కొంటే ఆ స్కూటర్లు మాత్రమే కొనాలంటున్న జనాలు.. ఆ కంపెనీకి ఏకంగా 79 శాతం లాభాలు!

టూ-వీలర్స్ తయారీ సంస్థల్లో అందరికీ సుపరిచితమైన బ్రాండ్ టీవీఎస్. ఈ సంస్థ నుంచి ఇప్పటికే అనేక బైకులు, స్కూటర్లు ఎన్నో ఏళ్లుగా కస్టమర్స్‌ను ఆకట్టుకుంటూనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఆధునాతమైన ఫీచర్లు, కొత్త కొత్త డిజైన్లతో వస్తున్న ద్వి చక్రవాహనాలు... దేశంలోని రోడ్లపై తరతరాలుగా చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఎప్పటిలానే 2024లోనూ టీవీఎస్ సంస్థ సేల్స్‌లో అదరగొట్టింది. డిసెంబరులో ఈ సంస్థ మొత్తం వాహనాల అమ్మకాల్లో 7 శాతం వృద్ధి సాధించింది. ఒక్క ఈవీల్లోనైతే ఏకంగా 79 శాతం వృద్ధి నమోదు చేసింది. ఇటీవలె టీవీఎస్ మోటార్ సంస్థ ప్రకటించిన 2024 డిసెంబర్ సేల్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

గత నెలలో( డిసెంబర్ 2024) టీవీఎస్ సంస్థ (దేశీయ అమ్మకాలు- ఎగుమతులు కలిపి) 3,21,687 యూనిట్ల వాహనాలను విక్రయిచింది. ఇందులో టూ వీలర్స్, త్రీ వీలర్స్ రెండూ ఉన్నాయి. 2023లో ఇదే నెలో జరిగిన 3,02,898 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే.. ఇది 7 శాతం అధికం కావడం గమనార్హం. అందువల్ల ఈ కంపెనీ జెట్‌ స్పీడ్‌లో దూసుకెళ్తుంది.

TVS iQube Sales in December 2024

ఒక్క టూ- వీలర్స్ వాహనాల అమ్మకాలను మాత్రమే పరిశీలించినా.. 2024లో టీవీఎస్ సంస్థ మంచి పురోగతి సాధించింది. మొత్తం 3,12,002 యూనిట్ల టూ- వీలర్ వాహనాలను సేల్ చేసిందీ సంస్థ. వీటిలో బైకులతో పాటు స్కూటర్లు కూడా ఉన్నాయి. ఇది 2023 డిసెంబరుతో పోలిస్తే 8 శాతం అధికం. దేశంలోనే 2,90,064 యూనిట్ల వాహనాల అమ్మకాలు జరిగాయి.

ఇక 2024 డిసెంబరులో టీవీఎస్ సంస్థ నుంచి విదేశాలకు ఎగుమతి చేసిన వాహనాల సంఖ్య కూడా పెరిగింది. 1,04,393 వాహనాలను వివిధ దేశాలకు ఈ సంస్థ ఎగుమతి చేసింది. 2023లో చూస్తే.. 85,391 యూనిట్ల వాహనాలు ఎగుమతి అయ్యాయి. 2023తో పోలిస్తే 2024లో టీవీఎస్ సంస్థ ఎగుమతుల్లో 22 శాతం వృద్ధి కనబర్చింది. ఇక డిసెంబర్‌లో 9,685 యూనిట్ల త్రీ వీలర్స్ వాహనాలు సేల్ చేసింది టీవీఎస్ సంస్థ.

TVS EV Scooters

మరోవైపు... ఈవీ అమ్మకాల్లోనూ టీవీఎస్ తగ్గేదేలే అన్నట్లుగా సాగింది. ఈ సంస్థ నుంచి గత నెలలో 20,171 యూనిట్ల ఈవీలు అమ్ముడయ్యాయి. 2023 డిసెంబరులో 11,288 యూనిట్లతో పోలిస్తే..‌ ఇది ఏకంగా 79శాతం వార్షిక వృద్ధి నమోదు చేసింది. ఈవీలో టీవీఎస్‌ ఐక్యూబ్‌ స్కూటర్‌తో దుమ్మురేపుతోంది. మొత్తం అమ్మకాల్లోనే టీవీఎస్‌ ఈవీ టాప్‌ 3లో కొనసాగుతుంది.

ఇక ఈ సంస్థ నుంచి ఐక్యూబ్ ఇ- స్కూటర్.. ఈవీ అమ్మకాల్లో టీవీఎస్ మంచి ఫలితాలను రాబట్టడానికి మరో ముఖ్య కారణంగా చెప్పవచ్చు. భారత మార్కెట్లో టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్.. రూ.1.07 లక్షల నుంచి రూ.1.37 లక్ష్లల(ఎక్స్- షోరూమ్‌ ధర) మధ్యలో అందుబాటులో ఉంది.

TVS iQube EV Scooter Price

ఈ స్కూటర్‌ 2.2 kWh, 3.4 kWh, 5.1kWH బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్‌తో ఈ స్కూటర్ అందుబాటులో ఉంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 75 నుంచి 150 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. ఇది మంచి బిల్డ్‌ క్వాలిటీతో పాటు, భారీ స్టోరేజ్‌ స్పేస్‌, అధునాతన ఫీచర్లను కలిగి ఉంది. అందువల్ల జనాలు ఈ స్కూటర్‌కి జై కొడుతున్నారు.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Saturday, January 4, 2025, 8:22 [IST]
English summary
Tvs iqube achieved record sales in december 2024 check full details here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+