ట్రయంఫ్ ప్రీమియం బైకుపై ధర తగ్గింపు.. ఈసారి మరింత అందంగా కూడా! కచ్చితంగా చూడాల్సిందే!
ట్రయంఫ్.. ప్రపంచ దిగ్గజ ప్రీమియం బైక్ తయారీ సంస్థల్లో ఒకటి. ఈ కంపెనీ నుంచి వివిధ రకాల టూ-వీలర్స్ మోడళ్లు భారత మార్కెట్లో సేల్స్‌లో అందుబాటులో ఉన్నాయి. అందులో ఒకటి Speed T4. ఈ బైకును వినియోగదారులకు మరింత చేరువగా చేసేందుకు ట్రయంఫ్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. దీని ధరను గణనీయంగా తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. అంతకుముందు రూపాయలు 2.17 లక్షలుగా ఉన్న ఈ బైక్ ధరను 1.99 లక్షలకు తగ్గించింది. మార్కెట్‌లో ఈ బైక్స్‌కి మంచి డిమాండ్ ఉంది. అందవల్ల వీటికి సైతం భారీ స్థాయిలో మార్కెటింగ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో.. ఈ బైక్ కి సంబంధించిన విశేషాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం.
ప్రస్తుతం తగ్గించిన ధరతో ఈ ట్రయంఫ్ స్పీడ్ T4 బైకు సరసమైన ధరలో లభించే బైకుగా చెప్పవచ్చు. ధర తగ్గించడంతోపాటు మరో ఆకర్షణీయమైన అప్డేట్‌ను కూడా తీసుకువచ్చింది ఈ సంస్థ. అందులో భాగంగా ఈ బైకు ప్రీమియం క్వాలిటీని రెట్టింపు చేసింది. ఈ బైక్‌లో ఒక కొత్త కలర్‌ను జోడించి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ బైకు 4 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

ఇవన్నీ కూడా డ్యూయల్ కలర్స్‌తో డెకొరేట్ చేసి ఉంటాయి. ఇందులో ప్రీమియం కలర్ ఆప్షన్‌గా Lava red gloss/ pearl metallic white ఉంటుంది. అంతేకాకుండా ఈ బైకు Caspian blue/pearl metallic white, Phantom black/storm grey and Phantom black/Pearl metallic white అనే కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. ఈ రంగులన్నీ కూడా ఆకర్షణీయమైనవే అని చెప్పొచ్చు.
అందువల్ల ఇది ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించే అవకాశం ఉంది. రోడ్డుపై వెళ్తున్నప్పుడు విభిన్నంగా కనిపించాలనుకునే వారు ఈ బైక్‌ను కొనుగోలు చేసే అవకాశం ఉంది. కలర్ ఒకటే కాకుండా.. వన్-పీస్ సీట్, slightly raised exhaust, అలాయ్ వీల్స్, రౌండ్ హెడ్లైట్, రియర్ వ్యూ మిర్రర్స్ కూడా దీనికి మరింత అందాన్ని చేకూరుస్తాయి.

ఈ బ్యూటిఫికేషన్, ధర తగ్గింపు కారణంగా ట్రయంఫ్ స్పీడ్ T4 బైకు భారతీయులను బాగా ఆకట్టుకునే అవకాశం ఉంది. ఇంజిన్ విషయంలో ఈ బైక్‌లో ఎలాంటి మార్పులు ట్రయంఫ్ సంస్థ చేయలేదు. 398.15 సిసిలిక్విడ్ కూల్డ్ DOHC మోటార్ ఈ అప్డేటెడ్ వెర్షన్‌లోనూ వినియోగించారు.
ఈ మోటార్.. 31 PS పవర్, 36 nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇక స్పీడ్ 400 మోడల్‌లోను ఈ ఇంజిన్‌నే వినియోగించారు. అయితే ఇది కొంత ఎక్కువ పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ స్పీడ్ T4 బైకులో టార్క్ అసిస్ట్ క్లచ్, బోస్ డ్యూయల్ ఛానల్ ABS, USB చార్జింగ్ పోర్ట్ వంటి ఫీచర్లు కూడా ఉంటాయి.

డ్రైవ్‌స్పార్క్ వ్యాఖ్య: భారత వినియోగదారులను ఆకట్టుకోవడానికి ట్రయంఫ్ సంస్థ వివిధ ప్రయత్నాలు చేస్తోంది. ఈ స్పీడ్ T4 బైకు సంబంధించి ధర తగ్గించడం బ్యూటిఫికేషన్ ఇందుకు సాక్ష్యాలుగా చెప్పవచ్చు. దీని కారణంగా రాబోయే రోజుల్లో ఎక్కువమంది ఈ బైకును కొనుగోలు చేసే అవకాశం ఉంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








