ఈ బైకుపై వెళ్తుంటే దిష్టి తీసుకోండి.. లేకుంటే అందరి చూపు మీ మీదే.. దూసుకుపోయే స్క్రాంబ్లర్ 400 XC వచ్చేసింది.

బ్రిటిష్ మోటార్ సైకిల్ తయారీ సంస్థ ట్రయంఫ్ (triumph), భారత ద్విచక్ర వాహన రంగంలో తనదైన ముద్ర వేసేందుకు అసలు వెనుకాడలేదు. ఎంతో కాలంగా మిడ్-కెపాసిటీ సెగ్మెంటులో రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు బలమైన పోటీని ఇస్తుంది. కంపెనీ నుంచి విడుదలయ్యే బైకులు శక్తివంతమైన మెకానికల్ పనితీరుతోనే కాదు, ధరలోనూ మధ్యతరగతి యువతకు చేరువయ్యాయి. అందుబాటు ధరలో తన మోడళ్లను లాంచ్ చేయడం ద్వారా ట్రయంఫ్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. ఈ క్రమంలో ట్రయంఫ్ కొత్తగా దేశీయ వినియోగదారుల కోసం కొత్తగా స్క్రాంబ్లర్ 400XC (Scrambler 400 xc) అనే సరికొత్త బైకును విడుదల చేసింది. స్పీడ్ 400, స్క్రాంబ్లర్ 400X లతో మంచి అమ్మకాలను సాధించిన కంపెనీ ఈ కొత్త దాన్ని తీసుకొచ్చింది.

స్క్రాంబ్లర్ 400XC మోడల్ రూ. 2.94 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో కొనుగోలు చేయడానికి లభిస్తుంది. ఇది ట్రయంఫ్‌కు 75 ఏళ్ల స్క్రాంబ్లర్ వారసత్వం ఉన్నా, 400 XC ఆ చరిత్రను కొత్త దిశగా తీసుకెళ్తోంది. దీని డిజైన్ అందరిని ఆకట్టుకునే విధంగా ఉండగా అధునాతన ఫీచర్స్‌ను కలిగి ఉంది. ఈ బైక్ ప్రత్యేకతనిచ్చే అంశాలు దాని మసిలేని స్టైలింగ్, ఇంకా అసలైన బ్రిటిష్ ప్రీమియం ఫిట్ & ఫినిషింగ్.

Triumph New Scrambler 400 Xc Design

ఇది ఆఫ్‌రోడ్‌కి సిద్ధంగా ఉండే విధంగా డిజైన్ చేయబడింది. అయినప్పటికి నగర రోడ్లపై కూడా రయ్ మంటూ దూసుకుపోతుంది. అయినప్పటికి నగర రోడ్లపై కూడా రయ్ మంటూ దూసుకుపోతుంది. స్క్రాంబ్లర్ 400 XC, ట్రయంఫ్ అభివృద్ధి చేసిన స్క్రాంబ్లర్ 400Xకి కొనసాగింపు వేరియంట్‌గా నిలుస్తోంది. రూ. 2.94 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో, ఇది 400X కంటే సుమారు రూ. 27,000 ఎక్కువే అయినా, అందుకు తగ్గ విలువను కూడా అందిస్తుంది.

అదనంగా అందించే క్రాస్-స్పోక్ వీల్స్ మాత్రమే కాకుండా, ఈ బైక్‌కు ప్రత్యేకమైన మూడు కొత్త కలర్స్‌లో కొనుగోలుకు లభిస్తుంది. దీని ఇంజిన్ విషయానికి వస్తే, అదే 398cc సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఇది 40 bhp పవర్, 37.5 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400 XC రేసింగ్ ఎల్లో, స్టార్మ్ గ్రే, వెనిల్లా వైట్ అనే కలర్స్‌లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.

Triumph New Scrambler 400 Xc Price

ఇది ముందు 19-అంగుళాలు, వెనుక 17-అంగుళాల క్రాస్-స్పోక్ ట్యూబ్‌లెస్ వీల్స్, తలక్రిందులుగా ఉండే ఫ్రంట్ ఫోర్క్స్, 150 mm సస్పెన్షన్ ట్రావెల్ ఇవన్నీ కలిపి దీన్ని నిజమైన ఆఫ్-రోడ్ ఫోకస్‌తో రూపొందించారని తెలుస్తుంది. అల్యూమినియం సమ్ప్ గార్డ్, హై ఫెండర్, ఇంజిన్ ప్రొటెక్షన్ బార్‌లు, చిన్న విండ్‌స్క్రీన్ లాంటి ప్రత్యేకమైన ఫీచర్లు దీన్ని మరింత ఆకర్షణీయంగా మారుస్తుంది. స్క్రాంబ్లర్ 400 XC తో ట్రయంఫ్ అది ఎంతో అందంగా ఉంటుంది.

ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400 XC ఇంజిన్ 8,000 rpm వద్ద 40 bhp పవర్, 6,500 rpm వద్ద 37.5 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి, సిటీ రైడింగ్ నుంచి ఓపెన్ ట్రైల్స్ వరకు అన్ని పరిస్థితుల్లో మృదువుగా, కానీ శక్తివంతంగా స్పందిస్తుంది. స్టెయిన్‌లెస్ స్టీల్ ట్విన్-స్కిన్ ఎగ్జాస్ట్ సిస్టమ్ గంభీరమైన సౌండ్‌తో అట్రాక్ట్ చేస్తుంది. ఫీచర్ల పరంగా చూస్తే, చాలా ఉన్నాయి.

స్విచ్చబుల్ ట్రాక్షన్ కంట్రోల్, రైడ్-బై-వైర్ థ్రోటిల్, టార్క్-అసిస్ట్ క్లచ్ వంటి టెక్నాలజీ ఆధారిత ఫీచర్లతో పాటు, ఆఫ్-రోడ్ యాడ్వెంచర్‌లకు ఉపయోగకరంగా ఉండే స్వతంత్ర ABS వ్యవస్థను కూడా అందించారు. అంతేకాదు, యూఎస్‌బీ ఛార్జింగ్ సాకెట్, సిగ్నేచర్ DRLలతో కూడిన పూర్తి LED లైటింగ్ సిస్టమ్ వంటి సౌకర్యాలు దీన్ని మరింత ఆధునిక రైడింగ్ అనుభవంగా మార్చేస్తాయి.

Article Published On: Tuesday, May 13, 2025, 10:55 [IST]
English summary
Triumph new scrambler 400 xc launched in india here price and all top things
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+