ఈ బైక్ కోసం కస్టమర్లు క్యూ కట్టారు.. అదరగొట్టిన TVS Apache.. మొత్తం సేల్స్ ఎన్నంటే?

ప్రముఖ టూవీలర్ తయారీదారు (టీవీఎస్) TVS కంపెనీకి చెందిన అపాచీ (apache) అంటే దేశంలో చాలా మందికి ఇష్టమైన మోడల్. ఇది కేవలం ఒక బైకుగా కాకుండా, ప్రీమియం సెగ్మెంట్‌లో ఒక ప్రత్యేక గుర్తింపు పొందిన బ్రాండ్‌గా ఎదిగింది. ఇప్పుడు, ఈ అపాచీ తన మార్కెట్ ప్రాచుర్యాన్ని మరోసారి నిరూపించుకుంది. 2025 ఏప్రిల్‌ నెలలో, అపాచీ సిరీస్ దేశీయంగా 45,633 యూనిట్ల అమ్మకాలను సాధించింది. ఇదే సమయంలో, గత సంవత్సరం అంటే 2024 ఏప్రిల్‌లో 45,520 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ రెండు సంఖ్యల మధ్య గణనీయమైన తేడా లేకపోయినా, ఇది దాదాపు 0.25 శాతం పెరుగుదలను సాధించింది. మరో విషయం ఏమిటంటే ఏప్రిల్ 2025లో టాప్ 10గా నిలిచిన బైకుల జాబితాలో, టీవీఎస్ అపాచీ నాల్గవ స్థానాన్ని ఆక్రమించింది.

అమ్మకాల నివేదిక ప్రకారం, జాబితాలో హీరో స్ప్లెండర్ మొదటి స్థానంలో నిలవగా, హోండా షైన్ రెండవ స్థానాన్ని, బజాజ్ పల్సర్ మూడవ స్థానాన్ని పొందాయి. ఈ నేపథ్యంలో టీవీఎస్ అపాచీ నాలుగవ స్థానంలో నిలవడం గొప్ప విషయం. ఇది ఏక కాలంలో బైక్‌కి ఉన్న డిమాండ్‌ను, అలాగే వినియోగదారుల నమ్మకాన్ని వెల్లడిస్తుంది. మార్కెట్లో నిత్యం కొత్త మోడళ్లు, అప్‌డేట్లు వస్తున్నా కూడా, అపాచీ స్థిరంగా తన స్థానం నిలబెట్టుకోవడం గమనార్హం.

Tvs Apache Motorcycle April 2025 Sales 45 633 Recorded

ఇది ప్రధానంగా బైక్ డిజైన్, పనితీరుకి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అపాచీ ఎప్పటికప్పుడు కొత్త వేరియంట్ల ద్వారా మార్కెట్‌కు అనుగుణంగా మారుతూ వస్తోంది. కేవలం వేగానికి పరిమితం కాకుండా, ప్రతి రైడర్‌కి ఒక అనుభూతిని ఇస్తూ, యువ హృదయాల్లో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. అందుకే, రోజు రోజుకీ టీవీఎస్ అపాచీకి ఆదరణ పెరుగుతూనే ఉంది. మే నెలలోనూ అదే స్థాయిలో, లేదా అంతకన్నా ఎక్కువగా అమ్మకాలు జరగబోతాయని అంచనాలు ఉన్నాయి.

టీవీఎస్ అపాచీ పలు వేరియంట్లలో కొనుగోలు చేయడానికి లభిస్తుంది. వాటిలో ప్రత్యేకంగా ప్రస్తావించదగ్గది TVS Apache RTR 160.దీని ధర రూ. 1.11 లక్షల నుంచి 1.31 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది, ఇది తీసుకునే వేరియంట్‌పై ఆధారపడి ఉంటుంది. 160cc సెగ్మెంట్‌లో ఇది ఒక స్టైల్ ఐకాన్ లాగా నిలుస్తోంది. ఈ బైక్‌లో 159.7cc పెట్రోల్ ఇంజిన్ ఉంది, ఇది 47 కిలోమీటర్ల మైలేజీ వరకూ అందించగలదు.

Apache Motorcycle April 2025 Sales 45 633

రైడింగ్‌ను మరింత స్మార్ట్‌గా మార్చేలా ఇందులో డిజిటల్ కన్సోల్, బ్లూటూత్ కనెక్టివిటీ, మరెన్నో లేటెస్ట్ ఫీచర్లు ఉన్నాయి. ఇవన్నీ కస్టమర్లను ఎక్కువగా ఆకర్షించే అంశాలే. Apache RTR 200 4V బైక్, స్పోర్టీ డిజైన్‌తో పాటు అధిక పనితీరును కోరుకునే యువత కోసం రూపొందించబడింది. దాని ధర రూ. 1.46 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇందులో 197.75 సీసీ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది, ఇది లీటరుకు 37 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది.

ఈ మోడల్‌లో పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, రైడ్ మోడ్స్, గేర్‌షిఫ్ట్ ఇండికేటర్, స్మార్ట్ కనెక్టివిటీ, వంటి ఫీచర్లు ఉన్నాయి. TVS Apache RR 310 ప్రీమియం బైక్ కొనాలనుకునే వారికి బెస్ట్. దీని ధర రూ. 2.78 లక్షల నుండి రూ. 3 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్). ఇందులో 312.2 సీసీ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 34 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.

Tvs Apache Motorcycle

Apache RTR 310 రోజు ప్రయాణాలకు అనువైన మోడల్. దీని ధర రూ. 2.50 లక్షల నుండి రూ. 2.72 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. ఇందులో 312.12 సీసీ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది, ఇది సుమారు 35 kmpl మైలేజీని అందిస్తుంది. ఈ బైక్‌కు TFT డిజిటల్ డిస్‌ప్లే, బై-డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్, సైడ్ స్టాండ్ ఇన్‌హిబిటర్ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Friday, May 30, 2025, 17:20 [IST]
English summary
Tvs apache motorcycle april 2025 sales 45 633 recorded more details inside
Read more on: #tvs motor #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+