రూ.2 లక్షలకే ట్రయంఫ్ బైక్.. సౌండ్ మాస్, లుక్ క్లాస్! 400cc క్లాసిక్ సెగ్మెంట్‌లో కొత్త ట్రెండ్
ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్ (triumph) అభిమానులకు మరో బిగ్ అప్‌డేట్. బ్రిటన్‌కు చెందిన ఈ ప్రీమియం బైక్ తయారీ సంస్థ భారత మార్కెట్లో తన స్టైలిష్, పవర్‌ఫుల్ బైక్ స్పీడ్ T4ను ఇప్పుడు మరింత ఆకర్షణీయంగా ముస్తాబు చేసింది. కొత్తగా "బాజా ఆరెంజ్" అనే కలర్‌లో విడుదల చేసిన ఈ బైక్ ఇప్పుడు వీధులపై స్పోర్టీగా, స్టైలిష్‌గా కనబడనుంది. ఇప్పటికే ప్రీమియం నేకడ్ స్పోర్ట్స్ బైక్‌గా పాపులర్ అయిన స్పీడ్ T4కి ఈ కొత్త కలర్ మరింత వైవిధ్యం కలిగించింది. ఇది ఎక్స్‌షోరూమ్ ధర రూ.2.05 లక్షలకు అందుబాటులో ఉంది. బాజా ఆరెంజ్ అనే ఈ రంగు ట్రయంఫ్‌కి కొత్త కాదు. గతంలో Scrambler 1200 XE, Street Triple 765 R వంటి హైఎండ్ మోడళ్లలో ఈ రంగును ఉపయోగించారు. ఇప్పుడు ఈ మోడల్‌ను ఇదే కలర్‌లో వినియోగదారుల కోసం తీసుకొచ్చారు.
ఈ బైక్‌కు ఎక్స్‌టీరియర్‌లో చేసిన మార్పులు కేవలం కలర్ పరంగా మాత్రమే. మెకానికల్‌గానో, ఫీచర్ పరంగా గానో ఎటువంటి మార్పులు చేయలేదు. అయినా ఈ కలర్ కారణంగా బైక్‌కి కొత్త ఎనర్జీ, కొత్త మూడ్ వచ్చిందనే చెప్పాలి. ప్రత్యేకంగా ఇంధన ట్యాంక్ పైన భాగంలో, వెనుకభాగంలో నారింజ రంగు ఉద్గారంగా కనిపిస్తుంది. ట్యాంక్‌కి తరువాతి భాగం నలుపు రంగులో ఉండటం, రెండు షేడ్స్‌ను వేరు చేసే తెలుపు గీత ఆకట్టుకుటుంది.

దీని వల్ల బైక్‌కు స్పోర్టీ డ్యూయల్-టోన్ లుక్ వచ్చింది. ఈ తాజా కలర్‌తో ట్రయంఫ్ స్పీడ్ T4 మొత్తం ఐదు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. స్పీడ్ T4 బాజా ఆరెంజ్, కాస్పియన్ బ్లూ విత్ పెర్ల్ మెటాలిక్ వైట్, లావా రెడ్ గ్లోస్ విత్ పెర్ల్ మెటాలిక్ వైట్, ఫాంటమ్ బ్లాక్ విత్ పెర్ల్ మెటాలిక్ వైట్, స్టార్మ్ గ్రే విత్ ఫాంటమ్ బ్లాక్ కలర్స్‌లో కొనుగోలు చేయవచ్చు.
ట్రయంఫ్ స్పీడ్ T4 ఒక్క లుక్స్‌కే కాదు, పెర్ఫార్మెన్స్ పరంగా కూడా రైడర్లను ఆకట్టుకునేలా రూపుదిద్దుకుంది. ఈ బైక్‌లో 398cc లిక్విడ్-కూల్డ్ సింగిల్-సిలిండర్ ఇంజిన్ ఉంది. ఇది 7,000rpm వద్ద గరిష్టంగా 30.6bhp పవర్, 5,000rpm వద్ద 36Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ శక్తివంతమైన ఇంజిన్‌కు ఆరు-స్పీడ్ గేర్‌బాక్స్‌ను జోడించారు. దీని రైడింగ్ అనుభూతిని మరింత మెరుగుపరచడంలో స్లిప్పర్ క్లచ్ సిస్టం ప్రధాన పాత్ర పోషిస్తుంది.

రైడింగ్ కంఫర్ట్ కోసం ట్రయంఫ్ ఇందులో 43mm అప్‌సైడ్-డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్, మెరుగైన స్టెబిలిటికి టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక భాగంలో మోనోషాక్ సస్పెన్షన్‌ను అందించింది. ఈ మొత్తం వ్యవస్థను స్టీల్ ట్రెల్లిస్ ఫ్రేమ్ సపోర్ట్ ఇస్తుంది. అదనంగా, స్పీడ్ T4లో డ్యూయల్ ఛానల్ ABS బ్రేకింగ్ సిస్టమ్ ఉంది, ఇది ముందు, వెనుక భాగాల్లో డిస్క్ బ్రేక్‌లను కలిగి ఉంది. ఈ బ్రేకింగ్ వ్యవస్థ హై స్పీడ్‌లోనూ భద్రతను కలిగిస్తుంది.
డిజైన్ విషయానికి వస్తే, స్పీడ్ T4కు క్లాసిక్ లుక్స్‌ను ఇస్తూ గుండ్రని LED హెడ్‌లైట్, రిబ్బెడ్ కవర్‌తో కూడిన సింగిల్ సీటు, గుండ్రని అద్దాలు, మ్యాట్ ఫినిష్ ఎగ్జాస్ట్ ఉన్నాయ్. ఇవన్నీ కలిపి ఈ బైక్‌కు ఒక రెట్రో-మోడర్న్ ఫీలింగ్‌ను తీసుకువస్తాయి. ఇంకా చెప్పాలంటే, స్టైలింగ్, సౌకర్యం, శక్తి. టెక్నాలజీ.. అన్నింటిలోనూ ట్రయంఫ్ స్పీడ్ T4 తన ప్రత్యేకతను నిలబెట్టుకుంది.

కొత్త కలర్ వేరియంట్‌తో ఇది ఇప్పుడు స్ట్రీట్‌పై మరింత స్టైలిష్‌గా, ప్రీమియమ్‌గా రోల్ అవుతుంది. ఎఫ్‌వై25 ప్రారంభమైన నాటి నుంచి ట్రయంఫ్ స్పీడ్ T4 అమ్మకాల పరంగా మంచి ఊపుమీద సాగుతోంది. ఈ మోడల్‌కి వినియోగదారుల నుండి భారీ స్పందన లభించడంతో, వాల్యూమ్‌లు గత త్రైమాసికంతో పోలిస్తే రెట్టింపు అయ్యాయి.


Click it and Unblock the Notifications








