ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై ఫ్లిప్‌కార్ట్ భారీ ఆఫర్.. ఇంట్లోంచి ఇబ్బంది లేకుండా కొనేయొచ్చు!
పెట్రోల్‌తో నడిచే స్కూటర్ల కంటే ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనేందుకు ఈ మధ్య కాలంలో వినియోగదారులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అనేక స్టార్టప్ సంస్థలు ఇప్పటికే ఎలక్ట్రిక్ స్కూటర్లతో మార్కెట్లో దూసుకుపోతున్నాయి. మరోవైపు దిగ్గజ సంస్థలు.. కూడా ఈవీల తయారీకి ముందుకు వస్తున్నాయి. ఈవీ సెగ్మెంట్‌లో టీవీఎస్ సంస్థ.. మంచి పేరు సంపాదించింది. టీవీఎస్ ఐక్యూబ్.. ఇ-స్కూటర్ ఈ కంపెనీకి మంచి లాభాలు తెచ్చిపెట్టింది. తాజాగా ఈ స్కూటర్‌పై ఇ- కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. రూ. లక్షకు పైగా విలువ చేసే ఈ వాహనాన్ని రూ.86 వేలకే కొనుగోలు చేయవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.
జనవరి 13 నుంచి 19 వరకు కొనసాగుతున్న ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్స్‌లో ఈ ఇ-స్కూటర్‌ని చాలా తక్కువ ధరకే ఇంటికి తెచ్చుకోవచ్చు. దీనిపై ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయి. చాలా రోజుల నుంచి ఈవీ కొనుగోలు చేయాలనుకునేవారికి ఈ ఆఫర్ మంచి అవకాశమని చెప్పవచ్చు. ఈ ఆఫర్ ద్వారా ఈ ఐక్యూబ్ ఇ-స్కూటర్‌ను ఎవ్వరూ ఊహించని విధంగా కేవలం రూ. 86,000 లకే కొనుగోలు చేయవచ్చు.

టీవీఎస్ ఐక్యూబ్ అసలు ధర రూ.1,07,299గా ఉంది. ఇప్పుడు ఈ ఆఫర్‌తో రూ. 86,749కే ఈ స్కూటర్‌ను ఇంటికి తెచ్చుకోవచ్చు. ఓన్లీ ఫర్ యూ డీల్ కింద ఫ్లిప్‌కార్ట్ సంస్థ రూ.5,000 వరకు డిస్కౌంట్ అందిస్తోంది. అంతేగాకుండా... వివిధ పేమెంట్ ఆప్షన్ల ద్వారా కూడా డబ్బులను సేవ్ చేసుకోవచ్చు. దీంతో తక్కువ ధరకే స్కూటర్ లభిస్తుంది.
అదెలా అంటే.. క్రెడిట్ కార్డ్ పేమెంట్స్‌పై రూ.5,115 డిస్కౌంట్ అందుతుంది. అలాగే సెలెక్డెట్ క్రెడిట్ కార్డులపై EMI స్కీమ్ ద్వారా రూ.3,250 రీబేట్ ఉంటుంది. ఈ డిస్కౌంట్‌లన్నీ కలిపితే టీవీఎస్ ఐక్యూబ్ 2.2 kWh వేరియంట్ కేవలం రూ.86,749 కే వస్తుంది. ఇది ఎంట్రీ లెవెల్ మోడల్ అయినప్పటికీ.. రోజూవారీ అవసరాల కోసం బాగా ఉపయోగపడే ఎలక్ట్రిక్ వాహనంగా చెప్పవచ్చు.

దీని పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. బ్యాటరీతో అనుసంధానించిన దీని ఎలక్ట్రిక్ మోటార్ 4 bhp, 33 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. టీవీఎస్ సంస్థ ప్రకారం ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్ఠంగా 75 kmph వేగంతో ప్రయాణిస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఈ స్కూటర్ 75 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. దీని బ్యాటరీని కేవలం 2.45 గంటల్లోనే 0 నుంచి 80 శాతం ఛార్జ్ చేయవచ్చు.
ఈ స్కూటర్‌లో 5- అంగుళాల TFT స్క్రీన్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్, 30 లీటర్స్ అండర్ సీట్ స్టోరేజీ, వెహికిల్ క్రాష్, టౌ అలర్ట్స్(Tow alerts), టర్న్ బై టర్న్ నేవిగేషన్, పార్క్ అసిస్ట్, USB ఛార్జింగ్ పోర్ట్, రిమోట్ ఛార్జింగ్ స్టేటస్ సహా ఇతర కనెక్టెడ్ ఫీచర్లు ఇందులో ఉంటాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మెకానికల్ గానూ స్ట్రాంగ్‌గా ఉంటుంది.

ఈ స్కూటర్ 220 mm ఫ్రంట్ డిస్క్, 130 mm రియర్ డ్రమ్ బ్రేక్స్‌తో వస్తుంది. ఈ స్కూటర్ 157 మి.మీ.ల గ్రౌండ్ క్లియరెన్స్‌తో ఉంటుంది. దీని సీటు ఎత్తు 770 మి.మీ.లుగా ఉంటుంది. Walnut Brown and Pearl White అనే రెండు రంగుల్లో ఈ స్కూటర్ అందుబాటులో ఉంది.
డ్రైవ్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








