రూ.76 వేలకే మంచి మైలేజ్ ఇచ్చే ఫ్యామిలీ స్కూటర్.. లేటెస్ట్ ఇంజిన్‌తో లాంచ్ చేసిన TVS
దేశంలో టూవీలర్ విభాగంలో బైక్స్‌తో పాటు స్కూటర్స్ కూడా భారీగానే అమ్మకాలు సాధిస్తున్నాయి. మహిళలు, పురుషులు నడపడానికి అనుకూలంగా ఉండే స్కూటర్స్ అంటే చాలా మందికి ఇష్టం. నగరాలు, పట్టణాల్లో రోజు ఆఫీసులు, కాలేజ్‌లకు వెళ్లడానికి గ్రామాల్లో వివిధ అవసరాల కోసం ఇవి చాలా అనువుగా ఉంటాయి. ముఖ్యంగా వీటిలో హోండా యాక్టివా అంటే అత్యంత డిమాండ్ ఉన్న మోడల్. దీనిని స్కూటర్లలో రారాజుగా పిలుస్తారు. దీని తర్వాత ఇదే విభాగంలో డిమాండ్ ఉన్న మోడల్ అంటే TVS జూపిటర్ మాత్రమే. దీన్ని స్కూటర్లలో రాణిగా అనుకుంటారు. దీని ఆకట్టుకునే డిజైన్, మైలేజ్ ఇంజిన్ పనితీరు వంటి అంశాల ప్రాతిపదికన TVS jupiterను కొనుగోలు చేసే వారి లక్షల్లో ఉంటారు. అసలైన ఫ్యామిలీ స్కూటర్‌గా ఇది భారతీయ రోడ్లపై పరుగులు పెడుతుంది. ప్రతి నెలా లక్షలాది మంది దీని కొంటుంటారు.
ఇప్పటివరకు 71 లక్షలకు పైగా అమ్మకాలను నమోదు చేసి సరికొత్త చరిత్రను లిఖించింది. టీవీఎస్ కంపెనీకి దేశంలో స్కూటర్ల విభాగంలో గొప్ప పేరు తీసుకురావడంలో జూపిటర్‌ది కీలకపాత్ర. చాలా ఏళ్లుగా మెరుగైన అమ్మకాలను సాధిస్తున్న ఈ స్కూటర్ లేటెస్ట్ మెడల్‌ను కంపెనీ తాజాగా విడుదల చేసింది. 2025 TVS జూపిటర్ పాత దాని కంటే మరింత కొత్తగా అధునాతన ఫీచర్స్‌తో మార్కెట్లోకి వచ్చింది.

ఈ స్కూటర్‌లో ఇంజిన్‌లో పెద్ద ఎత్తున మార్పులు చేశారు. 110cc ఇంజిన్ కలిగి ఉన్న దీన్ని OBD-2B (ఆన్-బోర్డ్ డయాగ్నస్టిక్స్) ప్రమాణాలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేసి విడుదల చేశారు. దీంతో తక్కువ స్థాయిలో కాలుష్య కారకాల ఉద్గారాలను విడుదల చేస్తుంది. 2025 మోడల్ జూపిటర్ నాలుగు వేర్వేరు వేరియంట్లలో కొనుగోలుకు లభిస్తుంది. బ్రేక్ వేరియంట్ ప్రారంభ ధర రూ.76,691. ఇది ఎక్స్ షోరూమ్ ధర. ఆన్‌రోడ్ మరింత ఎక్కువగా ఉంటుంది.
ఇటీవల కాలంలో వాహనాల వల్ల వాయు కాలుష్యం విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో దీన్ని కట్టడి చేయడానికి ప్రభుత్వ నిబంధనల మేరకు వాహన తయారీదారులు కొత్తగా ఇంజిన్‌ను OBD-2B (ఆన్-బోర్డ్ డయాగ్నస్టిక్స్) ప్రమాణాలకు అనుగుణంగా రూపొందిస్తున్నారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న మోడళ్లను కూడా తిరిగి కొత్త ఇంజిన్ అప్‌గ్రేడ్‌తో విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో టీవీఎస్ సైతం ఇదే బాటలో పయనిస్తూ జూపిటర్‌లో కొత్త మార్పులు చేసింది.

2025 మార్చి చివరి నాటికి TVS తన మొత్తం టూవీలర్, త్రీవీలర్స్‌ను OBD-2B ప్రమాణాలకు అనుగుణంగా మార్చడానికి ప్రయత్నాలు చేస్తుంది. కొత్తగా వచ్చిన ఈ స్కూటర్‌లో కంపెనీ బాడీ బ్యాలెన్స్ టెక్నాలజీ 2.0 వ్యవస్థను కూడా అందించింది. తక్కువ వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు కంట్రోలింగ్ కోసం ఇది ఉపయోగపడుతుంది. దీనిలో బ్రేకింగ్ కోసం డిస్క్, డ్రమ్ సిస్టంను ఉపయోగించారు. ఇది 113.3 cc, సింగిల్-సిలిండర్, 4-స్ట్రోక్ ఇంజిన్‌తో రన్ అవుతుంది.
2025 మోడల్ TVS జూపిటర్ డ్రమ్ అల్లాయ్ వేరియంట్ ధర రూ. 83,541, డ్రమ్ SXC ధర రూ.87,091, డిస్క్ SXC ధర రూ. 90,016. ఇవన్నీ కూడా ఎక్స్ షోరూమ్ ఢిల్లీ ధరలు. దీని ఇంజిన్ 8 bhp పవర్, 9.8 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మెరుగైన మైలేజ్‌ను అందించడానికి iGO అసిస్ట్‌ను కూడా కలిగి ఉంది. ఇది దాదాపు 53 కి.మీల వరకు మైలేజ్ అందిస్తుంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








