పేదవాళ్ళు కూడా కొనగలిగేలా తక్కువ ధరలో టీవీఎస్ నుంచి సరికొత్త బైక్.. బెస్ట్ డేలీ యూజర్ మోడల్..

దేశీయ టూవీలర్ విభాగంలో ప్రముఖ కంపెనీ టీవీఎస్ (TVS) నుంచి విడుదలైన వాహనాలకు ఎప్పటికప్పుడు మంచి డిమాండ్ ఉంటుంది. తక్కువ ధర, మంచి మైలేజ్, నగర, గ్రామీణ ప్రయాణాలకు అనుకూలంగా ఉండటం కారణంగా ఈ కంపెనీ బైకులు, స్కూటర్లకు దేశంలో ఆదరణ లభిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో, టీవీఎస్ మోటార్ కంపెనీ తన పోర్ట్‌ఫోలియోను మరింత బలోపేతం చేయడానికి కొత్త కస్టమర్లను సంపాదించడానికి తాజాగా 2025 స్పోర్ట్ ES+ వేరియంట్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. కొత్త అప్‌డేట్‌లో ప్రధానంగా దీని ఇంజిన్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. దీన్ని OBD-2B నిబంధనలకు అనుగుణంగా రూపొందించారు. దీంతో ఈ బైక్ నుంచి తక్కువ స్థాయిలో కాలుష్య కారకాలు విడుదల అవుతాయి.

దీని ప్రారంభ ధర రూ. 59,881 (ఎక్స్-షోరూమ్), ఇది ఈ బైక్‌ను భారతదేశంలో అతి సరసమైన ఎంట్రీ-లెవల్ కమ్యూటర్లలో ఒకటిగా నిలబెడుతోంది. ఇందులో 109.7cc కెపాసిటీ గల ఎయిర్-కూల్డ్ ఇంజిన్ అమర్చబడింది, ఇది 8.08bhp పవర్, 8.7Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ నాలుగు-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడటం వల్ల, నగర ప్రయాణాల్లో మెరుగైన గేర్ షిఫ్టింగ్ అనుభూతిని అందించగలదు.

Tvs 2025 Sport

సస్పెన్షన్ వ్యవస్థ విషయానికి వస్తే, ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక భాగంలో డ్యూయల్ షాక్ అబ్జార్బర్లు వాడటం వల్ల రైడింగ్ మృదువుగా అనిపిస్తుంది. ఇది ట్యూబ్‌లెస్ టైర్లను కలిగిన అల్లాయ్ వీల్స్‌పై నడుస్తుంది, ఇవి ఇంకా మెరుగైన గ్రిప్, మెయింటనెన్స్ అందిస్తాయి. రోజు వారి ఆఫీసులు, కాలేజ్‌లు, ఇతర పనులకు వెళ్లే వారికి చాలా అనువుగా ఉండటం వలన ఈ బైక్ అందరికి బెస్ట్ డేలీ యూజర్ అవుతుంది.

టీవీఎస్ స్పోర్ట్ ES+ మూడు వేరియంట్లలో వినియోగదారులకు అందుబాటులో ఉంది. సెల్ఫ్ స్టార్ట్ ES, సెల్ఫ్ స్టార్ట్ ES+, సెల్ఫ్ స్టార్ట్ ELS ఆప్షన్లలో కొనుగోలు చేయడానికి లభిస్తుంది. ఇవి అన్నీ వేరువేరు ధరల్లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయి. ప్రారంభ ధర రూ. 59,881 నుండి మొదలై రూ. 71,785 వరకు ఉంటుంది. ఇవన్నీ కూడా ఎక్స్-షోరూమ్ ధరలు. ఆన్‌రోడ్ వచ్చే సరికి మరింత ఎక్కువగా ఉంటాయి.

Tvs 2025 Sport New Es Variant

స్పోర్ట్ ES+ వేరియంట్‌‌ను కస్టమర్లను ఆకట్టుకునేలా రూపొందించారు. ముఖ్యంగా యువతను ఆకర్షించే అంశాలతో దీన్ని తయారు చేయడంలో టీవీఎస్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. వెర్షన్‌లో కొత్త గ్రాఫిక్స్ డిజైన్‌‌‌ కనిపిస్తుంది. ఇది సాధారణ స్పోర్ట్ మోడల్‌తో పోలిస్తే స్పోర్టియర్ లుక్‌ను కలిగి ఉంటుంది. బైక్‌పై డెకల్స్, స్టికర్లు మరింత గమ్మత్తుగా ఉండేలా రూపొందించబడ్డాయి, ఇవి రైడ్ చేసే ప్రతిసారి ప్రత్యేకతను సూచిస్తాయి.

ఈ అప్‌డేట్‌తో TVS స్పోర్ట్ ES+ కేవలం అందిరి దృష్టిని ఆకర్షించే బైక్‌గా నిలుస్తోంది. అదనంగా, ఈ వేరియంట్‌కు బ్రాండ్ రెండు కొత్త కలర్ ఆప్షన్లను జోడించింది. గ్రే రెడ్, బ్లాక్ నియాన్ కలర్స్‌లో నచ్చే విధంగా ఉంటుంది. ఇవి సాధారణ కలర్స్ నుంచి భిన్నంగా ఉండి, స్పోర్టీ లుక్‌ కలిగిస్తాయి. గ్రాఫిక్ పరంగా వినియోగదారులకు కొత్తదనంతో ఈ బైక్ మార్కెట్‌లో మంచి స్పందన పొందే అవకాశం ఉంది.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Monday, May 5, 2025, 15:35 [IST]
English summary
Tvs 2025 sport new es variant launched in india with obd 2b engine details inside
Read more on: #tvs motor #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+