ఫుల్ ట్యాంక్‌తో 700 కిలోమీటర్లు! రూ.59 వేలకే పేద-మిడిల్ క్లాస్ వారికి అదిరిపోయే బైక్

ఇండియాలో పేద, మధ్య తరగతి జనాభాకు బడ్జెట్ ధరలో లభించే, అలాగే మంచి మైలేజ్ అందించే బైకులంటే చాలా ఇష్టం. అలాంటి వాటిలో విడుదల చేయడంలో TVS కంపెనీ ఎప్పుడు కూడా ముందు స్థానంలో ఉంటుంది. ఈ క్రమంలో ఇటీవల స్పోర్ట్ ఈఎస్ ప్లస్ (tvs sport es plus) బైకును మార్కెట్లోకి తీసుకువచ్చింది. 2025 అప్‌డేట్‌లో భాగంగా ఈ బైక్‌ కొత్త రూపంలో కస్టమర్లను ఆకట్టుకునే ఫీచర్స్‌తో వచ్చింది. ధరలో పెద్దగా భారం లేకుండా, సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా రూపొందించబడిన ఈ బైక్ పేద, మధ్య తరగతి వినియోగదారులను ప్రధానంగా లక్ష్యంగా చేసుకుంది. కొత్తగా విడుదలైన ఈ మోడల్ ధర విషయంలో కూడా అందరికీ సానుకూలంగా ఉంటుంది.

ఇది సెల్ఫ్ స్టార్ట్ ES, సెల్ఫ్ స్టార్ట్ ES ప్లస్, ల్ఫ్ స్టార్ట్ ELS అనే మూడు వేరియంట్లలో కొనుగోలు చేయడానికి లభిస్తుంది. ఇది రోజూ ఆఫీస్ వెళ్లే ఉద్యోగులు, విద్యార్థులు, డెలివరీ అవసరాల కోసం ఎంతో సరైన ఆప్షన్‌గా భావించవచ్చు. మునుపటి మోడల్‌తో పోలిస్తే ఇది దేశంలోని అందరకి నచ్చే మోడల్ అవుతుందనంలో ఎలాంటి సందేహం లేదు. దీని గురించిన మరిన్ని వివరాలు కింది కథనంలో చూద్దాం.

Tvs 2025 New Sport Es Plus Bike Price Milegae

డిజైన్ అండ్ కలర్స్: TVS స్పోర్ట్ ES ప్లస్ బైక్ డిజైన్ విషయంలో కంపెనీ చాలా జాగ్రత్తలు తీసుకుంది. ప్రతి వయస్సు గల వారిని ఆకట్టుకునేలా తయారైంది. మునుపటి మోడళ్లతో పోలిస్తే కొత్త గ్రాఫిక్స్ డిజైన్ అట్రాక్టివ్‌గా అనిపిస్తుంది. యూత్‌ఫుల్‌గా కనిపిస్తూ, బైక్‌కు స్పోర్టీ టచ్‌ని అందిస్తూనే, ఫ్రెష్ లుక్‌ను తీసుకొస్తున్నాయి. ఇది గ్రే రెడ్, బ్లాక్ నియాన్ అనే రెండు కలర్స్‌లలో కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటుంది.

ఫీచర్స్: ఇది తక్కువ ధరలో లభిస్తున్నప్పటికి సింప్లిసిటీతో పాటు అవసరమైన అన్ని ఫీచర్లను కలిగి ఉంది. వినియోగదారుల రోజువారీ ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చే లక్ష్యంతో, ఈ బైక్‌లో అనేక ఉపయోగకరమైన అధునాతన సౌకర్యాలను ఇచ్చారు. బైక్ ముందు భాగంలో ఉన్న అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్ ఈ సెగ్మెంట్‌కి తగ్గట్లుగానే డిజైన్ చేయబడింది. ఇది స్పీడోమీటర్, పెట్రోలో ఇండికేటర్ వంటి అంశాలను చూపిస్తుంది.

Tvs 2025 New Sport Es Plus Bike Price

డిజిటల్ డిస్‌ప్లే మాదిరిగా హై టెక్ కాకపోయినా, ఈ ప్యానెల్ ఫంక్షనల్ మాత్రం రైడర్లను అన్ని విషయాల్లోను ఆకట్టుకుంటుంది. బైక్ బరువు దాదాపు 112 కిలోలు. దీనిని నడిపే వారు సులభంగా హ్యాండిల్ చేయగలుగుతారు. ముఖ్యంగా ట్రాఫిక్‌లో ఎక్కువగా ప్రయాణించే వారికిది ఒక పెద్ద ప్లస్ పాయింట్. తక్కువ బరువు ఉన్నప్పటికీ, బైక్ రోడ్‌పై స్థిరంగా, బలంగా కనిపిస్తుంది. ఫ్యూయల్ ట్యాంక్ విషయానికి వస్తే, 10 లీటర్ల వరకు ఉంది.

దీని వలన, ఎక్కువసేపు ట్యాంక్ నింపాల్సిన అవసరం లేకుండా లాంగ్ జర్నీలు కూడా చేయవచ్చు. మైలేజ్ పరంగా టీవీఎస్ స్పోర్ట్ సిరీస్ బైక్స్ వినియోగదారుల నమ్మకాన్ని చాలా కాలంగా పొందుతున్నాయి, కాబట్టి 2025 మోడల్‌ కూడా అదే స్థాయిలో లీటర్ పెట్రోల్‌కు దాదాపు 70 కి.మీల మైలేజ్ ఇస్తుందని తెలుస్తుంది. దీని ప్రారంభ ధర వచ్చేసి రూ. 59,000 నుండి గరిష్టంగా రూ. 71,000(ఎక్స్-షోరూమ్) వరకు అందుబాటులో ఉంది.

ఇంజిన్: 2025 TVS స్పోర్ట్ ES ప్లస్ బైకు 109.7 సీసీ OBD-2B ఇంజిన్‌‌తో రన్ అవుతుంది. ఇది తాజా ఉద్గార నిబంధనలకు అనుగుణంగా రూపొందించినట్లు తెలుస్తుంది. 5-స్పీడ్ గేర్‌బాక్స్‌ను ఇంజిన్‌కు జత చేశారు. ఇది సిటీ రైడింగ్‌కు తగినంత పవర్‌ను అందిస్తూనే, పెట్రోల్‌ను చాలా వరకు ఆదా చేస్తుంది. ఇది రోజూ బైక్‌పై ప్రయాణించే విద్యార్థులు, ఉద్యోగులు మరియు డెలివరీ వ్యక్తులకు నిజంగా ఒక వరంగా నిలుస్తుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, May 7, 2025, 15:40 [IST]
English summary
Tvs 2025 new sport es plus bike price milegae design engine and all top things
Read more on: #tvs motor #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+