ఇదే స్కూటర్ మీరు వెతుకుతున్నది.. తక్కువ ధరకే అదిరిపోయే లుక్‌తో కొత్త టీవీఎస్ జూపిటర్ లాంచ్!

భారతదేశపు దిగ్గజ టూవీలర్ తయారీదారు అయినటువంటి టీవీఎస్ (Tvs) మోటార్ కంపెనీ మార్కెట్‌లో తన వాటాను పెంచుకోవడానికి కీలకంగా దృష్టి సారించింది. ఈ క్రమంలో కొత్త మోడళ్లను విడుదల చేస్తూనే అదే సమయంలో తన పాత వాటిని కూడా మరింత కొత్తగా అప్‌డేట్‌లు చేసి వినియోగదారుల కోసం తీసుకొస్తుంది. ఈ నేపథ్యంలో టీవీఎస్ ఇప్పడు దేశంలో కొత్త జూపిటర్ 125 DT SXC డ్యూయల్-టోన్ (Jupiter 125 Dual Tone SXC) వేరియంట్‌ను విడుదల చేసింది. ప్రసిద్ధ స్కూటర్ ఇప్పుడు మరింత ఆకర్షణీయంగా మారింది. ఇది రెండు కొత్త డ్యూయల్-టోన్ కలర్స్ ఐవరీ బ్రౌన్, ఐవరీ గ్రే లలో కొనుగోలు చేయడానికి అందుబాటులోకి వచ్చింది. ఇవి స్కూటర్‌కు ఒక సాఫిస్టికేటెడ్ లుక్‌ను తీసుకువచ్చాయి.

ప్రత్యేకించి సిటీ రైడింగ్‌లో అందరి చూపు కూడా మీ మీదే ఉంటుంది. ధర విషయంలో చూస్తే, జూపిటర్ 125 DT SXC డ్యూయల్-టోన్ వేరియంట్‌ రూ. 88,942(ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) ధరలో లభిస్తుంది. ఆన్‌రోడ్ వచ్చేసి స్వల్పంగా ఎక్కువగా ఉంటుంది. ఎక్స్ షోరూమ్ ధర దేశంలోని ప్రధాన నగరాలను బట్టి మారుతుంది. దీనిని ప్రతి ఒక్కరు గుర్తుంచకోవాలి. ఇది ఇప్పటికే మార్కెట్లో ఉన్న మోడల్స్ కన్నా కాస్త ప్రీమియం టచ్‌తో వచ్చింది.

Jupiter 125 Dual Tone Sxc Scooter

దీని డిజైన్‌లో ప్రత్యేక అంశాలు ఉన్నాయి. ప్రత్యేకించి, 3D లోగోలు, బాడీ-కలర్ గ్రాబ్ రైల్ స్కూటర్‌కి మరో స్థాయి ప్రీమియం అనుభూతిని కలిగిస్తున్నాయి. ఇవి కేవలం ఒక స్టైలింగ్ మెరుగుదల కాకుండా, బ్రాండ్ గుర్తింపును కూడా బలోపేతం చేస్తాయి. ఈ కొత్త అప్‌డేట్స్‌కు తోడు మెరుగైన కనెక్టివిటీ ఫీచర్లు కూడా దీనికి జోడించారు. ఇది దాని పాత మోడల్‌తో పోలిస్తే ఇంజిన్ పరంగా ఎలాంటి కొత్త మార్పులకు లోను కాలేదు.

ఈ స్కూటర్‌కి సంబంధించిన ఇంజిన్ గురించి చూస్తే ఇది 124.8cc కెపాసిటీ గల ఎయిర్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో రన్ అవుతుంది. ఇది 8.7 bhp పవర్, 11.1 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మెరుగైన ట్రాక్షన్, స్మూత్ స్టార్ట్‌ను అందించగలదు. ఈ ఇంజన్‌కు CVT ట్రాన్స్‌మిషన్ యూనిట్ జత చేయబడినందున, స్కూటర్‌ను డ్రైవ్ చేయడం మరింత సులభంగా, తేలికగా ఉంటుంది.

Tvs Jupiter 125 Dual Tone Sxc Scooter

మెరుగైన ఫ్యూయల్ ఎఫిషియన్సీని ఇది అందిస్తుంది. సస్పెన్షన్ వ్యవస్థ గురించి మాట్లాడితే, ముందు భాగంలో టెలిస్కోపిక్ హైడ్రాలిక్ ఫ్రంట్ ఫోర్క్స్ వ్యవస్థను కలిగి ఉంది. ఇది గుంతలు ఉన్న రోడ్డుపై కూడా ఈజీగా, ఎలాంటి ఇబ్బంది లేకుండా సౌకర్యంగా ప్రయాణించేందుకు అనుకూలంగా ఉంటుంది. వెనుక భాగంలో 3-స్టెప్ అడ్జస్టబుల్ ట్విన్-ట్యూబ్ షాక్ అబ్జార్బర్ అందించబడింది. దీని వలన రైడర్‌కు బంపీల రోడ్లపై కూడా మంచి కంట్రోలింగ్ లభిస్తుంది.

బ్రేకింగ్ చూసినట్లయితే ముందు 220 mm డిస్క్ బ్రేక్, వెనుక భాగంలో 130 mm డ్రమ్ బ్రేక్ లభిస్తాయి. ఈ కాంబినేషన్‌తో రైడింగ్ సురక్షితంగా, అత్యవసర పరిస్థితుల్లోనూ కంట్రోలింగ్‌లో ఉంటుంది. ఈ స్కూటర్ 12-అంగుళాల అల్లాయ్ వీల్స్‌ పై నడుస్తుంది, ఇవి మారుమూల ప్రాంతాల్లో కూడా నిలకడగా నడవడానికి అనువుగా ఉంటాయి. ఇవి స్కూటర్‌కు మరింత స్పోర్టీ లుక్‌ను కూడా కలిగిస్తాయి. దీనిలో లేటెస్ట్ స్మార్ట్‌కనెక్టివిటీ ఫీచర్స్ కూడా ఉన్నాయి.

TVS SmartXonnect కనెక్టివిటీని అందించే డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఉంది. ఈ స్మార్ట్ కనెక్టివిటీ వ్యవస్థ ద్వారా స్కూటర్ డిస్‌ప్లేలో కాల్, SMS అలర్ట్‌లు చూడవచ్చు. రైడ్ చేస్తున్నపుడు నేరుగా మీ డాష్‌బోర్డ్‌పై వచ్చే అలెర్ట్స్‌ ద్వారా, మీరు ఫోన్‌ను చూసే అవసరం లేకుండా సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఇంకా టర్న్-బై-టర్న్ నావిగేషన్, వాయిస్ కమాండ్లు, స్కూటర్ ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి ట్రాకింగ్ వంటి వాటిని కలిగి ఉంది.

More from DriveSpark

Article Published On: Thursday, May 29, 2025, 17:18 [IST]
English summary
Tvs jupiter 125 dual tone sxc scooter launched in india starting price at rs 88 942
Read more on: #tvs motor #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+