ఒక్క చూపుతో ప్రేమలో పడిపోతారు.. కొత్త టీవీఎస్ జుపిటర్ 110 స్పెషల్ ఎడిషన్ వచ్చేసింది
భారతీయ మార్కెట్లో గేర్‌లెస్ స్కూటర్‌లకు ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. హోండా యాక్టివా (Honda Activa), టీవీఎస్ జుపిటర్ (TVS Jupiter) వంటి మోడల్స్ ప్రతి నెలా లక్షల్లో అమ్ముడవుతూ అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో టీవీఎస్ జుపిటర్ 110 మోడల్‌కు సంబంధించి సరికొత్త స్పెషల్ ఎడిషన్ విడుదలైంది. నల్లని అందం, అప్‌డేటెడ్ ఫీచర్లు, ఆకర్షణీయమైన డిజైన్‌తో వచ్చిన ఈ స్కూటర్ ధర, మైలేజ్, ఇతర ప్రత్యేకతలు వివరంగా చూద్దాం.
భారతదేశంలో గేర్‌లెస్ స్కూటర్‌ల పట్ల కస్టమర్లకు ఆసక్తి ఎప్పటి నుంచో ఉంది. బజాజ్ సన్నీ, కైనెటిక్ DX, హోండా యాక్టివా వంటి మోడల్స్ ఒకప్పుడు మార్కెట్‌ను ఏలగా, ఇప్పుడు అడ్వాన్సుడ్ మోడల్స్ రాజ్యమేలుతున్నాయి. ఎలక్ట్రిక్ స్కూటర్లు మార్కెట్‌లోకి వచ్చినప్పటికీ, పెట్రోల్ స్కూటర్‌ల ఆధిపత్యాన్ని ఇంకా పూర్తిగా తగ్గించలేకపోయాయి. ప్రస్తుతం దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్‌లలో హోండా యాక్టివా తర్వాత టీవీఎస్ జుపిటర్ రెండవ స్థానంలో నిలుస్తుంది. ఇది విడుదలైనప్పటి నుండి ప్రతి నెలా లక్షలాది జుపిటర్‌లు అమ్ముడవుతున్నాయి.

కాంపాక్ట్ డిజైన్, మంచి స్టోరేజ్ స్పేస్, అద్భుతమైన బిల్డ్ క్వాలిటీ జుపిటర్‌ను ఇతర స్కూటర్‌ల నుండి వేరు చేస్తాయి. అంతేకాకుండా, స్కూటర్‌లో తరచుగా తీసుకొచ్చే మార్పులు కూడా అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు టీవీఎస్ జుపిటర్ 110 మోడల్‌కు సంబంధించి సరికొత్త స్పెషల్ ఎడిషన్ మోడల్‌ను విడుదల చేసింది. ఈ స్కూటర్ ధర రూ.93,031 (ఎక్స్-షోరూమ్).
జుపిటర్ 110 సిరీస్‌లో ఇది అత్యంత ఖరీదైన టాప్-స్పెక్ వేరియంట్ కావడం విశేషం. కొత్త కలర్ ఆప్షన్‌తో వచ్చిన ఈ స్కూటర్ చాలా ఆకర్షణీయంగా ఉంది. ఈ స్పెషల్ ఎడిషన్, కేవలం కాస్మెటిక్ మార్పులతో కూడిన డిస్క్ SXC వేరియంట్‌కు అదనంగా వస్తుంది. పూర్తిగా నలుపు రంగులో ఉన్న ఈ స్పెషల్ ఎడిషన్ మోడల్ ఎవరినైనా మోహింపజేసేలా ఉంటుంది.

క్రోమ్ ఎగ్జాస్ట్ హీట్ షీల్డ్ మినహా, స్కూటర్ బాడీ పూర్తిగా నలుపు రంగులో ఉంటుంది. స్కూటర్ బాడీపై స్టెల్త్ పెయింట్ స్కీమ్‌ను ఉపయోగించారు. బాడీ వర్క్‌పై కంపెనీ లోగో, స్కూటర్ పేరు బ్రాంజ్ రంగులో ఉండటం దీని అందాన్ని మరింత పెంచుతుంది. అమ్మకంలో ఉన్న ఇతర నాలుగు వేరియంట్లలో ఇది క్రోమ్ రంగులో ఉంటుంది.
రూ.93,031 ధర కలిగిన ఈ స్పెషల్ ఎడిషన్ టీవీఎస్ జుపిటర్ 110 సిరీస్‌లో అత్యంత ఖరీదైన మోడల్. కొత్త ఆల్-బ్లాక్ ట్రీట్‌మెంట్ మినహా, స్పెషల్ ఎడిషన్ మెకానికల్‌గా జుపిటర్ 110 డిస్క్ SXC వేరియంట్‌కు సమానంగా ఉంటుంది. అంటే, ఇందులో ఫ్రంట్ డిస్క్ బ్రేక్, బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన డిజిటల్ డిస్‌ప్లే వంటి ఫీచర్లు లభిస్తాయి.

కిక్‌స్టార్టర్‌ను స్టాండర్డ్‌గా ఈ మోడల్ నుండి తొలగించారు. అయితే, కిక్‌స్టార్టర్ కావాలనుకునే వారు దానిని యాక్సెసరీగా అమర్చుకోవచ్చు, ఇది చాలా మందికి ఉపశమనం కలిగించే విషయం. లేదంటే, బ్యాటరీ పాడైతే స్కూటర్‌ను స్టార్ట్ చేయడం కష్టంగా మారవచ్చు.
టీవీఎస్ జుపిటర్‌కు హృదయంగా ఉండే రిఫైన్డ్ 113.3 సీసీ, సింగిల్ సిలిండర్, 4-స్ట్రోక్ ఇంజిన్ ఇందులో ఉంటుంది. సీవీటీ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడిన ఈ ఇంజిన్ 6,500 ఆర్‌పీఎమ్ వద్ద 8 bhp పవర్, 9.8 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. మైలేజ్, పనితీరును మెరుగుపరచడానికి టీవీఎస్ iGO అసిస్ట్ సిస్టమ్ కూడా జుపిటర్‌లో అందిస్తున్నారు. అడ్వాన్సుడ్ iGO అసిస్ట్ టెక్నాలజీ కారణంగా, పాత మోడల్ కంటే మైలేజ్‌లో 10 శాతం మెరుగుదల సాధించబడింది
కంపెనీ ఈ గేర్‌లెస్ స్కూటర్‌లో లీటరుకు 53 కి.మీ వరకు ఫ్యూయెల్ కెపాసిటీ ఇస్తుందని కంపెనీ నమ్మకంగా చెబుతుంది. సౌకర్యవంతమైన, స్థిరమైన ప్రయాణాల కోసం జుపిటర్ 110 ప్రత్యేకంగా రూపొందించబడింది. అధిక వేగంతో కూడా స్థిరత్వాన్ని నిర్ధారించడానికి 1,275 ఎంఎం పొడవైన వీల్‌బేస్‌తో ఈ స్కూటర్‌ను రూపొందించారు. తక్కువ వేగంతో స్థిరత్వాన్ని పెంచడానికి రూపొందించబడిన బాడీ బ్యాలెన్స్ టెక్నాలజీ 2.0 సిస్టమ్ కూడా ఇందులో ఉంది.


Click it and Unblock the Notifications








