ఒక్కసారి కాదు.. 20 ఏళ్లుగా ప్రేమలో పడేలా చేసిన బ్రాండ్.. 60 లక్షల ఇళ్లకు చేరిన మధుర క్షణాలు

దేశీయ దిగ్గజ టూవీలర్ తయారీ కంపెనీ టీవీఎస్ (Tvs) చాలా ఏళ్లుగా ఇండియాలో ప్రసిద్ధ మోడళ్లను విక్రయిస్తుంది. వాటిలో అపాచీ (Apache) కూడా ఒకటి. టూవీలర్ మార్కెట్లో ఎంట్రీ లెవల్ స్పోర్ట్స్ బైక్ విభాగంలో అమ్మకాల పరంగా మెరుగైన గణంకాలు సాధిస్తుంది. దేశంలో విడుదల అయిన తొలి నాళ్లలోనే గట్టి ఇంపాక్ట్‌ను చూపించింది. అప్పటి బజాజ్ పల్సర్ ప్రభావాన్ని ఎదుర్కొంటూనే, అపాచీ తనదైన వైభవాన్ని పెంచుకుంది. ఇది ప్రతి ఏడాది కొత్త కస్టమర్లను ఆకట్టుకునేలా ఎప్పటికప్పుడు కాలానికి అనుగుణంగా అ‌ప్‌డేట్ అవుతూ వచ్చింది. ఏదో ఒక కొత్త ఫీచర్, మార్కెట్లో ఉండే మిగతా బైక్‌ల కంటే అడుగు ముందుండే టెక్నాలజీతో కనిపిస్తుంది. 160cc నుంచి 310cc వరకు లభిస్తూ ఫ్యూచరిస్టిక్ డిజైన్, స్మార్ట్ టెక్ ఫీచర్స్‌తో భారతీయ వినియోగదారులకు చేరువ అయింది.

2005లో తొలిసారి భారత మార్కెట్లోకి అడుగుపెట్టిన TVS అపాచీ ఇప్పుడు 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. లెజెండ్‌గా మారిపోయిన అపాచీ, భారత మార్కెట్‌ను మాత్రమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా 60కి పైగా దేశాల్లో తన ముద్ర వేసింది. రెండు దశాబ్దాల ప్రయాణంలో, అపాచీ 60 లక్షల(6 మిలియన్ల) యూనిట్ల అమ్మకాలను దాటి, ఓ అద్భుతమైన మైలురాయిని తాకింది. ఇది ప్రజల్లో అపాచీ మీద ఉన్న నమ్మకం, అభిమానానికి నిదర్శం అని చెప్పవచ్చు.

TVS Apache 20 Years

అపాచీకి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 60 లక్షల మంది కస్టమర్లు ఉన్నారు. 2005లో టీవీఎస్ ప్రారంభించిన అపాచీ 150 భారతీయ మోటార్‌సైకిల్ మార్కెట్‌లో ఓ మైలురాయిగా నిలిచింది. ఈ బైక్ లాంచ్‌తోపాటే, పెర్ఫార్మెన్స్ బైక్స్‌పై ఉన్న ఊహలను పూర్తిగా మార్చేసింది. అప్పటి వరకు మనదేశంలో ఎక్కువగా మైలేజ్ బైక్స్‌కి మాత్రమే డిమాండ్ ఉండగా, అపాచీ యువతలో కొత్త ఉత్సాహాన్ని రేపింది. చాలా మంది యువత ఈ బైక్‌ను కొనుగోలు చేయడానికి ఎగబడ్డారు.

ప్రస్తుతం టీవీఎస్ అపాచీ శ్రేణిలో ఆర్‌టిఆర్ (సిటీ రైడింగ్‌కు అనుకూలమైన స్ట్రీట్ పెర్ఫార్మెన్స్ మోడల్స్, ఆర్‌ఆర్ (రేసింగ్ ట్రాక్‌లను టార్గెట్ చేసే హైపెర్ఫార్మెన్స్ మోడల్స్) అనే రెండు సిరీస్‌లు ఉన్నాయి. ఈ రెండు సెగ్మెంట్లు కూడా టీవీఎస్ రేసింగ్‌కు చెందిన 43 ఏళ్ల మోటార్‌స్పోర్ట్స్ అనుభవాన్ని తన ఉత్పత్తుల్లో ప్రతిబింబించాయి. ఇది రోడ్డుపై వినూత్నమైన స్టైల్‌తో దూసుకెళ్తూ చూసినవారిని ఆకట్టుకునేలా ఉంటుంది.

TVS Apache Achieves 60 Lakh Sales

అపాచీ RTR సిరీస్‌ ప్రత్యేకమైన అభిమానులను సంపాదించుకుంది. ఇది కేవలం వేగం మాత్రమే కాదు, టెక్నాలజీ పరంగా కూడా కొత్త కస్టమర్లకు బాగా సంపాదించుకుంది. ఇది చాలా ఫీచర్స్‌ను కలిగి ఉంది. స్లిప్పర్ అసిస్ట్ క్లచ్ అందించిన స్మూత్ గేర్ షిఫ్టింగ్, SmartXConnect టెక్నాలజీ, కాల్ నోటిఫికేషన్ల వరకూ అన్నీ బైక్ డిస్ప్లేలో కనిపిస్తాయి. బ్రేకింగ్ విషయానికి వస్తే, డ్యూయల్ ఛానల్ ABSతో రైడర్లకు మరింత సేఫ్టీ అందిస్తుంది.

టీవీఎస్ అపాచీ 2025 ఆర్థిక సంవత్సరంలో అమ్మకాల 4 లక్షల యూనిట్ల మార్కును దాటింది. 2025 ఆర్థిక సంవత్సరం మొదటి 11 నెలల్లో అపాచీ ఈ ఘనతను సాధించడం విశేషం అని చెప్పాలి. 2019 ఆర్థిక సంవత్సరం తర్వాత, అపాచీ మళ్లీ గొప్ప మైలురాయిని అధిగమించింది. ఇది రెండోసారి ఇదే స్థాయికి చేరడం విశేషం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో, టీవీఎస్ మోటార్స్‌లో అత్యధికంగా విక్రయమైన మోడల్‌గా అపాచీ సిరీస్ నిలిచింది.

TVS Apache Achieves 60 Lakh Sales Milestone In 20 Years Details

150 సీసీ నుంచి 200 సీసపీ మధ్య విభాగంలో అపాచీ ప్రభావం ఎక్కువగా ఉంది. దాదాపు 40 శాతం మార్కెట్ వాటాతో, ఈ విభాగంలో టీవీఎస్ తన ఆధిపత్యాన్ని మరింత పెంచుకుంది. ఇది కేవలం విక్రయాల గణాంకం మాత్రమే కాదు, ఇది ఓ బ్రాండ్ పట్ల వినియోగదారులు చూపిస్తున్న నమ్మకానికి నిదర్శనం.

More from DriveSpark

Article Published On: Saturday, April 5, 2025, 7:30 [IST]
English summary
Tvs apache achieves 60 lakh sales milestone in 20 years more details here
Read more on: #tvs motor #tvs apache #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+