ఆఫీస్‌కు, షాపింగ్, పిల్లల్ని డ్రాప్ చేయడానికి బెస్ట్.. గత నెలలో ఎంతమంది కొన్నారో తెలుసా?

టీవీఎస్ మోటార్(Tvs Motor) కంపెనీ భారత్‌లో ప్రముఖ టూవీలర్ తయారీదారుగా ఉంది. అందరికి అందుబాటు ధరలో, అతి తక్కువ ధరలో బైకులు, స్కూటర్లను విక్రయిస్తూ హీరో, హోండా వంటి కంపెనీలకు బలమైన పోటీదారుగా నిలుస్తుంది. అమ్మకాల పరంగా కూడా టీవీఎస్ దూసుకుపోతుంది. దీనికి నిదర్శనంగా జూన్ 2025లో సాధించిన సేల్స్ గణాంకాలు పరిశీలిస్తే, మార్కెట్లో తన స్థిరతను మరోసారి నిరూపించుకున్నట్లు కనిపిస్తోంది. జూన్ 2024తో పోల్చితే, ఈసారి టీవీఎస్ తన అమ్మకాలలో 9.89 శాతం వృద్ధిని సాధించింది. జూన్ 2025 నెలలో కంపెనీ మొత్తం 2,81,012 యూనిట్ల విక్రయాలతో గణనీయమైన పురోగతిని నమోదు చేసింది. అంటే గతేడాది ఇదే నెలలో విక్రయించిన 2,55,723 యూనిట్ల కంటే 25,289 యూనిట్లు ఎక్కువ అమ్ముడయ్యాయి.

అయితే, ఇదే సమయంలో మే 2025తో పోల్చితే అమ్మకాల్లో కొంత వెనకడుగు పడిన విషయం కూడా గమనించాల్సిందే. మే నెలలో కంపెనీ మొత్తంగా 3,09,287 యూనిట్లను విక్రయించగా, అదే జూన్‌లో సంఖ్య 9.14 శాతం తగ్గింది. సీజనల్ ప్రభావం, మార్కెట్ డైనమిక్స్ వల్ల ఈ తేడా వచ్చినట్లు భావించవచ్చు. కొన్ని మోడళ్లు ఆశించిన మేరకు సేల్స్ సాధించినప్పటికి మరికొన్ని మాత్రం ఆకట్టుకోలేకపోయాయి. వాటిలో iQube ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా ఒకటి.

Tvs iQube Price

టీవీఎస్ మోటార్ నుంచి ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్‌గా విడుదలైనటువంటి ఐక్యూబ్ మార్కెట్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ, జూన్ 2025 అమ్మకాల గణాంకాలను చూస్తే కొంత వెనకడుగు పడినట్లు స్పష్టమవుతోంది. ఈ నెలలో ఐక్యూబ్ 14,244 యూనిట్ల అమ్మకాలు సాధించింది. అయితే ఇదే మోడల్ గత ఏడాది జూన్ 2024లో 15,210 యూనిట్లు విక్రయించగా, 966 యూనిట్ల తేడాతో అమ్మకాల్లో 6.35 శాతం తగ్గుదల కనిపించింది.

ఇది ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో పోటీ ప్రభావం లేదా కొనుగోలుదారుల ప్రాధాన్యతల్లో మార్పు అయినా కావచ్చు. పెరుగుతున్న పోటీ, కొత్త మోడళ్ల ఆవిర్భావం వంటి కారణాలు కూడా ఈ తగ్గుదల వెనక ఉండే అవకాశముంది. అయితే, ఈ తాత్కాలిక తగ్గుదల అని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. మార్కెట్‌లో టీవీఎస్ iQube‌కి మంచి స్థానం ఉంది. తద్వారా ఇది తిరిగి అమ్మకాల పరంగా బలంగా రాణించే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పవచ్చు.

Tvs iQube June Sales

Tvs iQube‌ మార్కెట్లో నాలుగు విభిన్న బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో కొనుగోలు చేయడానికి లభిస్తుంది. ఇటీవల 3.1 kWh బ్యాటరీ ప్యాక్‌‌‌తో కూడిన 2025 మోడల్‌ను కూడా విడుదల చేశారు. దీంతో ఈ స్కూటర్ సాధారణ ఉపయోగానికి సరిపడే స్థాయిలో 2.2 kWh , 3.1 kWh, మరింత ఎక్కువ రేంజ్ కోసం 3.5 kWh, అలాగే అధిక శక్తి అవసరాలకోసం 5.3 kWh వెర్షన్‌లో లభిస్తుంది.

TVS iQube కొత్త 3.1 kWh వెర్షన్ గురించి చూసినట్లయితే మధ్యతరగతి కుటుంబాలకు సరిపోయే ధర, ప్రాక్టికల్ ఫీచర్లు, సరైన రేంజ్ అన్నట్లుగా టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కనిపిస్తోంది. ఈ స్కూటర్ రూ.1.05 లక్షల ఎక్స్‌-షోరూమ్ ధరకు లభించడం, బడ్జెట్‌ను దాటి పోకుండా ఒక లగ్జరీ అనుభవాన్ని అందించగలగడం ఇది ప్రత్యేకత. ఇది రోజువారీ అవసరాలన్నింటికీ సరిపోతుంది.

Tvs iQube Electric Scooter

బ్యాటరీ ఛార్జింగ్ పరంగా చూస్తే, ఈ స్కూటర్‌కి 80 శాతం ఛార్జ్ అయ్యేందుకు సుమారుగా 2 గంటల 45 నిమిషాల సమయం పడుతుంది. అంటే ఉదయం మీ పనులు చూసుకునే లోపే స్కూటర్ రెడీ అయిపోతుంది. పూర్తి ఛార్జ్ చేస్తే, గరిష్టంగా 121 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. ఆఫీస్‌కు వెళ్లడం, షాపింగ్, పిల్లల్ని డ్రాప్ చేయడం, లేదా చిన్నచిన్న పనులకి చుట్టూ తిరగడం వంటి వాటికి పర్‌ఫెక్ట్.

More from DriveSpark

Article Published On: Wednesday, July 30, 2025, 14:38 [IST]
English summary
Tvs iqube electric scooter june 2025 sales recorded 14244 units details
Read more on: #tvs motor #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+