TVS: ఓలా-ఏథర్ కంపెనీలకు గట్టి దెబ్బ.. టీవీఎస్ నుంచి అదిరిపోయే స్కూటర్.. ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరణ
దేశీయ ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీ టీవీఎస్ మోటార్స్ (TVS) ఢిల్లీలో ఎంతో ఘనంగా జరుగుతున్న భారత్ మొబలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో 2025 iQube ST కాన్సెప్ట్‌ను తాజాగా ఆవిష్కరించింది. ప్రస్తుతం ఉన్నటువంటి iQube ST ఆధారంగా దీనిని తీసుకొస్తున్నారు. ఈ కొత్త స్కూటర్ అదిరిపోయే ఫీచర్స్‌తో వస్తుంది. దీని లుక్ చూసినట్లయితే ప్రీమియం మోడల్ లాగా అనిపిస్తుంది. ఆటో ఎక్స్‌పోలో దీనిని ప్రదర్శనకు ఉంచారు. ఈ స్కూటర్ చాలా ఆకట్టుకునే విధంగా ఉంటుంది. iQube ST ఎలక్ట్రిక్ స్కూటర్‌కి ఇది ప్రీమియం వెర్షన్ లాగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇప్పటికే ఈ ఈవెంట్‌లో చాలా రకాల ఈవీలు ఆవిష్కరించబడ్డాయి. ఇప్పుడు ఈ కొత్త ఎలక్ట్రిక్ రాకతో టీవీఎస్ కంపెనీ ఈవీ సెగ్మెంట్‌లో మరింత పుంజుకుంటుంది.
TVS iQube ST కాన్సెప్ట్ అవుట్‌గోయింగ్ మోడల్‌లో అదే 7-అంగుళాల TFT డిస్‌ప్లేను పొందుతుంది, ఇది రైడింగ్ మోడ్‌లు, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, టర్న్- బై -టర్న్ నావిగేషన్, రైడ్ టెలిమెట్రిక్స్ మరియు మరెన్నో లక్షణాలను పొందుతుంది. ఈవీ అమ్మకాల్లో కీలకంగా నిలుస్తుందని కంపెనీ భావిస్తోంది. 2025 మోడల్ డిజైన్ దాని పాత వేరియంట్ మాదిరిగా ఉంటుంది.

అయితే ఈ కాన్సెప్ట్ స్కూటర్‌కు అదనంగా మరిన్ని ఫీచర్స్‌ను జోడించారు. నార్తర్న్ లైట్లను ప్రేరణగా తీసుకున్న టర్కోయిస్ పెయింట్ స్కీమ్ అందంగా ఉంది. బ్యాక్‌రెస్ట్, క్విల్టెడ్ సీట్ వంటివి కూడా అందించారు. iQube STతో పోలిస్తే 2025 స్కూటర్ కొత్త అనుభూతిని అందిస్తుందని టీవీఎస్ అధికారులు పేర్కొంటున్నారు.TVS iQube ST కాన్సెప్ట్ స్కూటర్ 7-అంగుళాల TFT డిస్‌ప్లే, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, రైడ్ టెలిమెట్రిక్స్ వంటి పలు ఫీచర్స్‌ను కలిగి ఉంది.
ఇంకా, టర్న్- బై -టర్న్ నావిగేషన్, వివిధ రైడింగ్ మోడ్స్ వంటి వాటిని కలిగి ఉంటుంది. ఇవే ఫీచర్స్ iQube STలో కూడా ఉన్నాయి. కొత్త మోడల్‌కు సంబంధించిన బ్యాటరీ ప్యాక్ వివరాలను ప్రకటించనప్పటికి iQube STలో ఉన్న పవర్ ట్రెయిన్‌ను పొందే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం TVS iQube ST రెండు బ్యాటరీ ప్యాక్‌లలో లభిస్తుంది.

3.4kWh వేరియంట్ సింగిల్ ఛార్జ్‌తో ఏకంగా 100 కి.మీల దూరం వరకు ప్రయాణిస్తుంది. అదే 5.1kWh బ్యాటరీ ప్యాక్ వేరియంట్ సింగిల్ ఛార్జ్‌తో మరింత ఎక్కువగా 150 కి.మీల వరకు ప్రయాణిస్తుంది. ఇవే బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు 2025 TVS iQube ST కాన్సెప్ట్ స్కూటర్‌లో అందించే అవకాశం ఉంది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. కాన్సెప్ట్ మోడల్‌లో టెలిస్కోపిక్ ఫోర్క్స్‌ను మరింత ఆధునికరించనున్నారు.
దీంతో సస్పెన్షన్ సెటప్ మెరుగ్గా ఉంటుంది. వెనక భాగంలో కూడా అప్‌డేట్ చేసిన ట్విన్ షాక్ అబ్జార్బర్‌లను అందించనున్నారు. iQube ST టాప్-ఎండ్ 5.1kWh వేరియంట్ ధర ప్రస్తుతం రూ. 1.85 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) వద్ద ఉండగా, కాన్సెప్ట్ మోడల్ ధర దీని కంటే మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాన్సెప్ట్ మోడల్ ప్రొడక్షన్‌కి సిద్ధంగా ఉంది. కొద్ది నెలల్లో విడుదల చేసే అవకాశం ఉంది.

ఆటో ఎక్స్‌పోకి సంబంధించిన లైవ్ అప్‌డేట్స్ కోసం మా డ్రైవ్‌స్పార్క్ సోషల్ మీడియా పేజీలను ఫాలో అవ్వండి. మా తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు.


Click it and Unblock the Notifications








