మార్కెట్లో కింగ్‌నని ఫీలవుతున్న రాయల్ ఎన్ ఫీల్డ్‌కు షాక్.. మార్కెట్లోకి అంతకు మించి మోడల్ వచ్చేసింది
కొత్తగా బైక్ కొనే ఆలోచనలో ఉన్నారా? అయితే మీకు ఒక గుడ్ న్యూస్. ట్రయంఫ్ నుంచి సరికొత్త త్రక్స్టన్ 400 కఫే రేసర్ మార్కెట్లోకి వచ్చేసింది. కేవలం రూ. 2.74 లక్షలకే (ఎక్స్-షోరూమ్) లభించే ఈ బైక్, రాయల్ ఎన్‌ఫీల్డ్, హోండా వంటి బైక్‌లకు గట్టి పోటీ ఇవ్వనుంది.
యువతను దృష్టిలో ఉంచుకొని, క్లాసిక్ స్టైల్‌లో, ఆధునిక ఫీచర్లతో ఈ బైక్‌ను డిజైన్ చేశారు. పవర్‌ఫుల్ ఇంజిన్, అద్భుతమైన లుక్స్‌తో ఈ బైక్ బైక్ లవర్స్‌ను ఆకట్టుకోవడం ఖాయం. రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్స్ అంటే మనకు ఒక స్పెషల్ ఫీలింగ్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఎన్‌ఫీల్డ్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు బ్రిటిష్ కంపెనీ ట్రయంఫ్ మార్కెట్‌లోకి దూసుకొచ్చింది.

ఇప్పటికే స్పీడ్ 400, స్క్రాంబ్లర్ ఎక్స్ వంటి మోడళ్లతో యువతను ఆకట్టుకుంటున్న ట్రయంఫ్, ఇప్పుడు మరో కొత్త మోటార్‌సైకిల్‌ను లాంచ్ చేసింది. దాని పేరే థ్రక్స్‌టన్ 400. ఇది ఒక కేఫ్ రేసర్ బైక్. మరి ఈ బైక్ ఫీచర్లు, ధర గురించి పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
కొంతకాలంగా మిడ్-కెపాసిటీ బైక్ సెగ్మెంట్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్, హోండా వంటి కంపెనీలదే హవా. కానీ, ఇప్పుడు ట్రయంఫ్ కూడా ఈ రేసులోకి దూసుకొచ్చింది. ఇప్పటికే స్పీడ్ 400, స్క్రాంబ్లర్ X వంటి మోడళ్లతో మార్కెట్‌లో మంచి పేరు సంపాదించిన ట్రయంఫ్, ఇప్పుడు మరింత ఆకర్షణీయమైన త్రక్స్టన్ 400 కఫే రేసర్(Thruxton 400 Cafe Racer)ను లాంచ్ చేసింది. ఈ బైక్ లుక్స్, పర్ఫార్మెన్స్ చూస్తే, యూత్ ఖచ్చితంగా ఫిదా అవుతారు.

ఈ బైక్ డిజైన్ చూస్తే పాతకాలపు త్రక్స్టన్ 1200 సీసీ బైక్ గుర్తుకు వస్తుంది. కానీ, ఇందులో ఆధునిక టెక్నాలజీ ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా, ఇందులో ఉన్న రెట్రో-స్టైల్ సెమీ-ఫెయిరింగ్ బైక్‌కు ఒక ప్రత్యేకమైన లుక్ తీసుకొచ్చింది. ముందువైపు రౌండ్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్, క్లిప్-ఆన్ హ్యాండిల్‌బార్, బార్-ఎండ్ మిర్రర్స్ దీని స్టైల్‌ను మరింత పెంచుతాయి.
అంతేకాకుండా, ఫ్యూయెల్ ట్యాంక్ డిజైన్ కూడా కొత్తగా ఉంటుంది. బైక్ వెనక వైపు ఉన్న పిలియన్ సీట్ కౌల్‌ను కావాలంటే తొలగించుకోవచ్చు. కొత్త ట్రయంఫ్ త్రక్స్టన్ 400 కఫే రేసర్‌లో 398 సీసీ లిక్విడ్-కూల్డ్, సింగిల్-సిలిండర్ TR-సిరీస్ ఇంజిన్ ఉంది.

ఈ ఇంజిన్ 41.4 బీహెచ్‌పీ పవర్, 37.5 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది స్పీడ్ 400 రోడ్‌స్టర్ కంటే ఎక్కువ పవర్‌ను ఇస్తుంది. అంతేకాకుండా, 6-స్పీడ్ గేర్‌బాక్స్, స్లిప్పర్ అసిస్ట్ క్లచ్ కూడా ఉన్నాయి. దీనివల్ల బైక్‌ను సులభంగా నడపవచ్చు.
ఈ బైక్‌లో సేఫ్టీ ఫీచర్స్‌కు కూడా ట్రయంఫ్ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. ఇందులో ముందువైపు USD ఫోర్కులు, వెనుకవైపు మోనోషాక్ సస్పెన్షన్ ఉన్నాయి. బ్రేకింగ్ కోసం ముందు, వెనుక డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. దీంతో పాటు, డ్యూయల్-ఛానల్ ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. బైక్ బరువు 183 కిలోలు, గ్రౌండ్ క్లియరెన్స్ 158 ఎంఎం.
కొత్త ట్రయంఫ్ త్రక్స్టన్ 400 కఫే రేసర్ రెడ్, యెల్లో, గ్రే, బ్లాక్ అనే నాలుగు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ బైక్‌లో సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, 17 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఈ బైక్ ప్రపంచవ్యాప్తంగా విడుదల కావడానికి ముందు భారతదేశంలోనే అందుబాటులోకి రావడం విశేషం.
ట్రయంఫ్ కొత్త త్రక్స్‌టన్ 400 కేఫ్ రేసర్ బైక్‌ను మొదటగా భారతదేశంలోనే విడుదల చేసింది. ఈ ఏడాది చివరి నాటికి దీనిని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని కంపెనీ యోచిస్తోంది.
ఇప్పటికే 400 సీసీ ప్లాట్‌ఫామ్‌పై స్పీడ్ T4, స్పీడ్ 400, స్క్రాంబ్లర్ 400 X వంటి మోడళ్లను విడుదల చేసింది. ఇప్పుడు త్రక్స్‌టన్ 400 కూడా ఈ జాబితాలో చేరింది. ఈ కొత్త బైక్ రాయల్ ఎన్‌ఫీల్డ్, హోండా బైక్‌లకు గట్టి పోటీ ఇవ్వగలదని అంచనా.


Click it and Unblock the Notifications