226 కిమీల మైలేజ్.. అదిరిపోతున్న Tvs Jupiter CNG స్కూటర్.. లాంచ్ ఎప్పుడంటే..?

ఇండియా టూవీలర్ తయారీదారుల్లో ప్రసిద్ధ కంపెనీ అయిన టీవీఎస్ (Tvs) ఇటీవల కాలంలో సేల్స్ పరంగా బాగా పుంజుకుంటుంది. హీరో మోటోకార్ప్, హోండా వంటి టూవీలర్ కంపెనీలకు బలమైన ప్రత్యర్థిగా నిలుస్తూ, భారతీయ వినియోగదారుల కోసం అదిరిపోయే మోడళ్లను విడుదల చేస్తూ, మార్కెట్లో సరికొత్త టూవీలర్స్‌ను లాంచ్ చేస్తుంది. ప్రస్తుతం పోటీ వాతావరణం ఎక్కువ అయిన నేపథ్యంలో టీవీఎస్ వరుసగా కొత్త మోడళ్లను తీసుకురావడానికి ప్లాన్ చేసింది. ఇటీవల దేశరాజధాని ఢిల్లీలో జరిగిన భారత్ మొబిలిటీ ఆటో ఎక్స్‌పో 2025లో జూపిటర్ 125 CNG మోడల్‌ను ఘనంగా ఆవిష్కరించింది. ఇది కొనుగోలుకు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇతర టూవీలర్ తయారీదారులకు గట్టి పోటీ అవుతుంది. ఈ స్కూటర్ ఎప్పుడు విడుదల అవుతుందా అని చాలా మంది ఎదురు చూస్తున్నారు. దీని గురించిన ఫీచర్స్, డిజైన్, లాంచ్ వివరాలను కింది కథనంలో తెలుసుకోండి..

కాన్సెప్ట్ మోడల్‌గా జూపిటర్ 125 CNGను ప్రదర్శించినప్పటికి ఈ స్కూటర్ ప్రపంచంలోనే మొట్టమొదటి CNG అవుతుంది. ఇది 1.4 కిలోల సీఎన్‌జీ కిట్‌ని కలిగి ఉంటుంది. ఇంధన ట్యాంక్‌‌ను ప్లాస్టిక్ ప్యానెల్‌తో కప్పబడి ఉంది. ఇది ప్రస్తుతం కొనుగోలుకు ఉన్నటువంటి జూపిటర్ 125 మాదిరిగానే సీట్ బూట్ స్పేస్‌‌‌తో వస్తుంది. ముఖ్యంగా ఈ స్కూటర్ ఇంజిన్‌ను OBD2B ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించారు. దీనిలో 124.8cc ఇంజిన్‌ను అందించారు.

Tvs Jupiter 125 Cng Scooter Design

ప్రధానంగా దీని మైలేజ్ విషయానికి వస్తే, కిలో cngకి దాదాపు 84 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణిస్తుందని టీవీఎస్ పేర్కొంది. ప్రెజర్ గేజ్‌ను రైడర్లకు చూపించడానికి ఒక ఐలెట్‌తో పాటు ఫిల్లర్ నాజిల్ దాని చుట్టూ అమర్చి ఉంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ స్కూటర్ CNG ట్యాంక్‌తో పాటు 2-లీటర్ పెట్రోల్ ట్యాంక్‌తో వస్తుంది. రెండు ట్యాంకుల ద్వారా ఇది రన్ అవుతుంది.

CNG, పెట్రోల్ ట్యాంక్‌ రెండు కూడా పూర్తిగా నిండిన తరువాత ఇది 226 కి.మీల మైలేజ్‌ను ఇస్తుందని టీవీఎస్ పేర్కొంది. దీని 124.8 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ 6,000 rpm వద్ద 7.1 bhp పవర్‌ను, 5,500 rpm వద్ద 9.4 nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్, సీఎన్‌జీ ఆప్షన్‌లో లభించడం కారణంగా దేశీయంగా చాలా మంది వినియోగదారులకు ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది.

Tvs Jupiter 125 Cng Scooter Launch

ఇది లాంచ్ అయిన తర్వాత మార్కెట్లో సరికొత్త విప్లవాన్ని సృష్టించే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు సైతం అంచనా వేస్తున్నాయి. ఫర్ఫామెన్స్‌ పరంగా వినియోగదారుల అంచనాలను అందుకున్నట్లయితే అమ్మకాల్లో ఇది తిరుగులేని స్కూటర్‌గా అవతరిస్తుంది. ఈ కొత్త CNG మోడల్, ఇప్పటికే అందుబాటులో ఉన్న ICE వేరియంట్ జూపిటర్ 125 లాగా డిజైన్‌ను కలిగి ఉంది. ఫీచర్స్ మరింత అప్‌డేట్ అయ్యాయి.

ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. పెట్రోలో టూవీలర్స్‌తో పాటు మార్కెట్లోకి ఈవీ మోడళ్లు కూడా లాంచ్ అవుతున్నాయి. ఇలాంటి సమయంలో CNG వాహనాలపై కూడా వినియోగదారులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ తరుణంలో ఈ కొత్త జూపిటర్ 125 CNG అమ్మకాల్లో దుమ్ములేపే అవకాశం ఉందని అంచనా. ఈ స్కూటర్‌ను కంపెనీ 2026 మధ్యలో విడుదల చేసే అవకాశం ఉంది.

Tvs Jupiter 125 Cng Scooter Design Engine

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Monday, February 10, 2025, 9:20 [IST]
English summary
Tvs jupiter 125 cng scooter design engine mileage and launch details check here
Read more on: #tvs motor #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+