ఐక్యూబ్ vs ఆర్బిటర్.. ఎవరిది ఎక్కువ రేంజ్? ఎవరిది తక్కువ ధర? రెండింటి మధ్య టఫ్ ఫైట్!
దిగ్గజ టూవీలర్, త్రీవీలర్ వాహనాల తయారీదారు టీవీఎస్ మోటార్ కంపెనీ (TVS) ఎప్పటి నుంచో తన ఐసీఈ ఇంజిన్ ఆధారిత వాహనాలతో వినియోగదారుల మనసు గెలుచుకుంటూ వస్తోంది. స్కూటర్లు, బైకులు, ఆటో రిక్షాల వరకు విస్తరించిన మోడల్స్‌తో ఈ కంపెనీకి భారతీయ మార్కెట్లోనే కాదు, అంతర్జాతీయ స్థాయిలో కూడా విశేషమైన స్థానం ఏర్పడింది. అయితే కాలానుగుణంగా మారుతున్న ఆటోమొబైల్ రంగంలో, ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ పెరుగుతున్న తరుణంలో, టీవీఎస్ కూడా తన దృష్టిని ఈవీ సెగ్మెంట్‌పై మరింత కేంద్రీకరించింది. ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న టీవీఎస్ iQube ఎలక్ట్రిక్ స్కూటర్ మంచి రిస్పాన్స్ తెచ్చుకుంది. సిటీ రైడ్స్‌కి సరిపోయే రేంజ్, ఫ్యామిలీ ఫ్రెండ్లీ డిజైన్, కనెక్టివిటీ ఫీచర్లతో ఇది మిలీనియల్స్ నుంచి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వరకు అందరినీ ఆకట్టుకుంది.
ఈ సక్సెస్ తర్వాత, టీవీఎస్ తన ఎలక్ట్రిక్ పోర్ట్‌ఫోలియోను మరింత బలపరిచే క్రమంలో తాజాగా ఆర్బిటర్ (Orbiter) అనే కొత్త ఈవీ స్కూటర్‌ను విడుదల చేసింది. ఈ రెండు కంపెనీకి కీలకమైన మోడళ్లు. ఐక్యూబ్, ఆర్బిటర్ పేద, మధ్యతరగతి వినియోగదారుల కోసం అందుబాటు ధరలోనే కొనుగోలు చేయడానికి లభిస్తున్నాయి. రోజువారి ప్రయాణ ఖర్చలను ఇవి తగ్గించడంలో ప్రజలకు తోడ్పాటు అందిస్తాయి. ఈ రెండింటి గురించి వివరంగా ఈ కథణంలో చూద్దాం.

iQube స్కూటర్: ఇది 2020లో తొలిసారి లాంచ్ కాగా, అప్పటినుంచే వినియోగదారుల్లో ఆసక్తిని రేకెత్తించింది. ప్రధానంగా సిటీ కోసం డిజైన్ చేయబడిన ఈ స్కూటర్, ఎలక్ట్రిక్ వాహనం కావడం వల్ల తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులు, సైలెంట్ రైడ్ అనుభవం, ఆధునిక టెక్నాలజీ వంటి అంశాలను అందిస్తోంది. ఇది 2.2 kWh , 3.1 kWh, ఎక్కువ రేంజ్‌కు 3.5 kWh, అధిక అవసరాల కోసం 5.3 kWh వెర్షన్‌లో లభిస్తుంది.
TVS iQube 3.1 kWh వెర్షన్ స్కూటర్ రూ.1.05 లక్షల ఎక్స్-షోరూమ్ ఢిల్లీ ధరకు లభిస్తుంది. దీనిలో అమర్చిన బ్యాటరీ ప్యాక్‌ను పూర్తి ఛార్జ్ చేస్తే, గరిష్టంగా 121 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. బ్యాటరీ ఛార్జింగ్ పరంగా చూస్తే, ఈ స్కూటర్‌కి 80 శాతం ఛార్జ్ అయ్యేందుకు సుమారుగా 2 గంటల 45 నిమిషాల సమయం పడుతుంది. అంటే ఉదయం మీ పనులు చూసుకునే లోపే స్కూటర్ రెడీ అయిపోతుంది.

Orbiter స్కూటర్: ఆర్బిటర్ తాజాగా విడుదల అయింది. దీనిలో 3.1 kWh బ్యాటరీ ప్యాక్ అమర్చారు. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేసినట్లయితే 158 కి.మీల రేంజ్‌ను అందిస్తుంది. దీని ధరను రూ.99,900 (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. ఇది కూడా కనెక్టెడ్ మొబైల్ యాప్, ముందు LED హెడ్‌ల్యాంప్‌తో కూడిన వైజర్, బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్ వంటి ఫీచర్లతో పేద, మధ్య తరగతి ప్రజలకు ఇది బెస్ట్ అవుతుంది.
పరిశ్రమలో తొలిసారిగా 14 అంగుళాల ముందు చక్రాన్ని పొందింది ఈ స్కూటర్. లాంగ్ ప్రయాణాలు కూడా దీనితో ఈజీగా ఉంటాయి. రివర్స్ పార్కింగ్ అసిస్ట్, ఆటోమేటెడ్ హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి ఫీచర్లు కూడా జాబితాలో ఉన్నాయి. రైడర్, పిలియన్ ఇద్దరికీ సౌకర్యవంతంగా కూర్చోడానికి వీలయ్యేలా సీట్ డిజైన్ చేయబడింది. ప్రత్యేకంగా చెప్పాలంటే ఇది పోడవుగా ఉంటుంది. ఇది చాలా స్మూత్‌గా సౌకర్యవంతమైన రైడింగ్ అనుభవాన్ని ఇస్తుంది.



Click it and Unblock the Notifications








