ఫ్యామిలీకి సరిపోయే కొత్త స్కూటర్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 121 కిలోమీటర్లు.. టీవీఎస్ ఐక్యూబ్ 2025 న్యూ వెర్షన్
టీవీఎస్ మోటార్ కంపెనీ నుంచి విడుదలైన ప్రముఖ వాహనాల్లో ఐక్యూబ్ (iQube) ఎలక్ట్రిక్ స్కూటర్ ఒకటి. ఇప్పటికే దీనిని వేలాది మంది వినియోగదారులు ఎటువంటి పెద్ద ఫిర్యాదులు లేకుండా దీన్ని రోజువారి అవసరాల కోసం ఉపయోగిస్తుండటం గమనార్హం. సాధారణ టూవీలర్ల మాదిరిగాకుండా, ఇది సౌకర్యం, సాంకేతికత, సామర్థ్యం, అన్నింటిని సమానంగా కలగలిపి మార్కెట్లో మంచి ఆదరణ సంపాదిస్తుంది. అయితే టీవీఎస్ దీన్ని మరింత మంది వినియోగదారులకు చేరువచేయడానికి తాజాగా 2025 ఎడిషన్ iQube ఎలక్ట్రిక్ స్కూటర్‌ను భారత మార్కెట్లో పరిచయం చేసింది. పాత దానితో పోలిస్తే, ఈ కొత్త మోడల్‌లో అనేక ఫీచర్స్ ఉన్నాయి. ప్రధానంగా ఈ స్కూటర్‌లో 3.1 kWh బ్యాటరీ ప్యాక్‌ను అందించి విడుదల చేశారు. మధ్యతరగతి కుటుంబాలకి అందుబాటులో ఉండే ధరలో రూ.1.05 లక్షల ఎక్స్ షోరూమ్ ధరకు దీన్ని తీసుకొచ్చింది.
ఈ తాజా వేరియంట్ రాకతో, TVS iQube ఇప్పుడు వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా నాలుగు విభిన్న బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో కొనుగోలు చేయడానికి లభిస్తుంది. వీటిలో 2.2 kWh సాధారణ ఉపయోగానికి సరిపడే స్థాయి, 3.1 kWh కొత్త ఆప్షన్, 3.5 kWh మరింత ఎక్కువ రేంజ్ కోసం, అలాగే అధిక శక్తి అవసరాలకోసం 5.3 kWh వెర్షన్ ఉన్నాయి. ఈ స్కూటర్ ప్రతి యూజర్‌కు సరైన ఎంపిక అవుతుంది.

TVS iQube కొత్త 3.1 kWh వెర్షన్ బేస్ వేరియంట్‌తో పోలిస్తే సుమారుగా రూ. 12,000 ఎక్కువ ధరలో వస్తుంది. అయితే టాప్ వేరియంట్‌తో పోలిస్తే దాదాపు రూ. 21,000 తక్కువగా ఉండటం గమనార్హం. ఈ విధంగా, తక్కువ ఖర్చుతో ప్రయోజనాన్ని కోరే వినియోగదారులకు ఇది బెస్ట్. రెంజ్ పరంగా ఈ కొత్త వేరియంట్ తన సత్తా చాటుతోంది. పూర్తి ఛార్జ్ చేస్తే గరిష్టంగా 121 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు.
ఇది ప్రతి రోజు ఆఫీస్, షాపింగ్, చిన్నచిన్న ప్రయాణాలకే కాకుండా వారం రోజుల పాటు కనీస ఛార్జింగ్ అవసరంతో ఉపయోగపడే స్థాయిలో ఉంటుంది. వేగం విషయానికి వస్తే, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌తో 82 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోవచ్చు. సాధారణ సిటీ రైడింగ్‌కి ఇది సరిగ్గా సరిపడే మైల్డ్ స్పోర్టీ స్పెసిఫికేషన్. ఛార్జింగ్ సమయంలోనూ చాలా తేడా లేదు. రాత్రి పెట్టి ఛార్జ్ చేస్తే ఉదయం పూర్తిగా రైడింగ్‌కు రెడీగా ఉంటుంది.

ఈ కొత్త వేరియంట్‌కి కూడా 2.2 kWh వెర్షన్ మాదిరే 0 నుంచి 80 శాతం ఛార్జ్ అవ్వడానికి సుమారుగా 2 గంటల 45 నిమిషాల సమయం పడుతుంది. ఈ వేరియంట్ బరువు కేవలం 117 కిలోలు మాత్రమే ఉండటంతో, ప్రతి పరిస్థితిలోనూ, ట్రాఫిక్‌లో, చిన్నచిన్న మలుపుల్లో, పార్కింగ్‌లో సులభంగా డ్రైవ్ చేయవచ్చు.బ్యాటరీ సామర్థ్యాన్ని తప్పిస్తే, టీవీఎస్ కంపెనీ ఈ వేరియంట్‌కి మరే ఇతర పెద్ద మార్పులు ఇవ్వలేదు.
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ట్యూబులర్ ఫ్రేమ్ పై నిర్మించబడింది. దీని సస్పెన్షన్ సిస్టమ్ సిటీ రోడ్ల మీద స్మూత్ రైడ్‌ను హామీ ఇస్తుంది. ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక భాగంలో ట్విన్ ట్యూబ్ షాక్ అబ్జార్బర్స్ ఉంటాయి, ఇవి చిన్నచిన్న గుంతలు, అడ్డంకులను సైతం సులభంగా ఎదుర్కోవడానికి సహాయపడతాయి. బ్రేకింగ్ సేఫ్టీ పరంగా కూడా TVS ఎటువంటి రాజీ పడలేదు.

ముందు 220 mm డిస్క్ బ్రేక్, వెనుక 130 mm డ్రమ్ బ్రేక్ ఇవ్వడం వల్ల బలమైన బ్రేకింగ్ కన్ఫిడెన్స్ దొరుకుతుంది. అన్ని వేరియంట్ల మాదిరిగానే, 3.1 kWh వెర్షన్‌కి కూడా బ్లూటూత్ ఇంటిగ్రేషన్ కలిగిన కలర్ TFT డిజిటల్ డాష్‌బోర్డ్ లభిస్తుంది. దీని ద్వారా నావిగేషన్, కాల్ అలెర్ట్స్, రియల్ టైమ్ వాహన సమాచారం లాంటి సౌలభ్యాలు పొందవచ్చు.


Click it and Unblock the Notifications








