాటి లో మెయింటెనెన్స్ ఖర్చు. పెట్రోల్ స్కూటర్లకు పెట్రోల్ ఖర్చుతో పాటు, మెయింటెనెన్స్ ఖర్చులు కూడా ఎక్కువే. ఎలక్ట్రిక్ స్కూటర్లు కొంచెం ఖరీదైనప్పటికీ దీర్ఘకాలంలో చూస్తే అవి చాలా లాభదాయకం.
దీంతో చాలా మంది ఎలక్ట్రిక్ స్కూటర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే, ఇప్పటికే పెట్రోల్ స్కూటర్లు వాడుతున్న వారు తమ స్కూటర్‌ను ఎలక్ట్రిక్‌గా మార్చవచ్చా అని సోషల్ మీడియాలో ప్రశ్నలు అడుగుతున్నారు. ఇది చాలా మందికి సందేహంగా ఉంది. వారికి సమాధానం ఏమిటంటే.. ప్రభుత్వం ఆమోదించిన కిట్‌లు అందుబాటులో ఉన్నాయి.
బెంగళూరులో పెట్రోల్ స్కూటర్లను ఎలక్ట్రిక్ స్కూటర్లుగా మార్చే ట్రెండ్ బాగా పెరుగుతోంది. ఇండియన్ ఆయిల్, సన్ మొబిలిటీ కలిసి 'ఇండో ఫాస్ట్ ఎనర్జీ' అనే సంస్థ ద్వారా ఏఆర్ఏఐ (ARAI) సర్టిఫైడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కిట్‌లను అందిస్తున్నాయి. ఈ కిట్‌లు కేవలం రూ. 10,000 ధరలో లభిస్తున్నాయి.
ఈ కిట్‌లను ప్రస్తుతం వాడుతున్న హోండా యాక్టివా, ఏవియేటర్, డియో, క్లిక్, సుజుకి యాక్సెస్, స్విస్, టీవీఎస్ జూపిటర్, వీగో, యమహా ఫాసినో వంటి వాహనాలకు అమర్చవచ్చు. ఆ వాహనాల్లోని పెట్రోల్ ఇంజన్, ఇతర భాగాలను తొలగించి వాటి స్థానంలో స్వాపబుల్ బ్యాటరీ అమర్చే కిట్‌లను అమర్చడం ద్వారా పెట్రోల్ స్కూటర్లను ఎలక్ట్రిక్ స్కూటర్లుగా మార్చవచ్చు.
ఇందులోని స్వాపబుల్ బ్యాటరీని బెంగళూరులోని 900 బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్‌లలో మార్చుకోవచ్చు. ఇది మాత్రమే కాదు, వాహనం రిజిస్ట్రేషన్‌ను కూడా పెట్రోల్ వాహనం నుంచి ఎలక్ట్రిక్ వాహనంగా మార్చుకోవచ్చు. ఇన్సూరెన్స్ విషయంలో కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలంటే రూ. 1.2 లక్షల నుంచి రూ.1.5లక్షల వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది. కానీ ఈ కిట్‌లను అమర్చడం ద్వారా రూ. 80,000 వరకు ఆదా చేయవచ్చు.
డ్రైవ్‌స్పార్క్ వ్యాఖ్య: యాక్టివా వంటి 11 పెట్రోల్ స్కూటర్లను కేవలం రూ. 10,000 ఖర్చుతో ఎలక్ట్రిక్ స్కూటర్‌గా మార్చే ట్రెండ్ ప్రస్తుతం బాగా పెరుగుతోంది. చాలా మంది ఈ మార్పును చేయడం ప్రారంభించారు. ప్రస్తుతం బెంగళూరులో ఎక్కువగా ఉన్న ఈ ట్రెండ్ త్వరలో ఇతర నగరాల్లో కూడా చూడవచ్చు అని ఆశించవచ్చు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








