బడ్జెట్ ధరలో స్టైలిష్ బైక్ కొనాలనుకుంటున్నారా? మార్కెట్లోకి వచ్చిన సరికొత్త మోడల్‌పై ఓ లుక్కేయండి

ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీ టీవీఎస్ (Tvs) ఇండియాలో బైక్స్, స్కూటర్స్‌ను విడుదల చేస్తూ, హీరో, హోండా కంపెనీలకు బలమైన ప్రత్యర్థిగా ఉంది. భారతీయ వినియోగదారుల్లో చాలా మంది ఈ కంపెనీకి చెందిన మోడళ్లను వాడుతున్నారు. టీవీఎస్ 100cc నుంచి మొదలుకుని 310cc వరకు పలు బైక్స్‌లను విక్రయిస్తుంది. గత ఏడాదిలో పలు మోడళ్లను తీసుకొచ్చిన కంపెనీ తాజాగా తన ప్రసిద్ధ మోడల్ రోనిన్‌ (Ronin)ను కొత్తగా అప్‌డేట్ చేసి విడుదల చేసింది. ఈ సరికొత్త 2025 టీవీఎస్ రోనిన్ పాత దానికంటే అధునాతనంగా ఉంటుంది. ఆటోమొబైల్ పరిశ్రమలో పోటీ ఎక్కువగా ఉంది. ఇలాంటి సమయంలో దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా పేరున్న టూవీలర్ తయారీదారులు భారతీయ వినియోగాదారులను ఆకట్టుకోడానికి పోటా పోటీగా కోత్త బైక్స్‌ను లాంచ్ చేస్తున్న తరుణంలో టీవీఎస్ తన 2025 రోనిన్ మోడల్‌తో సేల్స్ పెంచుకోనుంది.

2025 రోనిన్ ధర రూ.1.35 లక్షలు. ఇది ఎక్స్‌షోరూమ్ ధర. ఆన్‌రోడ్ అయితే మరింత ఎక్కువగా ఉంది. దీని డ్యూయల్-ఛానల్ ABS కలిగిన మిడ్ వేరియంట్ ధర వచ్చేసి రూ. 1.59 లక్షలు. ఇది కూడా ఎక్స్‌షోరూమ్ ధర. యువతను ఆకట్టుకునే చాలా ఫీచర్స్ ఈ రోనిన్‌లో ఉన్నాయి. ఇది గ్లేసియర్ సిల్వర్, చార్‌కోల్ ఎంబర్ అనే రెండు కలర్ ఆప్షన్లలో కొనుగోలుకు అందుబాటులో ఉంది.

Tvs 2025 Updated Ronin

డ్యూయల్-ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌ను ఇంతకుముందు దీని టాప్‌వేరియంట్‌లో మాత్రమే అందించగా, ఇప్పుడు 2025 మోడల‌్‌లో ఇవ్వడం విశేషం. దీని సీటు చాలా వరకు రీడిజైన్ చేశారు. హెడ్‌లైట్ చుట్టు కొత్త మార్పులు చేశారు. ఇక దీని ఇంజిన్ విషయానికి వస్తే, 225.9cc, ఆయిల్-కూల్డ్, సింగిల్-సిలిండర్ ఇంజిన్‌తో రన్ అవుతుంది. ఇది 20.1bhp పవర్, 19.93Nm గరిష్ట టార్కును ఉత్పత్తి చేస్తుంది. ఐదు-స్పీడ్ గేర్‌బాక్స్‌‌ను ఇంజిన్‌కు జోడించారు.

2025 రోనిన్ ఇంజిన్ పనితీరు మెరుగ్గా ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఇది లీటర్ పెట్రోల్‌కు దాదాపు 42 కిలో మీటర్ల వరకు మైలేజ్‌ను అందిస్తుందని టీవీఎస్ తెలిపింది. ఈ కొత్త బైక్ కస్టమర్లకు అవసరమయ్యే చాలా ఫీచర్స్‌తో వచ్చింది. ముఖ్యంగా బ్లూటూత్ కనెక్టివిటీని కలిగి ఉండే డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను అందించడం విశేషం. దీని రైడింగ్, హ్యాండ్లింగ్ చాలా ఈజీగా ఉంటుంది. సీటు రైడర్లకు చాలా కంఫర్ట్‌గా అనిపిస్తుంది.

2025 Updated Ronin Launched

బైక్ స్పీడ్ తక్కువగా ఉన్నప్పుడు ఇంజిన్ ఆఫ్ కాకుండా ఉండటానికి గ్లైడ్ త్రూ ట్రాఫిక్ ఫంక్షన్‌ను కూడా ఇచ్చారు. ABS సిస్టంతో పాటు, అడ్జస్టబుల్ క్లచ్, బ్రేక్ లివర్‌లు, సైడ్ స్టాండ్ కట్-ఆఫ్ సెన్సార్, చీకట్లో ప్రకాశవంతమైన వెలుతురు అందించే LED హెడ్‌లైట్లు, LED టెయిల్ ల్యాంప్‌లు, LED టర్న్ ఇండికేటర్లు వంటితో పాటు సైలెంట్ స్టార్టర్‌ను కూడా టీవీఎస్ తన 2025 రోనిన్ బైక్‌లో అందించింది.

గుంతలు ఉన్న రోడ్లపై కూడా ఈజీగా వెళ్లడానికి ముందు USD ఫోర్క్స్, వెనుక వైపున మోనోషాక్ సస్పెన్షన్ సెటప్‌ను అందించారు. 2025 రోనిన్ భారతీయ వినియోగదారులను బాగా ఆకట్టుకుంటుందని కంపెనీ భారీ అంచనాలు పెట్టుకుంది. ఇది మార్కెట్లో ఇతర బైక్‌లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

Tvs 2025 Updated Ronin Launched In India All Top Things Details

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Wednesday, February 19, 2025, 9:10 [IST]
English summary
Tvs 2025 updated ronin launched in india price starts from rs 1 35 lakh
Read more on: #tvs #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+