ఈ పండుగ సీజన్‌లో సూపర్ ఆఫర్! భారీ తగ్గింపుతో అదిరిపోయే కొత్త బైక్ మీ ఇంటి ముందుకు వస్తుంది
ఇండియాలో టూవీలర్ వాడకం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. దేశంలో దాదాపు 90 శాతానికి పైగా ఇళ్లలో ఏదో ఒక టూవీలర్ కచ్చితంగా ఉండి ఉంటుంది. ప్రజలు తమ రోజువారి అవసరాలకు బైక్ లేదా స్కూటర్ల మీదనే ఆధారపడుతుంటారు. ఇంటి నుంచి బయటకు వెళ్లింది మొదలు నడక చాలా వరకు తగ్గిపోయి, టూవీలర్ల మీదనే వెళ్తున్నారు. దీంతో తయారీ కంపెనీలకు వీటి సేల్స్ ద్వారా భారీ ఎత్తున ఆదాయం వస్తుంది. ప్రతి ఏడాది కూడా టూవీలర్ల సేల్స్ పెరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా బడ్జెట్ టూవీలర్లకు దేశవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంటుంది. తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ వాటిని చాలా మంది కొనుగోలు చేయడానికి ముందుకు వస్తుంటారు. అయితే రాను రాను ఈ ధోరణి మారుతుంది. ప్రజల ఆదాయ స్థితిల్లో కొంత మార్పులు రావడంతో బడ్జెట్ బైక్‌లనే కాకుండా ఎక్కువ ధరలో లభించే వాటిని కూడా కొంటున్నారు.
స్పోర్ట్స్ మోడల్ తరహా లుక్‌ను కలిగి ఉండే వాటిని కూడా కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా యువత ఇలాంటి వాటిపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తుంది. దీంతో చాలా మంది సరికొత్త బైక్‌లతో లాంగ్ టూర్లకు వెళ్తున్నారు. వీటిని వీడియోలు తీస్తూ ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్ వంటి వాటిల్లో షేర్ చేస్తూ భారీ ఫాలోవర్స్‌ను సంపాదిస్తున్నారు. ఈ క్రమంలో ఆదాయం కూడా పెద్ద ఎత్తున ఆర్జిస్తున్నారు.

ఇలా వచ్చిన ఆదాయంతో మార్కెట్లోకి విడుదలయ్యే అధునాతన బైక్స్‌లను కొనుగోలు చేస్తూ వాటిని టూర్లకు తీసుకెళ్తున్నారు. దీంతో ఈ క్రేజ్ ఇటీవల కాలంలో ఎక్కువ కావడంతో చాలా మంది యువత లగ్జరీ ఫీచర్స్, అదిరిపోయే స్టైలిష్ డిజైన్‌ను కలిగిన బైక్స్‌ను ఇష్టంగా కొంటున్నారు. ఈ విభాగంలో ఇండియాలో రాయల్ ఎన్‌ఫీల్డ్, అంతర్జాతీయ కంపెనీలు అయినటువంటి ట్రయంఫ్, హార్లే డేవిడ్‌సన్ వంటివి పలు మోడళ్లను విడుదల చేస్తున్నాయి.
ప్రధానంగా బ్రిటీష్ బ్రాండ్ ట్రయంఫ్ కంపెనీ గ్లోబల్ మార్కెట్లో మంచి పేరుంది. చాలా కాలంగా ఇది టూవీలర్ అమ్మకాల్లో మంచి స్థానంలో ఉంది. ఇండియాలో కూడా ట్రయంఫ్ బైక్స్ గురించి చాలా మందికి తెలుసు. ట్రయంఫ్ మేడ్ ఇన్ ఇండియా బైక్‌లకు అంతర్జాతీయ మార్కెటలో మంచి ఆదరణ ఉంది. దేశంలో కూడా ఈ బైక్స్ ఎక్కువగానే అమ్ముడుపోతుంటాయి. ప్రధానంగా ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400X(triumph scrambler 400x)డిమాండ్ ఉన్న మోడల్.

ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400X సేల్స్ పెంచడానికి కంపెనీ గత ఏడాది డిసెంబర్‌లో తగ్గింపు ఆఫర్‌ను ఇచ్చింది. ఈ బైక్‌ను కొనుగోలు చేసిన కస్టమర్లకు రూ.12,500 విలువైన ఉపకరణాలను అందించింది. అయితే ఆఫర్ డిసెంబర్ 31 వరకు మాత్రమే వర్తించగా, దీనిని జనవరి 31, 2025 వరకు పొడిగించింది. డిసెంబర్‌లో ఇయర్ ఎండ్ తగ్గింపును ఇచ్చి ఈ సారి కొత్త ఏడాది ప్రారంభ నెలలో తగ్గింపు పేరిట అదే ఆఫర్‌ను పొడిగించింది.
స్క్రాంబ్లర్ 400Xని సొంతం చేసుకోవాలని ప్లాన్ చేస్తున్న వారు ఈ తగ్గింపు ఆఫర్‌ను సద్వినియోగం చుసుకోవచ్చు. ఇప్పుడు ఈ బైక్‌ను కొనుగోలు చేసే వారు తక్కువ ఇంజిన్ బార్, కోటెడ్ విండ్‌స్క్రీన్, హై మడ్‌గార్డ్ కిట్, ట్యాంక్ ప్యాడ్, లగేజ్ ర్యాక్ కిట్, ట్రయంఫ్ బ్రాండ్ టీ-షర్ట్‌లను అదనంగా పొందుతారు. దీని పనితీరు విషయానికి వస్తే, ఆఫ్ రోడ్‌తో పాటు హైవేలపై ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది.
స్క్రాంబ్లర్ 400 X బైక్ 398.15 cc, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌తో రన్ అవుతుంది. ఇది 39.5 bhp పవర్‌ను, 37.5 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్‌కు 6-స్పీడ్ గేర్‌బాక్స్ సెటప్‌ను జోడించారు. ఇండియా మార్కెట్లో దీని ధర రూ.2.64 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ బైక్ రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350తో ప్రధానంగా పోటీ పడుతుంది.


Click it and Unblock the Notifications








